Tuesday, November 19, 2024

జగన్మాత ఆవిర్భావం

వ సంత నవరాత్రులలోనే చైత్ర శుద్ధ నవమి నాడు అంటే… శ్రీరాముడు జన్మిం చిన రోజే, రాక్షస సంహారానికి మూలం అర్థనారీశ్వర తత్త్వం తెలియపరచ డానికి, జగత్కల్యాణం నిమిత్తం ‘జగన్మాత’ ఆవిర్భవించింది. ఈ విషయం చాలాకొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆమె ఎలా ఆవిర్భవించింది తెలుసుకొందాం.
దక్షయజ్ఞంలో సతీదేవి యోగాగ్నిలో దగ్ధం అవ్వడం వల్ల, ఈ చరాచర జగత్తు అంతా నిర్వీర్యమైపోయింది. ముల్లోకాలు సౌభాగ్య రహతమయ్యాయి. మూడు లోకాలలోని వారంతా నిర్వీర్యంతో, ఉదాశీనులై, చింతలతో, రోగాలతో అలమటి స్తున్నారు. గ్రహాలు, ఉపగ్రహాలు, దేవతలు, ఒక నియతి లేకుండా వర్తించడం మొద లయ్యింది. ఇదే సమయంలో బ్రహ్మ తారకాసురుడుకు ఇచ్చిన వరాలతో, గర్వంతో, ముల్లోకాలకు నాయకుడుగా చెలామణి అవుతున్నాడు.
ప్రజా కంటకంగా మారి, ప్రజలను అనేక ఇక్కట్లకు గురిచేస్తున్నాడు. శివుని పుత్రుడుగా జన్మించినవారు మాత్రమే తారకాసురుడును సంహరించగలడనే బ్రహ్మ ఇచ్చిన వరం ఎప్పుడూ సిద్ధిస్తుందా? ఈ రాక్షసుని పీడ ఎప్పుడు తప్పుతుం దా? అని దేవతలు తలపోస్తున్నారు. శివునికి భార్యే లేదు. ఆయన విరాగిగా మారిపో యి మహాదేవి గురించి తపస్సు చేస్తున్నాడు. మరి పుత్రుడు ఎప్పుడు జన్మిస్తాడో? ఈ కష్టాలన్నీ గట్టెక్కేది ఎప్పుడో? అని విచారిస్తూ, వారంతా శ్రీహరిని ఆశ్రయిస్తే, ఏదైనా ఉపాయం దొరకకపోదు. అంటూ దేవతలు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని స్తుతించారు. శ్రీహరి వారందరినీ ఊరడించి, ”దేవతలారా! చింతించకండి. మన కోర్కెలు తీర్చ డానికి కల్పవల్లి, కరుణామయి శ్రీ మన్మాహాదేవి (జగన్మాత) ఆవిర్భవించబోతోంది. ఈమె మణిద్వీప వాసిని. మనం చేసే అపరాధాల వల్ల జగన్మాత ఇలా ఉపేక్షించి ఊరు కొంది. మనలో చైతన్యం రావడం కోసం ఇలా శిక్షిస్తోంది.
శిక్షించినా, లాలించినా,, కోపగించుకొన్నా తల్లికే తగును. వాస్తవానికి ఏ తల్లికి బిడ్డమీద నిజమైన కోపం ఉండదు. తల్లి కనుక క్షమిస్తుంది. దేవతలారా! మీరందరూ జగన్మాతను శరణువేడండి. జగదీశ్వరి మిమ్ములను రక్షిస్తుంది. రాక్షస పీడ తొలగు తుంది.” అని ఉపశమన వాక్యాలు చెప్పి పంపగా, దేవతలు అంతా, హమపర్వతా నికి బయలుదేరి, ప్రశాంత ప్రదేశం చూసుకొని అంబికా మంత్రాన్ని జపిస్తూ, యజ్ఞా లను దీక్షతో నిర్వహంచడం వల్ల, కొందరు నామ పారాయణ, కొందరు సూక్తి పారా యణ, మరికొందరు మంత్రపారాయణ, కొన్ని సం.రాలు నిష్ఠ నియమాలతో చేయ డం వల్ల, చైత్రమాసం నవమి భృగు వారం రోజున మహాతేజస్సుతో, జగన్మాత ఆవి ర్భవించింది. ఆమెకు నాలుగు వైపులా నాలుగు వేదాల ఘోష వినపడుతోంది. (వేదాలు ఆమె సౌందర్యం స్తుతిస్తున్నాయి). కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ, ఆద్యంతాలు లేనట్లుగా ఉంది.
ఆమెను చూసిన తర్వాత ఆమె స్త్రీ రూపం కాదే? అలా అని పురుష రూపం కూడా కాదే, మరే రూపమో! దేవతలు భావిస్తుండగా, వారి కళ్ళు కాంతికి మసక బారిపో యాయి. ధైర్యంతో, కళ్ళు తుడుచుకొని, పరికించి చూస్తే ఆమె ఒక స్త్రీ రూపంలో దర్శ నమయ్యింది. నవ¸°వనవతిగా, రాశీభూత సౌందర్యంతో, చిరు మువ్వల సవ్వడి చేస్తూ, బంగారు కంఠాభరణాలు, మంజీరాలు, మొలనూలు, చేతులనిండా ధగధగ మెరిసే బంగారు గాజులు, మొగలి, సువాసనలు వెదజల్లే పూలతో కొప్పు, విశాలమైన కటిప్రదేశం, సువాసనలు వెదజల్లే నోరు, చెవులకు అలంకరించిన చంద్రరేఖలు, దట్టమైన కనుబొమ్మలు, నుదుట మూడవ కన్నులా ప్రకాశిస్తున్న ఎర్ర టి కుంకుమ బొట్టు, పాశాంకుశ వరదాభయ హస్తాలు, ఎర్రని చీరతో ధగధగ లాడుతున్న జగన్మాతను చూసి దేవతలంతా, సాష్టాంగ పడి —
”నమో దేవ్యై,మహాదేవ్యై శివాయ నమ:
నమ: ప్రకృత్యై భధ్రాయై నియతా: ప్రణతా: స్మృతామ్‌!!”
కాళరాత్రి! బ్రహ్మసుతా! వైష్ణవి! స్కంద జననీ! సరస్వతీ! అదితే
దక్షదుహతా! శివాని నమోనమ: మహాలక్ష్మీ! సర్వశక్తిసంపన్నా
నిన్ను తెలుసు కొంటున్నాము.వ ుమ్మలను నడిపించు.
జగన్మాత! నమోనమ: దేవీ! నిన్ను, నీ తత్త్వాన్ని తెలుసుకొంటే, ఈ జగత్తు, సం సారం అదృశ్యం అయిపోతోంది. తెలుసుకోకపోతే, రజోసర్పభ్రాంతిలా ఏడిపి స్తూంటుంది. అఖండానందరూపా! ప్రణవరూపా! చిదేక రసరూపిణి! కృపా సింధూ! నమోనమ:. దేవతలు గద్గద స్వరంతో చేసిన స్తుతికి మహాదేవి సంతోషించి, ”నేను భక్తుల కల్పవృక్షాన్ని కదా! అయినా మీరంతా నా సంతతే.అడగండి.మీకు నేనేమి చేయాలో? నేను మీ చెంత ఉండగా, భయమెందుకు? దిగులెందుకు? మీకు కలిగిన దు:ఖాన్నుండి రక్షిస్తాను. ఇదేనా ప్రతిజ్ఞ. అడగండి! అని అమ్మ పలికింది.
దేవతలు ”జగన్మాతా! ఈ ముల్లోకాలలోను నీకు తెలియని విషయం ఉంటుం దా? నువ్వు సర్వజ్ఞవు. సర్వ సాక్షివి. తారకాసురుడు రేయింబవళ్ళు నానా ఇబ్బం దులూ కలిగిస్తున్నాడు. దీనివల్ల సంధ్యావందనం, నిత్యానుష్టానం సమస్యగా మారి పోయింది. శివుని పుత్రుడు మాత్రమే తారకాసురుడిని సంహరించగలడని బ్రహ్మ నుండి వరం పొందాడు. శివునికి ఇల్లాలే లేదు కదా! ఇంతకన్నా చెప్పే దేముంది తల్లి! నువ్వే ఆలోచించి మాకు మార్గం చూపించు. నీ పాద పద్మాలను నిరంతరం ధ్యానించే దాసులం. అపుడు మహాదేవి ”దేవ తలారా! భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరీదే విగా హమవంతుని ఇంట జన్మించబోతోంది. హమవంతుడు నా భక్తుడు. అతడు నిరం తరం నన్నే ఉపాసిస్తూ ఉంటాడు. నా శక్తి గౌరీదేవి, పార్వతీదేవి, దుర్గాదేవి ఇలా ఎన్నో నామాలతో పేరు పొందుతాను. శివునితో వివా హం అనంతరం, ఆ తారకాసురుడి బాధ అంతమవుతుంది.” అని చెప్పింది. దేవతలు, హమపర్వతరాజు సంతోషించి, సాష్టాంగ ప్రణా మం చేసారు. తల్లి అదృశ్యమైపోయింది.
ఇలా జగన్మాత శక్తే పార్వతీదేవిగా అవతరించింది. కుమారస్వా మి జననం తరువాత ఆ తారకాసురుడు సంహారం జరిగింది. ఆ జగన్మాత శక్తులే మీనాక్షీ, కామాక్షి, భవతారుణి, శాంభవి, సరస్వతీ, మహాలక్ష్మీ ఇలా ఎన్నో రూపాలు. ఈ విశ్వం అంతా వ్యాపించి మనకు ధైర్యాన్ని, మనోనిగ్రహం కలిగిస్తూ, ఆరాధింపబడుతోంది. అందులో భాగంగానే మనం దేవీ నవరాత్రులు నిర్వహంచడం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement