ఆత్మ బ్రహ్మ పదార్థం. ‘అయమ్ ఆత్మాబ్రహ్మ’ ఆత్మయే భగవంతుడు. పంచభూతాత్మకమైన పదార్థాన్ని ఆశ్రయించి వ్యక్తమయ్యేదే ఆత్మ. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఈ సృష్టికి ప్రాతిపదికలు. ఈ పంచ భూతాల నుండే ఎనుబది నాలుగు లక్షల ఉపాధి రకాలు సృజించబడ్డాయి. వాటి లో ఉత్కృష్ట మైనది మానవ దేహం.
మానవుని తల స్వర్గం. కళ్ళు సూర్యుడు, సంచరించే వాయువు ప్రాణం. ప్రాణం సంచరించే ఖాళీ భాగం ఆకాశం. మూత్రాశయ విభాగం జలం. ఇక భూమిని తాకుతూ నిలబడడానికి సహక రించే పాదాలు మిగిలిన కంకాళం భూమి. అనగా ఒకరకం గా మట్టి, ధాతువులు. ఇవి మొత్తం ఏడు. పంచభూతా లు ఇమిడి ఉన్న ఆకృతి ఇది.
వీటిని ఆశ్రయించుకొని చైతన్యమయం చేయ డానికి ఆత్మ నిత్యమై నాలుగు పరిమాణాలుగా స్థితులను కల్పిస్తోంది. అవి జాగ్రదావస్థ, స్వప్నా వస్థ, సుషుప్తావస్థ, ఆత్మ. ఇవి ఆత్మ పరిమాణా లు. మొదటి పరిమాణం వైశ్వానరుడు అను భవిస్తున్నాడు. ఇక్కడి చైతన్యం బాహ్య ముఖం గా ఉంటుంది. ఏడు అవయవాలు, పందొమ్మి ది నోళ్ళు గల ఈ వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్య జగత్తును అనుభవిస్తున్నారు. భగవం తుని గురించి ఆలోచన చేసేది ఈ అవస్థలోనే! కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, వాక్కు, చేతలు, నడక, గుదము- లింగ ముతో విసర్జన, మనసు, బుద్ధి, అహం, చిత్తము, ప్రా ణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం మొ త్తం పందొమ్మిది నోళ్ళు. పైన పేర్కొన్న ఏడు అవయ వాలు వాటితో బాహ్య జగత్తును అనుభవిస్తున్నాడు.
జ్ఞానేంద్రియాల ద్వారా విషయ సంగ్రహం చేసి అనుభవించేది మనస్సు. అందుకే మనసు ఒక పదార్థం. లౌకి క నాటకానికి మూలం ఈ మనస్సు. సంగ్ర హించిన విషయాన్ని నిశ్చయించేది బుద్ధి. ఆది తాడా? పామా? అని గందరగోళపడేది మన స్సు. అది అదే. అంటే పామైతే పాము, తాడైతే తాడు అని ధ్రువీకరించేది బుద్ధి. ఈ విషయ సంగ్రహ మొత్తం అనుభవాల గ్రంథం. ఈ అనుభవసార మంతా నిక్షిప్తం అయ్యేది చిత్తము. ఏది ధర్మం? ఏది అధర్మం అనే గందరగోళ పరిస్థితిలో అనుభవాల గ్రంథమైన చిత్తం నుండి బుద్ధి సమాధానాన్ని తీసుకుని ధర్మాధ ర్మాన్ని నిశ్చయం చేస్తుంది. అందుకే చిత్తం శుద్ధితో ఉండాలి. ఈ దేహం ఏ అవ స్థలోనున్నా ‘నేను’ అనే స్ఫురణ విడిచిపెట్టదు. మనసుతో పెనవేసుకుపోయి ఉంటుంది. అదే అహం.
స్వప్నావస్థను తైజసుడు అనుభవిస్తున్నాడు. ఇక్కడ బాహ్య జగత్తును స్వప్నంలో అనుభవిస్తాడు. బాహ్య జగత్తులో స్థితి కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. కానీ స్వప్నావస్థలో ఏ పరిమితులు ఉండవు. ఇక్కడ కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది. కాని అది సుప్తచేతనయై ఉంటుంది. అది ఒక క్రొత్త లోకా
న్ని సృష్టిస్తుంది. ఒక్కొక్కసారి రాజువవుతావు. మరొకసారి బంటువవుతావు. స్వర్గనరకాలను చవిచూస్తావు. సుఖదు:ఖాలను అనుభవిస్తాడు తైజసుడు.
సుషుప్తావస్థలో ప్రాజ్ఞుడు ఆత్మస్థితిని అనుభవిస్తాడు. ఈ స్థితిలో కోర్కె లుండవు, స్వప్నాలుండవు, మనసు పనిచేయదు. దీనినే ప్రగాఢ నిద్ర అంటారు. ఇది ఎంతో ఆనందాన్ని అనుభవంలోకి తెస్తుంది. ఆ ఆనందం సుషుప్తి చెందిన ఆ ప్రాజ్ఞునికే తెలుస్తుంది. గాఢనిద్ర నుండి మేల్కొన్నపుడు కొంత సమయం నిన్ను నువ్వే మరచిపోతావు. ‘నేను’ అనే అహం గుర్తుకు రాదు. నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా స్ఫురించదు. ఇదే సుషుప్తిని అనుభవించే అతి స్వల్ప ఆనంద క్షణం. మళ్ళీ వెంటనే అహంకారం ‘నేను’ ను మేల్కొలిపేస్తుంది. ఈ సుషుప్తి అవస్థలో బాహ్య, స్వప్న జగత్తులు ఉం డవు. మనస్సు, బుద్ధి, చిత్తం లయమయిపోతాయి. కలలుండవు. అయితే అహం మాత్రం స్ఫురించే ఉంటుంది. స్ఫురణ లేకపోతే సుషు ప్తిలో కలిగే ఆనంద సుఖం ప్రాజ్ఞునికి తెలియదు. అందుకే ప్రాజ్ఞు డు సర్వేశ్వరుడు. ఇతడే ప్రాణుల ఉత్పత్తి, వినాశనానికి కారకుడు.
నాలుగవ పరిమాణం ఆత్మస్థితి. ఇది జాగ్రద, స్వప్న, సుషుప్తి అవస్థలకు అతీత మైనవి. దీనినే కొందరు జ్ఞానులు తురీయ మన్నారు. ఇది అంతర్ముఖ, బాహ్యముఖ, చైతన్యస్థితి ఏదీకాదు. ఇది వర్ణించలేని స్థితి. ఇక్కడ ప్రపంచ చైతన్యం ఉండవు. అయితే ఇది ప్రశాంతమైనది, మంగళమైనది. అద్వ యమైనది. ఇదియే ఆత్మ. దీనిని స్థితి అని కూ డా అనకూడదు. ఆత్మ ఆత్మయే!
ఇక్కడ ఒక ముఖ్యమైన భావనను అవగాహ న చేసుకొనవలెనని మాండూ క్యోపనిషత్తు తెలియ చేస్తోంది. జాగ్రద, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థ లోను ఆత్మ ఉనికి ఉన్నది. అయితే ‘నేను’ అనే అహం స్ఫుర ణ వల్ల ఆత్మ బహిర్గతం కాదు. సుషుప్తిలో క్షణకాలం ఆ ఆత్మా నందాన్ని పొందుతున్నారు. ఎప్పుడైతే ‘నేను’ స్ఫురణకు వస్తుందో జాగ్రద, స్వప్న, సుషుప్తులు గుర్తుకు వచ్చేస్తాయి. ఆ ఆత్మానందంలోనే ఉండాలి అంటే ‘నేను’ అనే అహాన్ని కూడా లయం చేయాలి. అప్పుడు ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. అదే తురీయము. ఇక్కడ ఇక ఏదీ స్ఫురణ కాదు, లేదు. ఈ ఆత్మ ను వర్ణించలేము. తురీయమును చేరుట తప్ప దాని గురించి చెప్పుట అసాధ్య ము. అయితే ఈ ఉపనిషత్తు తురీయమునుచేరి ఆత్మను దర్శించుటకు ఒక గొప్ప మార్గాన్ని సూ చించింది. అదే ప్రణవ ధ్యానము. అనగా అ, ఉ, మ్ అనే మూడు అక్షర బ్రహ్మల తో కూడిన ‘ఓం’కార ధ్యానము.
”తైలధారా మివాచ్ఛిన్నం దీర్ఘ ఘంటా నినాదవత్” ఘంటానాదంలో అవిచ్ఛిన్నమైన తైలధారలా ‘ఓం’ కారాన్ని ఉచ్ఛరించాలి.
ధ్యానంతో తురీయం
Advertisement
తాజా వార్తలు
Advertisement