Saturday, November 23, 2024

పంచముఖ ఆంజనేయుని ఆవిర్భావం!

హనుమంతుడు శ్రీరాముడికి పరమభక్తుడు, హనుమంతు డు భక్తసులభుడు, హను మంతుడి కరుణాకటాక్షాలు కలగాలంటే శ్రీరాముడిని పూజించి భజ న చేస్తే చాలు భజన చేస్తున్న ప్రదేశంలో హనుమంతుడు ఏదో ఒక అవతారంలో ఉంటాడు అని శాస్త్రాలు తెలి యజేస్తున్నాయి. అలాగే ఆంజనేయస్వామి నవ అవతారాలలో దర్శనం ఇస్తాడు. ఆంజనేయ స్వామి నవావతరాలు ప్రసన్నాంజనే యస్వామి, వీరాంజనేయస్వామి, వింశతి భుజ ఆంజనేయస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి, అష్టాదశ భుజ ఆంజనేయస్వామి, సువర్చల ఆంజనేయస్వామి, చతుర్భుజ ఆంజనేయస్వామి, ద్వా త్రింశద్భుజ ఆంజనేయస్వామి మరియు వానరాకార ఆంజనేయ స్వామి.
ఆంజనేయస్వామి నవావతారాలలో పంచముఖ ఆంజనేయ స్వామి శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించాడు.
శ్రీమద్రామయణంలో యుద్ధకాండలో పంచముఖ ఆంజనే య స్వామి రూప వివరణ వుంటుంది. రామరావణ యుద్ధంలో రావణుడు మహరావణుడి సాయం కోరతాడు, పాతాళానికి అధిప తి మ#హరావణుడు. ఆయన విభీషణుడి రూపంలో వచ్చి ఆంజనే యుడు ఏర్పాటు చేసిన వాల సయనమందిరము (తోకతో ఏర్పాటు చేసినది) నుండి రామలక్ష్మణులను అపహరిస్తాడు. అది తెలుసుకొ న్న ఆంజనేయుడు శ్రీరామ లక్ష్మణులను వెతకడానికి పాతాళానికి వెళ్తాడు.
పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకేసారి విచ్ఛిన్నం చేస్తే మహరావణుడు ప్రాణాలు వీడతాడని తెలుసుకొన్న పవనుడు పంచముఖ ఆంజనేయ స్వామి రూపం దాలుస్తాడు. అందులో ఒక ముఖం ఆంజనేయుడిది కాగా గరుడ, వరాహ, హయగ్రీవ, నరసింహాదులు కలసి పంచముఖ అవతారంగా ఏర్పడి ఆ దీపాలను ఒకేసారి విచ్చినం చేసి (ఆర్పి) శ్రీరామ లక్ష్మణులను కాపాడుకొంటాడు.
ఆంజనేయస్వామి పంచముఖాలు ఐదు దిక్కుల వైపుకు దృష్టిని సారించి ఉంటాయి. తనను కొలిచే భక్తులను పంచముఖుడు సర్వవే ళలా కాపాడుతాడు.
తూర్పుముఖముగా గల హనుమంతుడు పాపాలను హరించి, చిత్తశుద్ధిని కలుగచేస్తాడు. బాధలు కష్టాల నుండి రక్షిస్తాడు.
దక్షిణముఖంగా వున్న ఆంజనేయుడు కరాళ ఉగ్ర నరసింహ స్వామి. శతభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు. నరసిం హ, దక్షిణాభిముఖుడు, దుష్ప్రభావాల నుండి రక్షిస్తాడు.
పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టి, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు. గరుడు, పడమటి దిక్కు వైపు ఆసీనుడై, ఆయుర్దాయాన్ని పెంపొందించేవాడు.
ఆంజనేయస్వామి ఉత్తరముఖము లక్ష్మీవరాహమూర్తి. గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అ్టషశ్వర్యాలు కలుగజేస్తాడు. వరాహ, ఉత్తరాభిముఖుడు, మంచి జీవితాన్ని ప్రసాదించువాడు.ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి ముఖం జ్ఞానాన్ని, జయా న్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement