Tuesday, November 5, 2024

శాశ్వత గుప్త ధనం…విజ్ఞానం!

ఏది దైవమో, ఏది ధర్మమో, ఏది జడమో, ఏది చేతనమో, ఏ ది మంచి, ఏది చెడు, ఏది మట్టి, ఏది మాణిక్యమో తెలుసుకోవడానికి మనిషికి అసలైన సాధనం జ్ఞానం. ఆ జ్ఞానాన్ని అందించే ది విద్య. మనిషికి విద్య సంస్కారాన్ని నేర్పుతుంది. నైతికతను పెంచుతుంది. విద్యకు, వినయానికి అవినా భావ సంబంధముంది. ఎవరితో ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది.
విద్య నేర్చే పాఠశాల ఏదైనా అది విజ్ఞానాన్ని ప్రసాదించే ఆలయమే. అక్కడ గురువే దైవం. ఆ పాఠశాలలో పే ద, గొప్ప భేదాలు ఉండవు. దశరథ కుమా రులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వసిష్ఠుడి దగ్గర, బలరా మకృష్ణులు సాందీపని ముని వద్ద రాజకుమారుల్లా విద్యనభ్యసిం చలేదు. నిరాడంబరంగా, సామాన్యుల్లాగే చదువుకున్నారు. సా మాజిక రాజనీతి విషయంలో శ్రీరామచంద్రుడిని నేటికీ ఆదర్శ మూర్తిగా భావించడానికి కారణం- గురువుల దగ్గర ఆయన విన య విధేయతలతో విద్యన భ్యసించడమే.
శ్రీకృష్ణ కుచేలుర మైత్రి కేవలం గురుకులం వరకే పరిమితం కాలేదు. కృష్ణుడు ఎంతో ఉన్నతస్థాయికి ఎదిగాక కూడా కుచేలు డిని ఆ దరించాడు. ఆ సం స్కారం ఆనాటి విద్యావిధానం నేర్పినదే విద్య మాత్రమే మనిషికి ఎన లేని కీర్తిని అందిస్తుంది. అష్టావక్రుడికి రాజ సన్మానాన్ని అందించినది వారి జ్ఞానమే కాని, ఎనిమిది వంకరలు కలవారి దేహంకాదు. అలాగే జన్మతో నిమిత్తం లేకుండా తాను నేర్చుకున్న ధనుర్వి ద్యలో చూపించిన ప్రతిభవల్ల గొప్ప విలుకాడిగా పేరు తెచ్చుకు న్నాడు. ఏకలవ్యుడు. అందుకే చాణ క్యుడు ”విద్య గుప్తధనం వంటిది… కామధేనువు లాంటిది. కామధేనువు కోరికలు తీర్చినట్లు విద్య కూడా సుఖసం తోషాలను ఇస్తుం ది” అని బోధించాడు.
మనిషికి ఎన్ని సిరిసంపదలున్నా విద్య ఉండి తీరాలి. లేకపోతే వాటిని రక్షించుకునే సామర్థ్యం ఉండదు. అందుకే బాల్యం నుంచే ప్రతీ ఒక్కరూ విద్య మీద శ్రద్ధ చూపించాలి. అక్కడ అలక్ష్యంగా ఉంటే భవిష్యత్తు మొత్తం అంధకారమవుతుంది. విద్యతో సమా నమైన బంధువు ఉండరని హతోపదేశం వివరించింది.
విద్య మానవత్వాన్ని ధార్మికతను పెంచుతుంది. నిత్య జీవి తంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించుకు నే తెలివి విద్య ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. విశిష్టమైన తేజ స్సును ప్రసాదించి దేశాంతరాలలో బంధువులా అదుకునే విద్య దైవ సమానమైనది. చంద్రుడు రాత్రిని వెలుగుతో నింపినట్లుగా విద్యావంతుడు, సజ్జనుడు అయిన వ్యక్తి కుటుంబంలో కనీసం ఒక్కరున్నా చాలు అతడి విజ్ఞా నకాంతులు. ముందు తరాలకు వెలుగుబాటను చూపుతాయి. ప్రతి మనిషి తన కుటుంబానికి ఆధారంగా, ఊరికి ఉపకారిగా, దేశానికి సేవకుడిగా జీవించాలంటే అతడు విద్యాధికుడై ఉండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement