Saturday, November 23, 2024

భక్తితత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి

టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి
తిరుమల, ప్రభన్యూస్‌ : సమాజంలో భక్తి తత్వాన్ని పెంపొందించేందుకు సనాతన హైందవ ధర్మాన్నివ్యాప్తి చేయాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు తిరుమలలోని మాధవ నిలయం(పీఏసీ 2)లో బస చేశారు. మంగళవారం సాయంత్రం తిరుమలలోని మాధవ నిలయంలో తూర్పుగోదావరి జిల్లా అడ్డతీ గల, రంపచోడవరం తదితర వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను ద్దేశించి అదనపు ఈవో మాట్లాడుతూ గత ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని భక్తులకు స్వామివారి దర్శనం కల్పించినట్లు- తెలిపారు. ప్రతిరోజు 1000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారన్నారు. జీవితంలో తొలిసారిగా శ్రీవేంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం పొందినందుకు ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార వర్గాలకు చెందిన భక్తులు ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారని ధర్మారెడ్డి తెలిపారు. అదేవిధంగా టిటిడి హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా 502 దేవాలయాలను సమరసత సేవా ఫౌండేషన్‌తో కలిసి టిటిడి నిర్మించినట్లు- చెప్పారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ఎస్సి, ఎస్టి, మత్స్యకార కాలనీల నుంచి వచ్చిన భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement