తిరుమల,ప్రభన్యూస్: తిరుమలలో ని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు గురువారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామి వారికి జరిగే ఉత్సవానికి వసంతోత్సవమని పేరు ఏర్పడింది. ఎండ వేడినుంచి స్వామి వారు ఉపశమనం పొందేందుకు జరిపే ఉత్సవం కావడంతో దీన్ని ఉప శమనోత్సవం అని కూడా అంటారు. ఈ ఉత్సవంలో సుగంధాన్ని వెదజల్లే పుష్పాలతో పాటు పలు రకాల మధురఫలాలను స్వామివా రికి నివేదిస్తారు. ఈ వేడుకల కోసం ఆకర్ష ణీయంగా మండపాన్ని రూపొందించారు. అలాగే పలు రకాల జంతువులు, చెట్ల ప్రతిరూపాలతో శేషాచల అడవిని తలపించేలా ఈ మండపాన్ని తీర్చిదిద్దారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లు ఈ ఉత్సవాన్ని నిర్వహించలేదు. రెండేళ్ల తరువాత భక్తులకు ఈ వేడుకలలో పాల్గొనేందుకు అవకాశం రావడంతో ఎంతో ఆనందంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు. ఉదయం ఆస్థానం చేపట్టారు.
వైభవంగా స్నపనతిరుమంజనం
వసంతోత్సవాలలో భాగంగా మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీ భూసమేత మలయప్పస్వామివారికి స్నప నతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఈ వేడుకల లో ఒక్కో క్రమతువులో ఒక్కోరకమైన ఉత్తమజాతి పుష్పమా లలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. ఆ తర్వాత స్వామి, అమ్మవారు సాయంత్రం అక్కడినుంచి బయలుదేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.
శేషాచలాన్ని తలపించిన వసంతమండపం
టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటి డైరెక్టర్ శ్రీ శ్రీనివా సులు ఆధ్వర్యంలో వసంతమండపాన్ని శేషాచలం అడవిని తలపించేలా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు , పుష్పాలతో పాటు పలు రకాల జంతువుల ఆకృతులను ఏర్పాటు చేవారు. వీటిలో పులి, చిరుత, కోతులు, పునుగుపుల్లి, కొండచిలువ, కోబ్రా, నెమలి, హంసలు, బాతులు, హమ్మింగ్‌బర్డ్ , చిలుకలు ఉన్నాయి. ఇవి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
15న స్వర్ణ రథోత్సవం
వసంతోత్సవాల్లో రెండవ రోజైన ఏప్రిల్ 15న శుక్రవా రం ఉదయం 8 గంటలనుంచి 9 గంటలవర కు శ్రీ భూసమేత శ్రీ మలయప్పస్వామి వారు స్వర్ణరథంపై తిరు మాడ వీధు లలో ఊరేగుతారు. అనంతరం వసంత మండ పంలో అర్చ కులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు ఏప్రిల్ 16న శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు రుక్మిణి సమేత శ్రీ కృష్ణస్వామి ఉత్సవ మూర్తులు వసంతో త్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, అదనపు ఈవో ఏవి.ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటి ఈవో రమేష్‌బాబు, విజివో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శోభాయమానంగా వసంతోత్సవాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement