Saturday, November 16, 2024

ఏకాదశ రుద్రులు

శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు.
”విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమ:” అని రుద్రనమకంలో చెప్పబడినది.
దీనిప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు – 1. విశ్వేశ్వరుడు 2.మహాదేవుడు 3. త్రయంబకుడు 4.త్రిపురాంతకుడు 5.త్రికాగ్నికాలుడు 6.కాలాగ్నిరుద్రుడు 7. నీలకంఠుడు, 8. మృత్యుంజయుడు 9.సర్వేశ్వరుడు 10. సదాశివుడు 11. శ్రీమన్మహాదేవుడు ఈ ఏకాదశ రుద్రులు నవ్యాంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో నెలకొనివున్నారు. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు జగ్గన్నతోట ప్రభల తీర్థంలో ఈ ఏకాదశ రుద్రులు సమావేశమవుతారు. అలా సమావేశమైన ఏకాదశ రుద్రులను ఒకేచోట చూస్తే మంచిదనే విశ్వా సంతో వేలాదిమంది భక్తులు విచ్చేస్తారు.
1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం. (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వరస్వామి): పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివ లింగరూపాన్ని పొందిందని కథ. వ్యాఘ్రము శివునిగా అవతరించు టచే వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను.
2. మహాదేవరుద్రుడు- కె.పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి): విశ్వామిత్రుని తపోభంగం చేసిన తరువాత మేనక స్వర్గానికి వెళ్ళ డానికి ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయింది. అపుడు శివుని ప్రార్ధించగా ఆయన ఒక శివలింగాన్ని మేనకకు ఇచ్చి ఆ ప్రదేశంలో ప్రతిష్ఠింపుమనెను. మేనక ఆ లింగాన్ని కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి)లో ప్రతిష్ఠించి స్వర్గానికి వెళ్ళిందని పురాణ కథ. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడెను.
3. త్రయంబకేశ్వరుడు- ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి): రావణుని సంహరించిన తరువాత శ్రీరామ చంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండ గా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి విమానం కదలకుండా నిలిచి పోయింది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివ లింగాన్ని ప్రతిష్ఠించెనని కథ కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందు కు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనంద రామేశ్వ రుడని పిలువబడెను.
4. త్రిపురాంతక రుద్రుడు- వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వే శ్వరస్వామి): తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సం#హ రింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామం లో శివలింగరూపంలో ఆవిర్భవించెనని కథ. అపుడు ఆ గ్రామపు బ్రాహ్మ ణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను.
5. త్రికాగ్నికాలరుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి): మూడు అగ్నుల యందు హోమం చేసిన ద్రవ్యా లను స్వీకరించి శివుడు లింగ రూపాన్ని పొందుటచే త్రికాగ్నికాలునిగా పిలువబడి అగస్త్య మహర్షిచే నేదునూరులో ఈ శివలింగం ప్రతి ష్ఠింపబడి నది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వరస్వామిగా కొలువబడుచున్నాడు.
6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ రాఘవేశ్వరస్వామి): రావణ సంహారం తరు వాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రాలను, ఖడ్గం ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింప బడుట వల్ల రాఘవేశ్వరస్వామి అని, పాండవ వనవాసంలో శివుడు అర్జు నుని పరీక్షింపదలచి కిరాతుని వేషంలో అర్జునుని ధైర్యపరా క్రమాలను చూచి పాశుపతాస్త్రం ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరొక కథ.
7. నీలకంఠ రుద్రుడు- మొసలపల్లి (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి): దేవతలు- రాక్షసులు క్షీరసాగర మధన సమయం లో వెలువడిన విషవాయువులను శివుడు తన కంఠమునందు నిక్షిప్తం చేసికొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంత భోగాలను అందించేవాడు, అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించిన వాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.
8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీ చెన్నమల్లేశ్వరస్వామి): శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యు ముఖము నుండి రక్షించి, యముని జయించి ”మృత్యుంజయుడు” అయ్యె ను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామంలో లింగరూపంలో ఆవిర్భవించి చెన్న మల్లేశ్వ రస్వామిగా పిలువబడెను.
9. సర్వేశ్వర రు ద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి): దక్షుని యజ్ఞంలో సతీదేవి తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్ప డిన అగ్నిజ్వాలల్లో కాలి బూడిద అయినపుడు శివుడు ఆగ్ర#హంచి ఉగ్రరూపుడై నృత్యము చేసి తన జటాజూట ములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీర భద్రుడు జన్మించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసాడు. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారంలో వేదపండి తు లైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.
10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమే త శ్రీచెన్నమల్లేశ్వర స్వామి): పూర్వం బ్ర#హ్మవిష్ణులు తమలో ఎవరు గొప్ప వారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చారు. అపుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణు వును తన పాదాలను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదాలను కను గొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడకపోయినను ఒక ఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆ లింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేద పండితులైన బ్రా#హ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను.
11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు): పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆ మహాదేవు డు పుల్లేటికుర్రు గ్రామంలో లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి ”పుండరీకపురము” అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీ కము అనగా వ్యాఘ్రము (పులి) అని అర్ధం. వ్యాఘ్రేశ్వరరంలో వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుటచేత ఈ గ్రామంలో శివుడు అభినవ వ్యాఘ్రేశ్వరస్వామి అని పిలువబడెను. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు.

Advertisement

తాజా వార్తలు

Advertisement