Friday, November 22, 2024

సర్వమూ శివమయం

నేటి నుండి పరమ పవిత్ర మాసం కార్తికం. శివుడిని, కేశవుడిని కార్తిక దామోదరుగాను పూజించే మాసం. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైనది కార్తిక మాసం. సర్వమూ శివమయంగా నిలిచిన ఈ పృధివిలో ఆయనక అత్యంత్రపీతికరమైన ఈ కార్తిక మాసం నెల రోజులు శుక్షపక్ష పాడ్యమి నుంచి ప్రారంభించి కృష్ణపక్ష అమావాస్య వరకు భక్తితో శివుడిని పూజించడమే కాదు శివపంచాక్షరి కూడా జపించాలి. శివమానస పూజ దీక్షను పూని ఈ ప్రణవ సహత ఆ పంచాక్షరిని జపించేవారు శివయోగులు. వారు నిరంతరం తమ శ్వాసతోబాటు ‘ఓం నమశ్శివాయ’ను ధారణ చేస్తూ ఉంటారు.

సృష్టి, స్థితి, లయకారులైన బ్రహ్మ, విళ్లు, మహెశ్వరులలో బ్రహ్మ ప్రాథమిక సృష్టి జరిపాడు. ఆ సృష్టి ప్రారంభ సమయాన్ని పగలు అని, అది ముగిసి న కాలాన్ని రాత్రి దీని అంటారు. ఈవిధంగా పురుషాధిష్టితమయిన ప్రకృతి ద్వారా పగలు ఈ ప్రపంచాన్ని సృష్టించి రాత్రి ప్రళయం ద్వారా నశింపచేస్తాడు. ఈ సృ ష్టి అహోరాత్రాలు జరుగుతూనే ఉంటుంది.
ఆదికర్తా చ భూతానాం సంహర్తా పరిపాలక:|
తస్మాన్మాహెశ్వరో దేవో బ్రహ్మణోధిపతి శివ:||

త్రిమూర్తులకు అధిపతి శివుడే! సకల ప్రాణుల్నీ పుట్టించే ఆది కర్త, రక్షకుడు, సంహారకర్త అయిన బ్రహ్మ విష్ణు మ##హశ్వరులైన త్రిమూర్తులకు అధిపతి లయకారకుడైన రుద్రుదే! ఆయనే శివుడు, జగత్కర్త. కోట్ల కొలదీ ఉన్న బ్రహ్మాండాలకు త్రిమూర్తులే నడి పించు ఆదిరూపాలు. అయితే శివునికి అహోరాత్ర కాల విభజన లేదు. ఈ సృష్టి వినాశం శి వుని ఆజ్ఞతోనే జరుగు తుంది.
అసంఖ్యాతాశ్చ కల్పాఖ్యా హ్యసంఖ్యాతా: పితామహా:|
హరయశ్చాష్య సంఖ్యతా స్వైక ఏవ మహెశ్వర:||

ఎన్నో కల్పాలు, బ్రహ్మలు, విష్ణువులు ఉన్న ప్పటికీ పరమేశ్వరుడు మాత్రం శాశ్వ తుడు. ఆయనే ఒక్కడైన పరబ్ర#హ్మ. ఈయన త్రిగుణా తీతుడు.
ఇక మానవుడు జన్మనెత్తిన పిదప స్థూలశరీరం కర్మలను చేస్తుంది. సూక్ష్మ శరీరం ఇంద్రి యాలతో భోగిస్తుంది. కారణ శరీరం ఆత్మను శోధించి ఆత్మానందాన్ని పొందుతుంది. జీవుడు కర్మకు వశుడై సంసార చక్రంలో తిరుగుతూ ఉంటా డు. ఈ చక్రం నుండి బయటపడి ముక్తిని పొందాలంటే త్రిగుణాతీతుడు శాశ్వతుడు అయిన ఈశ్వరుణ్ణి శరణు వేడాలి. సర్వము శివుని ఆధీనంలో ఉంటుంది. బ్రహ్మాండా లన్నీ ఆయన వశంలో ఉంటాయి. అందుకే ఆయన శివుడయ్యాడు. మానస ఐశ్వర్యగుణోపేతుడు పరమేశ్వరుడు. సర్వజ్ఞత, పరిపూర్ణం, తృప్తి, జ్ఞానానికి మూలం, స్వతంత్రత, అక్షీణశక్తి, అనంతత్త్వం అనేవి ఆయన మహా ఐశ్వర్యా లు. ఆయన లింగ స్వరూపుడు. పంచలింగ రూపుడు పరమశివుడు. స్వయంభూ లింగం, బిందు లింగం, ప్రతి ష్టిత లింగం, చర లింగం, గురు లింగం అనే రూపాలతో అర్చించబడుతున్నాడు. పృ ధీవీ లోపల ఉన్న శివుడు ఛేదించుకుని తనకు తానుగా ప్రకటితమవుతాడు. ఆ లింగ రూపములే స్వయంభూ లింగములు. ఇక మిగిలిన లింగ రూపాలు దేవతలచే, ఋషు లచే, శిల్పులచే నిర్మింపబడినవి. తాపత్రయాలైన ఆధ్యాత్మిక, ఆధి భౌతిక, ఆధి దైవిక బాధలు తొలగాలంటే శివా ర్చన చేయాలి. దివ్యమైన పంచాక్ష రి. మంత్రం ప్రణవంతో కలిపి జపించాలి.
‘ఓం’ అనే ఏకాక్షరి సూక్ష్మ ప్రణవం. పంచాక్షరితో కలిపి జపిస్తే స్థూల ప్ర ణవంగా మారుతుంది. ఏ యుగంలోనైనా జపయోగం జన్మ బంధా న్ని తుడిచివేస్తుంది. నమ:, శివాయ ఈ రెండింటి కలయికే ‘నమశ్శివా య’ అను దివ్య పంచాక్షరి. దీనిని ఓంకారంతో కలిపి జపించాలి. అప్పు డది దీర్ఘ ప్రణవాకారమయిన ‘ఓం నమశ్శివాయ’ అవుతుంది. ప్రణవ స్వరూపుడు శాశ్వతుడైన పరమ శివుడే! అందుకే కార్తిక శుక్షపక్షంలో ప్రారంభించి కృష్ణపక్షం చివరివర కూ పంచాక్షరి జపించాలి.
ఈ సృష్టి అనంతమైనది. ఇది శివ స్వరూపము. లోకాల న్నీ శివలోకాలే! అందువలననే శివభక్తులు ముక్తిని పొం దటం తధ్యం. మూలప్రకృతి, మహత్తత్త్వము, అహం, పంచతన్మాత్రలు, పంచ ఇంద్రియాలు, పంచకర్మేం ద్రియాలు, మనసు, పంచభూతాలు మొదలను ఇరవైనాలుగు తత్త్వములు కలసి ప్రకృతి ఏర్ప డింది. ఈ ప్రకృతికి అతీతంగా పురుషుడు ఏర్పడినాడు. ఈ ప్రకృతి, పురుషలిద్దరికీ అతీ తుడు శంకరుడు, అందుకే మహెశ్వరుడు అయినాడు. ప్రకృతియే ‘మాయ’. ఈ మా యాజగత్తును తన వశంలో ఉంచుకొన్న శివుడు మహెశ్వరుడు అయినాడు. జీవు లను ఈ మాయా బంధం నుండి తప్పిం చువాడు మహెశ్వరుడు. మాయ అనే దు:ఖాన్నుండి దూరం చేస్తాడు కనుకనే రుద్రుడయినాడు.
పిండములో ఆరుకేశములు గల వు. అందు మూడు పురుష అంశలు, మూడు స్త్రీ అంశలు, మూడు స్త్రీ అంశలు. కావున ఈ సృష్టి స్వరూపము సర్వమూ అర్ధనారీ శ్వరము. అవియే శివ, శక్తి సమ్మేళనములు. సృష్టి కార్యములో ఏకత్వ భావన అయిన సచ్చిదానందము ను ప్రకృతి, పురుషులు అను భవించుచున్నారు.. అక్కడ ద్వైతము లేదు. సర్వమూ అద్వైతము.
ఈ అనంతమైన సృష్టి కార్యములో శివశక్తి సంయోగము అవిశ్రాంతముగా, అఖండముగా అమోఘంగా సాగిపోవుచున్నది. ఇది ఒక అజరామర క్రియ. సృష్టి, స్థితి, లయములు కూడా విరా మం లేనివి. అయితే లయకారుడైన శివుడు శాశ్వతుడు. శక్తితో కూడి ఉన్నప్పుడు సచ్చిదానంత స్వరూపుడై తనను శపించిన వారికి ఆనం దాన్ని, వైరాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు.

– వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు, 80746 66269

Advertisement

తాజా వార్తలు

Advertisement