Saturday, November 23, 2024

ఏకైక పరమేశ్వర ప్రతిష్ఠిత లింగం!


తిరువిదైమరుదూర్‌లోని శ్రీమహలింగేశ్వరస్వామి ఆలయం ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు కలిగిన అరుదైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం కుంభకోణం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్వసాధారణంగా సిద్ధపురుషులు, రాజులు, మహాపురుషులు శివలింగాలను ప్రతిష్ఠింపజేసి ఆలయాలను నిర్మిస్తారు. మరికొన్ని చోట్ల పరమేశ్వరుడు స్వయంభువుగా వెలుస్తాడు. వీటన్నిటికి భిన్నంగా ఆ పరమశివుడు తానే స్వయంగా శివ లింగాన్ని తిరువిదైమరుదూర్‌లో ప్రతిష్ఠించాడు. అంతేకాదు మహాశివుడు చాలా సంవత్సరాలపాటు తపస్సుచేసి అలా వచ్చిన శక్తిని శివలింగంలో ప్రవేశపెట్టడాని పురాణ కథనం.
శివుడు స్వయంగా ప్రతిష్టించిన లింగస్వరూపంగా ప్రసిద్ధి చెందిన శ్రీ మహాలింగేశ్వరుడి శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. ప్రపంచంలోనే ఏకైక పరమేశ్వర ప్రతిష్ఠిత లింగం ఇది. జ్యోతిర్లింగం కానప్పటికీ అంతటి ప్రాముఖ్యత గల లింగస్వరూపం.
శివయ్య, అమ్మవారు ఇరువురూ తూర్పుముఖంగా ఉంటారు. అమ్మ వారు మూకాంబికగా దర్శనమిస్తారు. ఈ ఆలయం పక్కనే భారతదేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఒకటిగా పేర్కొనే మూకాంబికదేవి ఆల యం వుంటుంది. ధ్యాన భంగిమలో అమ్మవారు ఉంటారు.
ఎక్కడ అయినా తొలిపూజ గణపతికి చేస్తారు. ఇక్కడ తొలిపూజ మహా లింగేశ్వరుడికి అనంతరం గణపతిని పూజిస్తారు. తిరువిదైమరుదూర్‌ ఆల యం వారణాసి (కాశీ) వలె పవిత్రంగా పరిగణించబడుతుంది. అప్పర్‌, సుందర్‌, సంబంధర్‌, మణికావాచగర్‌ అనే ప్రముఖ నలుగురు నాయనా ర్‌లు మహాలింగేశ్వరుడిని సందర్శించి కీర్తించిన క్షేత్రం ఇది.
నాలుగు దిక్కుల్లో…

ఐదు లింగాలు చుట్టూ ఉన్నందున ఈ ఆలయం పంచలింగ క్షేత్రాల లో ఒకటి కాగా మిగిలి ఉన్న నాలుగు- నాలుగు దిక్కులలో ఉంటాయి. ఐద వ మహాలింగస్వామి మధ్యలో ఉంటారు. తూర్పు వీధిలో విశ్వనాథుని ఆల యం, పశ్చిమంలో ఋషిపురేశ్వరుడు, దక్షిణ వీధిలో ఆత్మనాథుడు, ఉత్త ర వీధిలో- చోక్కనాథుని శివాలయాలు ఉన్నాయి.ఈ ఆలయం ఐదు అంచె ల రాజగోపురం, మూడు ప్రహారాల (ప్రదక్షి ణ మార్గాలు)తో భారీగా ఉంది. ప్రతి ఒక్కటి భారీ గోడల మధ్యన ఉన్నాయి.9వ శతాబ్దంలో ఆలయ నిర్మా ణం జరిగింది. ఈ ఆలయం లోపల కరుణమీర్ధ తీర్థం, సోమ తీర్థం, కనక తీర్థం, కల్యాణ తీర్థం, ఐరావత తీర్థం అనే ఐదు పవిత్ర కొనేరులు ఉన్నాయి.
సప్త విగ్రహ మూర్తుల మధ్య…

తిరువిదైమరుదూర్‌ మహాలింగస్వామి ఈ ప్రాంతంలోని అన్ని శివా లయాలకు కేంద్రంగా ఉండి, సప్త విగ్రహ మూర్తులకు మధ్యలో కొలువు తీరి ఉన్నాడు. తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఈ మూర్తులు కొలువై ఉన్నాయి.చిదంబరంలో ఉన్న నటరాజస్వామి ఆలయంలోని నట రాజు, తిరు చెంగళూరులోని చండికేశ్వరుడు, తిరువలంజులిలోని వైట్‌ వినాయకుడు, స్వామిమలైలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాల యా ల్లో ఉన్న సూర్యుడు, అలాన్‌ దేవాలయంలోని దక్షిణామూర్తి ఆలయం చుట్టూ కొలువై ఉన్నాయి. ఇక్కడ మహాలింగం స్వయంభూ, అమ్మవారు బృ#హతసుందరగుజంబిగై, ఈ అమ్మనే కనాన్ములైనాయకి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీచక్రమహా మేరు ఏర్పాటు చేయబడింది.
తెల్ల మద్దిచెట్టు

తెల్ల మద్దిచెట్లు కలిగిన భారతదేశంలోని మూడు శివాలయాలలో తిరువిదైమరుదూర్‌ ఒకటి. ఈ మద్ది చెట్టును అర్జున అని కూడా పిలుస్తారు. ఈ వృక్షం స్థాల వృక్షం (పవిత్ర వృక్షం)గా భావిస్తారు. అందువల్ల ఈ క్షేత్రా న్ని ఇడై మరుదూర్‌ (మధ్యార్జున) అని కూడా పిలుస్తారు. ఈ చెట్టుకు ప్రద క్షిణ చేస్తే చాలామంచిదని భక్తుల విశ్వాసం. ఇతర రెండు శివ మందిరాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం, తిరునెల్వేలి జిల్లా లోని అంబసముద్రంలోని తిరుప్పుడై మరుదూర్‌ లేదా కడై మరుదూర్‌ (స్పుతార్జున) ఆలయాలుగా ప్రసిద్ధి.ఆలయంలో జరిపే ప్రముఖ పండుగ థాయిపూసం, థాయ్‌ నెలలో (జనవరి మధ్యలో) పది రోజులు జరుపుతా రు. మహాలింగేశ్వర ఉత్సవమూర్తిని గ్రామంలోని వీధులలో ఊరేగిస్తారు. పండుగ చివరి రోజు తీర్థవరితో ముగుస్తుంది.తమిళ మాసమైన వైకాసి (అ క్టోబర్‌ – నవంబర్‌), తిరు కళ్యాణం, అంబల్‌ తపసు పండుగలను జరు పుకుంటారు.ఆలయ రథం తమిళనాడులో అతిపెద్దది. ఇది పై నుండి క్రిం దికి 89 అడుగులు ఉంటుంది. 1800లో అమర్సింగ్‌ కుమారుడు ప్రతాప్‌ సింగ్‌ సింహా ఈ దేవాలయానికి విరాళం ఇచ్చాడు.
బ్రహ్మహత్య పాపం

ఈ ఆలయంలో ప్రవేశద్వారం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు బయటకు వెళ్లరు. ఒకవేళ అలా చేస్తే బ్రహ్మ హత్యా దోషం చుట్టుకుంటు ం దని చెబుతారు. ఇందుకు సంబంధించి ఒక కథనం ప్రచారంలో వుంది.
ఒకసారి పాండ్య రాజు వరుగుణ పాండ్యన్‌ అడవిలో వేటకి వెళతాడు. తిరిగి వచ్చే సమయంలో చీకటి పడుతుంది.చీకట్లో అతని గుర్రం ఒక బ్రా హ్మణుడి మీదుగా వెళ్లి అతని చావుకు కారణమవుతుంది. దీంతో అతనికి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. శివభక్తుడైన పాండురాజు శివుడిని ప్రార్థిస్తాడు. శివుడు కలలో కనిపించి తిరువిడైమరుదూర్‌ వెళ్లి శివలింగాన్ని దర్శించుకోమని సూచిస్తాడు. రాజు అక్కడికి వెళ్లి తూర్పు ద్వారంగుండా ఆలయంలోకి ప్రవేశిస్తాడు. అతన్ని అన్నిచోట్ల వెంటాడుతున్న బ్రహ్మహ త్యా దోషం పవిత్రమైన శివాలయంలోకి రాలేక తూర్పు ద్వారం వద్దనే ఉం డిపోతుంది.
ఆలయంలోకి వచ్చిన రాజు శివుడిని ఆరాధించే సమయంలో ఒక అశ రీరవాణి వినిపిస్తుంది. తూర్పు ద్వారంనుంచి కాక వేరే ద్వారంగుండా వెళ్ల మని సూచిస్తుంది. రాజు అలాగే చేస్తాడు. దీంతో ఇప్పటికీ ఆ బ్రహ్మహత్య దోషం అక్కడే ఉందని, లోనికి వెళ్లినవారు ఎవరైనా ఈ ద్వారంగుండా బయటకు వస్తే బ్రహ్మహత్య దోషం వారికి చుట్టుకుంటుందని చెబుతారు.
భక్తితో మహాలింగేశ్వరస్వామి ఆలయానికి ప్రదక్షిణ చేసినవారికి ఏవిధమైన మానసిక బాధలైనా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, వివాహం, పిల్లలు, ఉద్యోగం భక్తులు ఏది కోరుకుంటే ఆ కోరిక లన్నీ నెరవేరతాయని భక్తులు విశ్వసిస్త్తారు. విశిష్టమైన ఈ క్షేత్రాన్ని హిందువులు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement