”సిరియా వచ్చిన వచ్చును
సలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరియా బోయిన బోవును
కరి మ్రింగిన వెలగపండు కరిణిని సుమతీ!!
సంపదలు కలిగే యోగం వుంటే కొబ్బరి కాయ లో నీరు వచ్చి éచేరునట్లుగా, సంపద అందంగా వచ్చి చేరుతుంది. సంపద పోయినప్పుడు వెలగ పండులోని గుజ్జు ఏనుగు మ్రింగిన విధంగా మాయమైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుం దంటే, వారు చేస్తున్న కర్మలను బట్టే ఉంటుంది. అం దుకు మనం ఒక ఉపాఖ్యానాన్ని పరిశీలిద్ధాం.
ఒకసారి దేవేంద్రుడు బ్రహ్మ వద్దకు వచ్చి, నమ స్కరించి ”దేవా! బలి మహా సంపదతో వెలుగుతూ ఉండేవాడు, ఇప్పుడు కనిపించడం లేదేమి? ఎక్కడ ఉన్నాడో కదా! అని అడిగాడు. దానికి బ్రహ్మ బదు లిస్తూ ”నీ ఆలోచన అనుచితంగానే ఉంది. నీవు అతని జోలికి వెళ్ళవద్దు మరి. అతడు గాడిద, ఆవు, ఒంటె, గుర్రములలో ఏదో ఒక ఆకారాన్ని పొంది దాగి ఉంటున్నాడు. అటువంటి వానిని చంపడం తగని పని సుమా!” అనగానే ఇంద్రుడు ”నేను ఆ విధంగా ప్రవర్తించను. నేను బలితో భాషణం మాత్రమే చేస్తాను.” అని చెప్పి వెళ్ళాడు.
ఇంద్రుడు వెతకగా ఒకచోట గాడిద రూపంలో సంతుష్టుడైన బలి కన పడ్డాడు. బలిని చూడగానే ఇంద్రుడు ”ఓ! బలిచక్రవర్తీ! ఒకనాడు మహాగజము అధిరోహంచి మణిమయ చ్ఛత్రఛామరాలు వెలుగులు చిమ్ముతూండగా ఏతెంచేవాడివి. ఆనాడు దేవలోక నివాసులమైన మేము పట్టించుకొనే వాడవు కాదు. ఎంతో ఐశ్వర్యముతో ఉజ్జ్వల
వైభవాన్ని అనుభవించిన నీవు ఈనాడు ఈ గాడిదగా జీవిస్తున్న కార ణం ఏమిటి? నువ్వు బంగారు యూపస్థంభంతో వైభవంగా యజ్ఞం నిర్వహంచిన నిన్ను ఈ స్థితిలో చూడడానికి నాకు బాధ కలుగుతోంది. ఊక తిం టూ జీవిస్తున్న నీవు నీ గత వైభవాన్ని తలచుకొని విచారిస్తూ ఉంటావా? ఉండవా? నాకు వాస్తవం చెప్పు”మని కోరాడు ఇంద్రుడు.
బలి జవాబు ఇస్తూ ”దేవేంద్రా! నీకు నా వైభవం (సంపద) కనపడదు. దూరంగా ఉన్న కొండ గుహలో దాచేసి ఉంది. నాకు కోర్కె కలిగినప్పుడు కనిపిస్తుంది. అయినా ఆ విషయం అలా ఉండనియ్యి. నీవు గొప్పవాడవు. నీవు ఇలా వ్యర్థ భాషణలు చేయడం దేనికి?” అయినా అడిగావు కదా చెప ుతున్నాను. ఈ కనిపించే ప్రాణకోటి అంతా మంచువలె కనిపిస్తుంది. మంచువలె. తొలగిపోతుంది. జ్ఞానులైన వారు చావు పుట్టుకల గురించి శోకించరు కదా! నీవెరుగుదువు. దేవేంద్రా! లోకంలో ప్రాణికోటికి మంచి చెడులు సంభవిస్తూనే ఉంటాయి. సుఖాలు- దు:ఖపీడనలు వస్తూనే ఉం టాయి. నేను మాత్రం ఎప్పుడు మేలు జరిగినా, కీడు సంభవించినా, సుఖం కలిగినా, దు:ఖం వచ్ఛినా సమభావంతోనే ఉంటాను. నా మీద ఆ మేలు కీడుల ప్రభావం ఏదీ ప్రసరించదు.
ఇంద్రా! లోకంలో మానవుల్లో శరీర బలం, బుద్ధి, వివేకం వంటివి కలిగినవారు ఎందరో ఉన్నారు. అవి లేనివారు కూడా పుష్కలంగానే ఉన్నా రు. కానీ కాలుడు మాత్రం కాలం సమీపించినప్పుడు, ఆ ఇరు తెగల వారిని, స్వేచ్ఛగా తిరుగు లేకుండా #హరించి వేస్తున్నాడు. కాలుని దగ్గర బలవివేక సామర్థ్యాలు కాని, బీదవాడు- సంపన్నుడు అనేవేవీ పనిచేయవు. అట్లా జరగడాన్ని నేను తెలివితో గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి నా మన స్సుకు ఆనందంకాని, దు:ఖంకాని ఉండవు. ఇంద్రా! ఈ గాడిద రూపంలో ఊక మేస్తున్న నన్ను చూసి హళనగా మాట్లాడుతున్నావు. త్రిగుణాలు శాం తించి ఉన్నవాడు కాబట్టి నీవు ఎంత పరిహాసంగా మాట్లాడినా, నా చిత్తాన క్రోధం ఆవరించదు. నేను చక్రవర్తిగా లోకమేలేటప్పుడు నాతో ఇలా పలికావా? ఇంద్రా! విధి కోర్కెలను బట్టి ప్రాణుల జీవితాలలో వికాసం కాని, వినాశం గాని సంభవిస్తూంటుంది. విధి చేష్టలు బలీయాలు. ఆ విషయం నీకు ఎరుకే కదా. చివరకు విధి చేతిలో నీవైనా భంగపడవల సిందే. నేను నా సంపదను కోల్ఫోడానికి కారణం నేను అతిశయంతో, బ్రహ్మ సంపన్నుల యెడ అసూయతో, మంచి సంస్కారాలు వదిలివేయ డం వల్లనే. ఇంద్రా! సంపద సత్యం, ధర్మం, ధమం (నిగ్రహం), దానం అనే నాలుగు గుణాలు వల్లనే కలుగుతుంది. సాధారణంగా మానవ నైజం సంప ద కలగగానే, తనకు తెలియకుండానే అహంకారం, గర్వం, లెక్కలేని తనం వంటి దుర్గుణాలు అంటి పెట్టుకొంటాయి. వాటిని దరిచేరకుండా ఉండ గలిగితే లక్ష్మి స్థిరంగా ఉంటుంది. సంపదలు కోల్పోతే, అప్పటి వర కు మన వద్ద పనిచేసిన సేవకులే, మన మాటను లక్ష్యపెట్టరు. అయిన వారు ఎవరూ గౌరవించరు. లేమితనంతో బాధపడవలసి వస్తుంది. ఈ పరిస్థితి రాకుండానే గ్ర#హంచుకొని తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి.
అని చెప్పి, ఇంకా ”సూర్యుడు తన ప్రయాణం కారణంగా తేజస్సు చెడి, వేడిమిని కోల్పోతాడు. ఆవిధంగా నేనూ ప్రస్తుతం నిస్తేజంగా ఉన్నా ను. దేవాసుర సంగ్రామం జరిగినప్పుడు నిన్ను నేను గెలుస్తాను.” అన గానే, ఇంద్రుడు బలి మాటలు ఆలకించి ”సరే! నన్ను నీవు గెలిచే విషయం అలా ఉండనియ్యి. బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట పాటించవలసి ఉంది. నీవు నామీద ఏర్పరుచుకున్న క్రోధాన్ని వీడు” అని పలికి ఉత్తరాదిగా వెళ్ళి పోయాడు.
అందుకే మనమందరం లక్ష్మీ కటాక్షం కొరకు ధర్మాచరణ, సత్య వచ నం, నిగ్రహం, పరోపకారం, ఉన్నదానిలో దానం చేయడంలాంటి మంచి లక్షణాలు అలవరుచు కోవాలి. మానవత్వంతో మెలగాలి.