Saturday, September 14, 2024

భగవంతుడి ప్రతి రూపమే ఆత్మ!

ఆత్మ, పరమాత్మ అనే పదాలను తరచుగా ఆధ్యాత్మిక ప్రసంగాల్లో వింటూ ఉంటాము. అనేకమంది స్వామీజీలు లేదా ఆధ్యాత్మికవేత్త లు ఆత్మ, పరమాత్మల గురించి వారి ఆధ్యాత్మిక ప్రసంగాల్లో వివరి స్తుంటారు. కానీ వారికి ఉండే భాషా పరిజ్ఞానం సామాన్య ప్రజానీకా నికి ఉండదు కదా! అందువల్లే ఎన్ని గంటలపాటు వారి ప్రసంగాలు విన్నప్పటికీ ఆత్మ- పరమాత్మ అంటే అర్ధం చెప్పడం చాలామంది సాధ్యంకాదు. అందుకే ఎప్పటిప్పుడు అసలు ఆత్మ అంటే ఏమిటి? పరమాత్మ అంటే ఏమిటి? అనే సందేహం కలుగుతుంది.
ఆత్మ- పరమాత్మ అనే రెండూ ఒకదానికి మరొకటి పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. ఒకే ఆబ్జెక్ట్‌కు ఉండే రెండు నామార్ధాలే అవి. అది ఎలా అంటే పరమాత్మ అంటే భగవంతుడు. ఆత్మ ఆయన ప్రతిబింబం. అంటే ప్రతి జీవిలో ఉన్నది ఆయన ప్రతి బింబమని ప్రతి ఒక్కరూ భావించవచ్చు. ఇదే విషయాన్ని కురుక్షేత్ర సంగ్రామ సమయంలో భగవానుడు శ్రీకృష్ణుడు తన భక్తాగ్రేసరుడు, ప్రియ మిత్రుడు, బావ అయిన అర్జునకు ఇలా వివరించాడు.
”అర్జునా! ఈ సమస్త సృష్టి యందునూ ప్రతియొక జీవిలోనూ నేను నిండియున్నాను. నా ప్రతి స్వరూపమే ఆత్మస్వరూపాన జీవుల న్నింటిలోనూ నిండియున్నది. కనుక అర్జునా! సంశయింపకుము, చంపెడి వాడెవ్వడు, చచ్చెడి వాడెవ్వడు, అంతయూ నేనే, ఇది అం తా నా చిద్విలాసము, నీ భౌతికస్వరూపము ద్వారా ధర్మ సంస్థాపన చేయుచున్నాను, నీ యందునూ నేనే నిండియున్నాను, నువ్వు చేయ వలసిన విధిని నీవు నిర్వర్తింపుము, పాప పుణ్యముల ఫలితమును నాపై వదిలి వేయుము. నీ సంశయమును దీర్పనెంచి నా విశ్వరూప మును ప్రదర్శించుచున్నాను” అంటూ అర్జునుని సందేహాలను తీర్చే క్రమంలో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. తద్వారా సమస్త ప్రాణకోటికీ ఆత్మ-పరమాత్మల స్వరూప, స్వభావాలను విస్పష్టంగా చెప్పడం జరిగింది.
భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునునకు ఉపదేశించిన విధంగా నీవు, నేను, జంతువు, క్రూరమృగాలు, క్రిమి, కీటకాదులనే భేదంతో నిమిత్తం లేకుండా భగవంతుడి ప్రతి స్వరూపం ప్రతి ఒక్కరిలోనూ నిండియున్నది. అది ఎలా అంటే- ఇక్కడ ఆత్మ, పరమాత్మ అంటే వేరుకాదు. సాధారణ వ్యావహారిక భాషలో చెప్పుకోవాలంటే ఉదా #హరణకు అద్దంలో చూచుకొనే మనిషి అసలు స్వరూపమైతే, అద్దం లో కనబడేది ప్రతిబింబ స్వరూపం. ఎప్పుడైతే మానవుడు అద్దం ముందు నిలబడతాడో ప్రతిబింబం రూపేణా అతడే అద్దంలో కనబ డతాడు. ఎప్పుడైతే మానవుడు అద్దం ముందు నుండి తొలగుతాడో, అప్పుడు అతడి ప్రతిబింబం తొలగిపోతుంది. అదేవిధంగా జీవి అసలు స్వరూపం భగవంతుడు అయినట్లయితే ఆయన ప్రతిరూప మే ఆత్మ. దానినే జీవి యొక్క ప్రాణం లేదా జీవంగా పేర్కొనవచ్చు.
ఎప్పుడైతే ఐహక దేహమనే అద్దం నుండి ఆత్మ అనే భగవంతు డి ప్రతిబింబం తొలగిపోతుందో… అప్పుడే జీ వికి మరణం సంభవి స్తుంది. ఇదే సృష్టి రహస్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement