Monday, September 16, 2024

ఇక్కడ అందరూ ఒక్కటే..!

ప్రపంచంలో ఎన్ని విలు వైన వస్తు సంపదలు న్నా అవి ఏవీ కాలం ముందు ఎందుకూ సాటి రావు. ప్రపంచాధి నేతలైనా, కో ట్లకు పగడలెత్తిన సంప న్నులైనా కాలాన్ని తాము అనుకున్న రీతిలో సాగిం చలేరు. అందుకే ఓడలు బం డ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. ఎవరి కర్మానుసా రం వారికి కాలం వారి జీవితాన్ని నడుపుతుంది. సత్యధర్మాల ను పట్టుకుని కర్తవ్యాన్ని ఆగకుండా చేస్తుండేవారికి కాలం అను కూలంగా ఉన్నట్టు అగుపిస్తుంది. కర్తవ్యం విస్మరించిన వారికి కాలం ప్రతికూలంగా పరుగెడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కాలం ఏదీ చేయదు. దానికి రాగద్వేషాలు లేవు. ఎవరి కర్మకు వారి ఫలాన్ని అందిస్తుంది. అంతేకాదు కాలం ఒక సెకను కూ డా ఎవరి కోసమూ ఆగదు. ఎంత ధనం పోసినా కొనలేనిదీ, అమ్మలేనిదీ, అప్పు తెచ్చుకోలేనిదీ, ఇచ్చుకోలేనిదీ, గడిస్తే మర లా తెచ్చుకోలేనిదీ ఈ ప్రపంచంలో కాలం ఒక్కటే!
ప్రణాళికాబద్ధంగా, సమయస్ఫూర్తిగా, వాయిదా పద్ధతి లేక మరలిరాని ‘కాలాన్ని’ ఉపకరించుకునేవారికి తీరికే దొరక దు. ప్రతి మనిషీ తాను చేసే పనులను ఎప్పటికప్పుడు విమ ర్శించుకుంటూ పదుగురి సాయపడుతూ కాలాన్ని గడపాలి. ఒక్క నిమిషం వృథా గా గడిపినా కూడా ఎంతో విలువైన సమ యం పోగొట్టుకున్నట్టే అవుతుంది. కనుక కాలం విలువ తెలిసి ప్రతి పనిని విశ్లేషించి అవసరాలకనుగుణంగా క్రమపద్ధతిలో చేయగలగాలి.
అందుకే కాలాన్ని అతి జాగ్రత్తగా సద్వినియోగం చేసు కోవాలి. ముందు ఏమి జరుగుతుందో, ఏమవుతుందో ఎవ్వ రూ చెప్పలేరు. ఉన్న సమయాన్ని తమ భవితకు అనుకూ లంగా మలుచుకున్నవారే విజ్ఞులు. కులమతాలు, జాతులు, ప్రాంతాలు, వయసులు, స్త్రీ పురుషులు, పం డిత పామ రులు, ధనిక, దరిద్రులు ఎవరైనా కాలానికి తలవంచాల్సిందే. గడచిన బాల్యాన్ని ఎవరు వెనక్కు తేగలరు? కౌమారం, యవ్వనం ఎవరికి వస్తాయి మళ్లిd? మధ్య వయస్సు నుండి వృద్ధాప్యంలోకి జారడానికి ఎంతసేపు? అందుకే శిశువు నుండి ముసలిగా మారేదాకా ప్రతి క్షణాన్నీ అపురూపం అని గుర్తించి మసలుకుంటూ ఏ వయసులో బాధ్యతలను ఆ వయసులో తీర్చుకోవాలి.అందం ఉందని అ#హంకరిస్తే కాలంతోపాటు అందమూ కరిగిపోతుంది. మరి అప్పుడు అ#హంకారానికి విలువే ఉండదు. సమయం విలువ తెలిసినవారు తెలియని పసిపిల్లలకు అర్థమయేలా చెప్పాలి. పసిబిడ్డలు ఎదిగే ప్రతి దశ లోను వారి పెంపకంలో మెళకువలను పాటించాలి.
మన ధర్మశాస్త్రాలు అందుకే బ్ర#హ్మచర్యం, గార్హస్థ్యం, వా నప్రస్థం, సన్యాసాశ్రమాలను, ఆ ఆశ్రమాల్లో కాలానుగుణం గా పాటించాల్సిన బాధ్యతలను చక్కగా వివరించారు. ఏ వయసులో ఆ ఆశ్రమ ధర్మాలను కాల#హరణం లేక ఎవరు పూర్తిచేయగలరో వారు ఏనాడూ పశ్చాత్తాపానికి లోనయే అవకాశముండదు. విద్యార్థులు, ఉద్యోగులు, గృ#హణులు, వ్యాపారులు, ఇతర ఏ జీవనోపాధి కల్గినవారు కాలం విలువ తెలుసుకుంటే తమ జీవిత ప్రణాళికను తాము సిద్ధం చేసుకుని విజయాలు సాధించగలరు. అసలు పని చేయని మనిషి అంటూ ఎవరూ ఉండరు. ఎంత చేసినా సమయం మిగిలిపో తుంది అనుకున్నారంటే వారు చేయవలసింది ఏదో చేయడం లేదనే విషయాన్ని గుర్తించి సరి చూసుకోవాలి. అట్లా అని ఇత రులకు సాయం చేయకుండా కేవలం స్వార్థంతో ఉండకూడ దు. వివేక విచక్షణలతో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
కాలం ఎప్పుడూ మన చేతిలోనే ఉందని అనుకుంటాం కానీ దాని అదుపులో మనం ఉన్నామని తెలుసుకోలేము.
ప్రాణంగా ప్రేమించిన కుటుంబ సభ్యులు మరణిస్తే జన్మ లో వాళ్ళను మర్చిపోయి బ్రతకలేము అనిపిస్తుంది. కొన్ని రోజులు నెలలు అలాగే ఉంటుంది కూడా. కానీ కాలం గడిచే కొద్ది పోయిన మనిషిని మర్చిపోయి వాస్తవ ప్రపంచంలోకి వస్తాము. ఆ నైరాశ్యం నుండి, ఆ జ్ఞాపకాల నుండి బయట పడ తాము. అదే కాల మ#హమ. ఏదైనా మర్చిపోయేలా చేసే శక్తి కేవ లం కాలానికే ఉంది. ప్రపంచాన్ని ఎదిరించి కలిసి బ్రతుకుదాం అని, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ప్రమాణాలు చేసు కున్న ప్రేమికులు కాలం కలిసి రాక విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటే, ఎప్పుడో- ఎక్కడో అనుకోకుండా ఎదు రుపడితే అపరిచితుల్లా పక్కకు తప్పుకుని వెళ్ళిపోయేలా చేసేంత గొప్పది ఈ కాలం.
ఒకే కంచం, ఒకే మంచం అన్నట్టు ఉండే ప్రాణ స్నే#హతు లను కూడా బద్ద శత్రువులను చేసే శక్తి ఒక్క కాలానికే ఉంది. కొత్తగా పరిచయం అయిన వారిని తక్కువ కాలంలోనే మంచి స్నే#హతులనూ చెయ్యగలదు. ఈరోజు ఒకరి ముందు చేతులు కట్టుకుని నిలబడ్డ మనిషి కష్టం, స్వశక్తి, తెలివి, అదృష్టం అన్నీ కలిసి పదిమందికి పని ఇచ్చే స్థాయికి వెళ్ళేలా చేసేంత గొప్పది కాలం. ఒకప్పుడు పెట్టిన చేతినే, సాయానికి చేయి చాచేలా చేయగలదు. అన్నీ ఉన్నాయని ఎగిరిపడేవాడిని ఏమీ లేని వాడిగానూ చెయ్యగలదు. ఇక్క డ అందరూ ఒక్కటే… ఎవరూ కాలాతీతులు కాలేరు!

Advertisement

తాజా వార్తలు

Advertisement