Saturday, November 23, 2024

భావనా బలమే గొప్పది.. పరమహంస!

”మీరు నన్ను ఏ దృష్టితో చూస్తున్నారు?” అని భార్య అడిగింది.
”దేవాలయంలో ఏ దేవి పూజలందుకుం టుందో, ఏ తల్లి శరీరం నన్ను కన్నదో, ఆమే నాకు ఇప్పుడు సేవ చేస్తున్నదని భావిస్తున్నాను”- ఇదీ భర్త జవాబు.
అలా అడిగిన భార్య పేరు శారదామణి. జవా బిచ్చిన భర్త పేరు రామకృష్ణుడు. భార్యను జగన్మా తగా భావించిన ధీశాలి ఆయన. మొదట ఆయన ను పిచ్చివాడిగా భావించింది లోకం. బాహ్య స్పృ హ లేకుండా, నిరంతర ఆలోచనలతో గడపడమే అందుకు కారణం. ఆ ఆలోచనలన్నీ ఎప్పటికీ ప్రత్యక్షం కాని జగన్మాత గురించే. స్త్రీ అంటే, ఆయ న దృష్టిలో జగన్మాతే. అది భార్య కావచ్చు. తల్లి కావచ్చు. మరే స్త్రీ అయినా కావచ్చు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన శారదామణిని పూజాపీఠం మీద కూర్చో బెట్టి, షోడశోపచారాలతో పూజించడమే దీనికి నిదర్శనం.
భావనాబలమే గొప్పది. దానికి మరేదీ సాటి రాదు. ”బంగారు నాణాన్నయినా, మట్టి బెడ్డనైనా ఒకే విలువ కలదానిగా భావించినవాడే గొప్పవాడు” అని బోధించారాయన. కుల మతాలు అనేవి లేవని, ఉన్నతమైనదీ, అధమమైనదీ అనే భేదం దేవుడి దృష్టిలో లేనేలే దని భావించేవారు. లోకులు అధములుగా చూస్తుండేవారి ఇళ్లకు వెళ్లేవాడు. వారిళ్ల ను శుభ్రపరచేవాడు. అదంతా పిచ్చిగా భావించేవారు సామాన్యులు. ఆ చర్యలు తన భావనను ఆచరణాత్మకంగా బోధించడమేనని గ్రహించినవారు అతి తక్కువమంది. మాటల ద్వారా కంటే, చేతల ద్వారా బోధించడమంటే అదేనని గ్రహించారు వారం తా. మతం విషయంలోనూ అదే భావన. ఎక్కువ తక్కువలనేవి ఏ మతంలోనూ లేవని నమ్మినవాడు. చూడగలిగే సత్తా ఉంటే భగవంతుడు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో సాక్షాత్కరిస్తాడని భావించిన వ్యక్తి. కాబట్టే సూఫీ పద్ధతిలో ధ్యానంచేసి అల్లా రూపంలోను, క్రైస్తవ సన్యాసుల పద్ధతిలో సాధన చేసి ఏసుక్రీస్తు రూపంలోను భగవంతుడిని సాక్షాత్కరింప జేసుకు న్నాడని చెబుతారు.
”మీరు దేవుడిని చూశారా?” అని అడిగిన నరేంద్రుడి ప్రశ్నకు తడుముకోకుండా ”చూశాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూశాను. ఇంకా చెప్పాలంటే… అంతకంటే ఎక్కువ సన్నిహితంగా చూశాను” అని రామకృష్ణులు బదులిచ్చారంటారు. అంతటితో ఆగకుండా ”చూడగలిగే సత్తా ఉంటే నీకూ చూపించగలను” అని చెప్పారట. ఆ సమాధానం చెప్పిన తీరులోనే తన అన్వేష ణ ఫలించిందని గ్రహించాడు నరేంద్రుడు. ఆ క్షణంలోనే ఆయనను తన గురువుగా నిర్ణయిం చుకున్నాడు.
రామకృష్ణుల బోధనా విధానం అత్యద్భు తమైనది. ”మానవుడై పుట్టినవాడు వినమ్రు డై, విశుద్ధుడై ప్రేమపూరిత హృదయంతో మెల గాలి” అని బోధించేవారు. భగవంతుడు సర్వాంతర్యామి. ప్రతి జీవి సాక్షాత్తు భగవత్స్వ రూపమని తలచి సాటిజీవికి సాయం అందిం చాలని ఉద్బోధించేవారు.
బాధ్యతల నుంచి ఎవరూ తప్పించుకో కూడదని ఆయన చెప్పేవారు. ఇ#హలోక బం ధాలను చూసి ”నిర్వికల్ప సమాధిలోకి వెళ్లిపో వాలని ఉంది” అన్న నరేంద్రుడితో ”నువ్వు దీన జనుల సేవ చేయడానికి, వారిని ఉద్ధరించడా నికి జన్మించావు, నీ జీవిత పరమార్థం వేరే ఉం ది” అని కర్తవ్యోన్ముఖుణ్ని చేశారు.
రామకృష్ణుల దృష్టిలో, బోధనలో స్పష్టత ఉండేది. నవ్వుతూ, పరిహాసాన్ని జోడిస్తూనే అతి గంభీరమైన విషయాలను, ఆధ్యా త్మిక అంశాలను బోధించేవారాయన.
”ఇంట్లోని వాళ్లు మెలకువగా ఉంటే దొంగలు చొరబడలేరు… నువ్వు సదా జాగ రూకుడవై ఉంటే- చెడు తలంపులు నీ మనసులోకి చొరబడలేవు” అనేవారు.
”మానవ జీవితం దుర్లభమైనది. అది పొందినప్పుడే భగవంతుడిని తెలుసు కోవడానికి ప్రయత్నించని మనిషి జీవితం నిరర్థకం. ఆ ప్రయత్నం ముక్కు మూసు కుని మూలకూర్చుని కాదు. నలుగురి క్షేమం కాంక్షిస్తూ, అందరిలో ఒకడిగా మెలుగు తూ, సాధ్యమైనంతగా ఇతరులకు సేవ చేస్తూ…” అంటారాయన. రామకృష్ణుల బోధ నలు నిత్యసత్యాలు. అన్ని కాలాలకూ అనుగుణమైనవి. వాటిని ఆకళింపు చేసుకుంటే మానవజన్మ సార్థకత పొందుతుం ది. ఆచరిస్తే ఉత్తమ స్థితి లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement