Saturday, November 23, 2024

ఈశ్వరనుగ్రహానికి రుద్రాక్ష దీపం

ప్రతి ఒక్కరి జీవితంలో జఠిల సమస్యలున్నా, ఎన్ని చేసినా సమస్యల నుంచి బయటకు రాలేకపోవడం, ఆర్థిక సమస్యలు, కష్టానికి తగిన ఫలితం అందకపోవడం, ఇంట్లోవాళ్ళ మొండి వైఖరి, బంధువులు, స్నేహితుల మధ్య సమస్యలు, కుటుంబస భ్యుల మధ్య గొడవలు, పిల్లలు సరిగ్గా చదవకపోవడం, భార్యా భర్తల మధ్య గొడవలు అనారోగ్యం… ఇలా అనేక సమస్యలతో బాధపడటమే కాదు, శత్రుత్వం ఏర్పడడం జరుగుతుంది. అ లాంటి సమస్యలన్నిటి నుంచి బయటపడటానికి, జీవితంలో సుఖశాంతులు నెలకొనడానికి గొప్ప పరిష్కార మార్గం రుద్రా క్ష దీపం అంటున్నారు మన పండితులు.
రుద్రాక్ష దీపం అంటే ఏమిటి?
రుద్రాక్ష దీపం ఏ రోజు వెలిగించాలి?
రుద్రాక్ష దీపం వెలిగించినందువలన ఫలితం ఏమిటి? అనే విషయాల్లోకి వెళితే…
ఒక రాగి, ఇత్తడి, వెండి ప్లేటులోకానీ మట్టి ప్రమిదలో కా నీ అయిదు లేక ప్లేటులో ఎన్నిపడితే అన్ని రుద్రాక్షలు పెట్టాలి. రుద్రాక్షలు కొన్ని పెట్టండి. పంచముఖి, ఏకముఖి, ద్విముఖి ఏ రుద్రాక్షలను అయినా తీసుకోవచ్చు. దానిపైన బియ్యం పిండి లో కొంచెం బెల్లం కలిపి చేసిన ప్రమిదను ఉంచి అందులో ను వ్వులనూనె కానీ ఆవునేతిని గాని వేసి రెండు పువ్వు (కుంది) ఒత్తులు వేసి, పూజ గదిలో మహాశివుడి ముందు పెట్టి ఏక హార తితోకానీ, అగరుబత్తితో కానీ దీపం వెలిగించాలి. దీనినే రుద్రా క్ష దీపం అంటారు. ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్ట డం చాలా మంచిది.
”ప్రదోషకాలే శివనామ స్మరణ సకల పాపహరణం” ప్రతి సోమవారం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 5.45 నుంచి 6.45 మధ్య ఇలా చేయడం విశేష ఫలితం ఉంటుంది. త్రయో దశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టడం వలన ఆ పరమశివుని ఆశీస్సు లు లభిస్తాయి. తీవ్రమైన అనారోగ్యంతో గాని, అప్పులతో ఉన్న వారికి, ఏది ముందుకు సాగకుండా పనులు ఆగిపోయిన వారికి గృహంలో ఈ రుద్రాక్ష దీపం ప్రతి సోమవారం పెట్టడం వల్ల అన్నిరకాల బాధలు, సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో పిల్లలు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా, లేదా ఇంట్లో ఎవరైనా అతి కోపం మొండితనంతో ఇబ్బంది పెడుతు న్న వారి జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టి, పరమేశ్వరు నికి కొబ్బరి నైవేద్యం (కొబ్బరి అన్నం అయితే ఇంకా శ్రేష్టం) పెట్టి శివ స్తోత్రాన్నిగాని శివునికి సంబంధించిన ఏ మంత్రాన్ని అయినా, స్తోత్రం అయినా చదివి పంచహారతులతో శివయ్యకి హారతి ఇవ్వాలి. ఇలా చేస్తూ ఉంటే వారిలో మార్పు కచ్చితంగా వస్తుంది. అంతేకాదు వారి చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది.
ఇన్ని వారాలు పెట్టాలి అని లెక్క, నియమం ఏమీ లేదు. ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు. బాధలు, కష్టాలు తీరేవరకు నమ్మకంతో పెట్టాలి. ఇది ఖర్చుతో చేసేది కాదు కదా. అవే ప్లేటు ప్రమిద అవే రుద్రాక్షలు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఆ పిండి దీపం కొండ ఎక్కగానే నీటిలో కలిపి చెట్టుకు పోయాలి.
రుద్రాక్ష దీపం పరమ శ్రేష్టం. అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగిస్తే శివానుగ్ర#హం పొందుతారు. ఈ రుద్రాక్ష దీపానికి పెద్ద ఖర్చుతో పని గానీ, ఎ క్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. ప్ర తి సోమవారం నియమనిష్టలతో భక్తితో పది నిమిషాలు ఈ దీ పం పెట్టడానికి కేటాయిస్తే ఎన్నో రోజుల నుంచి వెంటాడి వేధిం చే సమస్యలన్నీ తీరతాయి. జీవితమంతా ఆనందమయంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి శివ అనుగ్ర#హం పొందుతారు. శివయ్యమీద నమ్మకం వుంచి ప్రయత్నిస్తే దారి సుగమమం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement