Tuesday, November 26, 2024

ముహూర్తానికి అంత బలం ఉందా

మన పూర్వీకుల నుంచి ఏ శుభకార్యానికి అయినా ముహూర్తాలను పెట్టుకోవడం, దాని ప్రకారం ఖచ్చితంగా ఆ సమయానికే ఆ కార్యాన్ని జరిపించడం జరుగుతుంది. మం చి ముహూర్తం అయితే తలపెట్టిన కార్యం ఎటువంటి అవాం తరాలు లేకుండా జరుగుతుందని నమ్మకం. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరిగినా, మంచి ముహూర్తానికి శంకు స్థాపన చేసి ఆ ఇంటి నిర్మాణం మధ్యలో ఆగిపోకుండా సవ్యంగా సాగినా అదంతా ముహూర్త బలమే అంటారు మన పెద్దలు. ముహూర్తాలను నమ్మేవారు ఉన్నారు. నమ్మకాలు లేనివా రూ ఉన్నారు. అటువంటి వారిలో అసలు ముహూర్తం అంటే ఏమిటి? దానికి బలం అనేది ఉంటుందా? ఎలా నమ్మాలి? దేనికి నమ్మాలి? అనే సందేహాలు కలుగుతాయి. ఇలాంటి సందేహాలను తీర్చే కథ ఇది.
విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం విద్యారణ్య స్వా మి హరిహర బుక్కరాయలతో మంచి స్థలం కోసం గాలిస్తు న్నారు. వారు ఒక ప్రాంతం చేరగానే వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. కొన్ని కుందేళ్లు వేటకుక్కలను తరుముతున్న దృశ్యం చూడగానే మ్రాన్పడిపోయారు. ఆ బలం కుందేళ్ళ ది కాదు అని, అది ఆ నేలలో ఉన్న మ#హత్తర శక్తి అని విద్యార ణ్యస్వామి గ్ర#హంచారు. అక్కడ రాజధానిని నిర్మిస్తే, శక్తివం తమైన సైనికులు, ఆర్ధిక పరిపుష్టి కలిగిన వ్యాపారులు, మేధా వులైన అధికారగణం, నిజాయితీపరులైన ప్రజలతో రాజ్యం విలసిల్లుతుంది అని భావించారు.
రాజ్య నిర్మాణానికి ఒక దివ్యమైన ముహూర్తాన్ని నిశ్చ యించారు. తెల్లవారుజాము ఒక ఘడియలో చంద్రుడు ఏవో నక్షత్రాలకు సమీపిస్తాడుట. అది అత్యద్భుతమైన ముహూర్తం అని భావించారు. హరిహర, బుక్కరాయలతో ”నేను ఆ సమీపంలోని కొండపైకి ఎక్కి చంద్రగ్రహ కదలిక లను గమనిస్తూ, సరైన ముహూర్త సమయంరాగానే శంఖా న్ని పూరిస్తాను. ఆ శబ్దం వినపడింది మరుక్షణమే మీరు ఇక్క డ పునాదిని తవ్వాలి. ఆ సమయంలో పడిన పునాది విజయ నగర సామ్రాజ్యాన్ని వెయ్యి సంవత్సరాలు ఆ ముహూర్త బలం కాపాడుతుంది” అని చెప్పి స్వామి కొండపైనున్న శిఖ రాగ్రానికి వెళ్లారు. రాయల సోదరులు ఇరువురూ గునపాలు చేబూని సిద్ధంగా ఉన్నారు. తెల్లవారు జామున పూర్ణచంద్రు డు తేజోమయంగా నభో మండలంలో నిశ్చలంగా పరిభ్ర మిస్తున్నాడు. నక్షత్రాలు మిరుమిట్లు గొలుపుతున్నాయి. సరి గ్గా అదే సమయంలో ఒక జంగం దేవర నదీస్నానం చెయ్య డానికి వెళ్తూ పెద్దగా శంఖాన్ని పూరించాడు. అది స్వాముల వారు పూరించినదే అని భ్రమించి రాయల సోదరులు భూమిలోకి గునపాలు దించారు. ఒక్క అడుగు తవ్వ గానే శంఖం మరోసారి మోగింది. ఇది స్వామి పూరించింది. ఆ శబ్దం వినగానే సోదరులు ఇద్దరూ దిగ్భ్రాంతి చెంది అచేత నంగా నిలబడిపోయారు.
ఇంతలో స్వామి కొండదిగి వచ్చారు. ఆయన రాగానే ”గురుదేవా.. ఎందుకు శంఖాన్ని రెండుసార్లు పూరించా రు?” అని ప్రశ్నించారు సోదరులు. స్వామి ఆశ్చర్యంగా అదే మిటి? నేను ఇప్పుడే శంఖనాదం చేసాను. పునాది తీసారా? అని ఆత్రంగా ప్రశ్నించారు. ”లేదు గురుదేవా.. కొన్ని ఘడి యల క్రితం శంఖనాదం వినిపించింది. అది మీరే పూరించా రు అని అప్పుడే పునాది తీసాము” చెప్పారు సోదరులు.
అప్పుడే మళ్ళీ శంఖం ఊదుకుంటూ జంగందేవర వెళ్ళిపోతున్నాడు. అతడిని చూడగానే స్వామి ఖిన్నుడు అయ్యారు. ”అయ్యో… తొలిసారి పూరించింది నేను కాదు. ఆ జంగం దేవర… ఎంత పొరపాటు అయింది… మీరు పునా ది తీసిన ఘడియ అంత బలమైనది కాదు. ఆ ముహూర్తంలో తీసిన పునాది ఎక్కువకాలం నిలబడదు. రెండు వందల సం వత్సరాలలో ఈసామ్రాజ్యం కూలిపోతుంది. విదేశీయులకు మనవాళ్ళు బానిసలు అవుతారు. కుట్రలు, కుతంత్రాలతో రాజకుటుంబంపతనమైపోతుంది. అంతా విధిరాత” అన్నా రు బాధగా. ఆయన చెప్పినట్లే విజయనగర సామ్రాజ్యం రెండువందల ఏళ్లకే పతనమైపోయింది. ముహూర్త నిర్ణ యంలో అంతశక్తి ఉన్నది. ము హూర్త నిర్ణయం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి ఎంతో మేధ, గణిక శాస్త్ర పరిజ్ఞానం కావాలి. శాస్త్రాలు సంపూర్ణంగా నేర్చిన, భాష్యం చెప్పగల మహా పండితులు నేడు చాలా తక్కువ మంది ఉన్నారు. అంతే తప్ప అది శాస్త్రాల తప్పుకాదు. శాస్త్రం ఏ విషయాన్నైనా నిష్కర్షగా కర్కశంగా చెప్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement