Saturday, November 23, 2024

పరులకు మర్మము చెప్పకు…

”నా జీవితంలో దాపరికాలు ఏమీ లేవు. :ా ౌ| శn ుూ|n శిుుీ ” అని మా ట్లాడే వాళ్ళను చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ ప్రతి మనిషీ గుట్డుగా దాచు కోవలసిన విషయాలు కొన్ని ఉంటాయనీ; ఆ మర్మాలను అంటే రహస్యాలను బహరంగ పరచకూడదనీ, అది బుద్ధిమంతుల లక్షణం కాదనీ అంటారు విజ్ఞులు.
అర్థనాశం, మనస్తాపం, గృహమందలి దుశ్చరితం, వంచనం, పరాభవం- ఈ ఐదు విషయాలను బుద్ధిమంతులు బహర్గతం చేయరని పంచతంత్ర కథలలో చిన్నయ సూరి వీణాకర్ణుడు, చూడాకర్ణుడు అనే పాత్రల సంభాషణలో పలికించారు.
కొన్ని విషయాలు లోకానికి వెల్లడికావడం మంచిదైతే మరికొన్ని వెల్లడికాకపోవడమే శ్రేయస్కరం. మన ఇళ్ళలో జరిగే శుభకార్యాలు, మనం సాధించిన ఘనకార్యాలు వంటివి పదిమందికి తెలిస్తేనే మనకు కీర్తి ప్రతిష్ఠలు, ఆయా కార్యక్రమాలకు సమాజం యొక్క ఆమో దముద్ర లభిస్తాయి. అయితే చిన్నయ సూరి పేర్కొన్న పై ఐదు అంశాలు ఎంత ర#హస్యంగా ఉంచగలిగితే, కుటుంబపరంగాను, వ్యక్తిగతంగానూ, అంత మంచిది.
వీటిని వివరంగా విశ్లేషిద్దాం. మొదటి అంశం ‘అర్థనాశం’. అర్థము అంటే సంపద. ధన ము, ధాన్యము, బంగారము మొదలుగాగల మన సంపద అన్నమాట. ప్రపంచంలో ధనా నికి ఉన్న విలువ, ధనవంతులకు లభించే ప్రత్యేకత అందరికీ తెలిసిందే. ”కాసులు కలవాడె రాజు” అంటుంది సుమతీ శతకం. ఎప్పుడైతే ధనం కోల్పోతామో అప్పుడు ఆ ప్రత్యేకతను కోల్పోయి చులకనగా చూడబడతాము. అందువలన అర్థ నాశనమును బయట ఎవరికీ చెప్పుకోరాదు.

”దారిద్య్రాద్ధ్రియమేతి, హపరి గతస్సత్వాత్పరి భ్రస్యతే
నిస్సత్వ: పరిభూయతే, పరభవాన్నిర్వేద మాప ద్యతే
నిర్విణ్ణ: శుచమేతి, శోకనిహతో బుద్ధ్యా పరిత్యజ్యతే
నిర్బుద్ధి: క్షయ మేత్యహూ నిధనతా సర్వాపదామాస్పదం”

అంటాడు మృచ్ఛకటికం అనే నాటకంలో రచయిత శూద్రక మహాకవి మన సంపదలు తొలగిపోతే కలిగే దరిద్రం నలుగురికీ తెలిస్తే అది మనకు లజ్జను కలిగిస్తుంది. ఆ లజ్జ వలన మనస్థైర్యం తొలగిపోతుంది. మనస్థైర్యం కోల్పోయిన వానిని లోకం అవమానిస్తుంది. అవ మానం వలన నిర్వేదం, దానివల్ల శోకం, శోకంతో బుద్ధిని కోల్పోవడం, దానితో సర్వ నాశనం సంభవిస్తాయి. అందుకే సంపదలను సంపాదించుకోవడంతోబాటూ వాటిని కాపాడుకోవా లి కూడా. ఒకవేళ పోగొట్టుకోవలసి వస్తే లోకానికి తెలియనివ్వరాదు. మళ్ళీ ఆ సంపదలు పొందడానికి ప్రయత్నించాలి. అంతేకాదు. ధనలాభం కలిగినప్పుడు కూడా డాంబికంగా టైముకు కొట్టినట్లుగా పదిమందికీ చెప్పుకోరాదు. అందువల్ల కూడా లోకంలో అసూయ, అకారణ శతృత్వం, మన సంపదపై పరులు ఆశపడటం వంటి ఇబ్బందులు సంభవిస్తాయి. కనుక అర్థనాశము. అర్థలాభాలను గుట్డుగా ఉంచుకోవాలి.
రెండవ అంశము ‘మనస్తాపము’. తాపము అంటే బాధ. మనకు కలిగే కష్ట సుఖాల కు మన మనసు బాధలేక సంతోషాన్ని పొందుతుంది. అయితే దు:ఖం కలిగినప్పుడు కృంగి పోవడం, సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం ధీరుల స్వభావం కాదు. ”లెక్కకు రానీయ డు కార్య సాధకుడు దు:ఖంబున్‌ సుఖంబున్‌ మదిన్‌” అన్నాడు భర్తృహరి. పైగా మన మన సులోని ఆనందాన్ని కానీ, బాధను కానీ బయట పెట్డుకోవడం సమాజంలో మనలను చులక న చేస్తుంది.
”వికార హతౌ సతి విక్రియంతే యే షాం న చేతాంసి త ఏవ ధీరా:”. మనసు అలజడి చెం దాల్సిన సందర్భంలో కూడా ఎవరైతే అలజడికి లోనుకారో వారే ధీరులు అని కాళిదాసు చెప్పినట్లు ధీరుల వలె ప్రవర్తించి, తమ మనస్తాపాన్ని బహర్గతం చేయకుండా ఉండేవారికే లోకంలో గౌరవం లభిస్తుంది. ”సంతోషాన్ని నలుగురితో పంచుకో, బాధను నీలోనే దాచుకో” అన్న పెద్దల సుభాషితమూ దీనినే సమర్థిస్తుంది.
మూడవ అంశము గృహమందలి ”దుశ్చరితం”. కుటుంబ గౌరవానికి అధిక ప్రాధా న్యతనిచ్చే సంస్కృతి మనది. కుటుంబ గౌరవానికి మచ్చతెచ్చే కార్యాలు జరుగకుండా జాగ్రత్త వహంచాలి. విధివశాత్తు ఒకవేళ కుటుంబంలో ఏదైనా జరుగరాని విషయం జరిగిన్లటతే దానిని బయటకు పొక్కనీయకూడదు. లౌక్యంగా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆ కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లుతుంది. ”పరులకు మర్మము చెప్పకు” అని సుమతీ శతక కర్త ప్రబోధం.
నాల్గవ అంశం ”వంచనం”. అంటే మోసం చేయడం. మోసం చేయడం, మోసగింపబ డడం రెండూ కూడనివే. ”మోసపోయేవారుంటే మోసం చేసేవారికి లోకంలో కొదవా” అం టారు. మనం ఎవరినీ మోసం చేయకపోయినా, ఇతరుల చేత మోసగించబడినాము అని తెలి స్తే సమాజంలో పలుచన అవుతాము. వీళ్ళను సులభంగా మోసగించవచ్చునని మరికొంద రు మనలను మోసంచేసే అవకాశం ఉంది. కనుక మనం మోసపోకుండా జాగ్రత్తగా వ్యవహ రించాలి. విధివశాత్తు ఎప్పుడెనా మోసపోయినా దానిని బయటకు చెప్పుకోకూడదు. అలా చెప్పుకోవడం వలన ఎగతాళి పాలుకావడం తప్ప ఇతర ప్రయోజనమేమీ ఉండదు.
ఇక చివరిది ”పరాభవం”. అంటే వైఫల్యం/ ఓటమి చెందడం. ప్రతి ఒక్కరూ చేపట్టిన కార్యం సఫలం చేసుకోడానికే ప్రయత్నిస్తారు. కానీ, అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులు తుంటాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొని మళ్ళీ కార్యసాఫల్యం కోసం ప్రయత్నిం చాలి తప్ప, తాము దు:ఖించి ఇతరుల సానుభూతి కోసం నలుగురితో తమ వైఫల్యాన్ని ఏకరువు పెట్టు కొంటే అది నగుబాటుకు కారణమై మరింత దు:ఖ కారకమవుతుంది. వైఫల్యానికి కారణము తెలుసుకొని మరింత పట్టుదలతో విజయాన్ని సాధించాలి. పరాభవం అంటే అవమానింపబ డడం అనికూడా ఇంకొక అర్థం ఉంది. తనకు కాలం కలిసిరాక ఏదైనా అవమానం జరిగినా, దానిని పదిమందికీ తెలియనీయకూడదు. అందువలన పరాభవ దు:ఖం మరింత పెరుగు తుంది. ఆత్మీయుల, కేవలం ఆప్తుల వద్ద తప్ప ఇటువంటి విషయాలు ఇతరులకు తెలిసేలా ప్రవర్తించకూడదని చిన్నయ సూరి హత వచన సారాంశం.

Advertisement

తాజా వార్తలు

Advertisement