వ్యక్తి జీవితంలో అర్థ సాధన (సంప ద, ఐశ్వర్యం) అత్యంత ప్రాధాన్యతాంశం. అయితే అది మాత్రమే జీవన పరమార్ధ మా? అంటే.. కాదు.. దాని ప్రాధా న్యం మనిషి బ్రతికి ఉన్నంత కాలం వర కే.. అర్థసాధన సామాజిక బంధంతో ము డిపడిన వ్యక్తిలో అది సమతను పెంచుతుం ది. సమత వల్ల ఓర్పు, నేర్పు, మనోనిగ్రహం, స్థి త ప్రజ్ఞత అలవడతాయి. జీవితంలో ”ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితికి” చేరాలనే ఆశయాన్ని సాకా రం చేసుకునేందుకు అది దోహదపడుతుంది.
అర్థం అంటే ఏమిటి? ”అర్థ్యతే ఇతి అర్థ:”.. సకల జనుల చేత కోరబడేది అర్థం.. ఏవి కోరబడతాయి? విద్య, భూమి, బంగారం, ధనధాన్య పశుసంపత్తి, సంతా నం, యశస్సులాంటివి మానవులంతా కోరుకుంటారు. ఇలా ఎన్ని కోరుకుంటారనుకున్నా.. ఎక్కువ మంది కోరుకు నేది మాత్రం ధన సంపదను మాత్రమే. ఆర్జన, పెంచుకోవ డం, రక్షించుకోవడం, సద్వినియోగం చేయడం.. వీటిని అర్థం స్వరూపాలుగా చెపుతారు. ఇవి కానినాడు దానికి నాశ నం అనే లక్షణం కలుగుతుంది. పురుషార్థాలుగా చెప్పబడిన ధర్మార్థకామ మోక్షాలలో ఈ ‘అర్థ’మే ముఖ్యమైనది. ధర్మకా ర్యాల నిర్వహణకు, కామాన్ని నెరవేర్చుకునేందుకు అవసరమై నది అర్థమే. ధనం లేకుండా ఏ పనీ చేయలేము.. అందుకే ”ధన మూల మిదం జగత్” అన్న నానుడి ప్రాచుర్యంలోకి వచ్చింది.
”గ్రీష్మ ఋతువులో చిన్న నదులు ఎండిపోయిన” విధం గా అన్ని సంకల్పాలు విఛ్ఛిన్నమౌతాయి, అంటుంది రామా యణం. ధర్మ విరుద్ధంగా సంపదల యందు ఆసక్తుడైన వాడు సమాజంచేత ద్వేషింపబడతాడు. సంపదలో పుట్టి.. పెరిగి దాని లక్ష ణాన్ని అవగాహన చేసుకోలేని వ్యక్తి, సోమరియై దానిని పోగొ ట్టుకుంటే… అలవడిన సుఖాలకు దూరం కాలేడు కాబట్టి.. దొంగతనంలాంటి అసాంఘిక కార్యాలకు పాల్పడతాడు. ఎలా గైతే ”సర్వేగుణా: కాంచన మాశ్రయింతి” అన్నట్లుగా, సంపద లు కలిగిన వానికి బంధుమిత్రులు, ఆశ్రితులు ఉంటారు.. వానినే పరాక్రమశాలిగా, పండితునిగా, మహాగుణవంతుని గా, మహాత్మునిగా కీర్తిస్తుందీ ప్రపంచం. అధికారం, దర్పం, ఆదరణతో కూడిన సుఖసంతోషాలు సంపదల వల్ల కలుగుతా యి. సంపదలు లేని వానిని సమాజం పట్టించుకోదు. అయితే.. ధనాన్ని గౌరవించినంత వరకే ధనం నిలుస్తుంది. నిర్ధనులైన వారు ధనం కావాలని కోరుకొని ఎంతగా ప్రయత్నించినా, వా రా సంపదను గౌరవించనంత వరకు, వారికా సంపద లభింప దు. భారతంలో ధర్మరాజు సంపదను బాగా పెంచుకున్నాడు.. కాని వ్యసనశీలుడై, జూదంలో రాజ్యాన్ని, తన గౌరవాన్నీ ఫణం గా పెట్టి, తన సంపదను అవమానించడంవల్ల సకలమూ పోగొట్టుకున్నాడు. ”అర్థమనర్ధం భావయ నిత్యం”.. అంటారు ఆదిశంకరులు. సకల అనర్ధాలకూ ధనమే మూలకారణమౌ తుంది. దాయాదుల మధ్య, కుటుంబాల మధ్య.. ధనమే కలహాలను సృజిస్తుంది. నిరంతరం దానిని కాపాడుకోవాలను కునే ప్రయత్నంలో తుదకు భార్య, సంతానం కూడా తనతో కలహస్తుంది. అధిక ఐశ్వర్యం వ్యసనాలకు దారి చూపుతుంది. అందుకే దానివల్ల సుఖంలేదని.. అది అనర్ధదాయకమని అన్నా రు, ఆది శంకరులు.
అయితే సంపదను ఆర్జించడం, పెంచుకోవడం… తప్పా.. అంటే కాదనే సమాధానం. వ్యక్తికి అభ్యుదయం కావాలి అం టే.. సంపద కావాలి. ”జీవితాంతం భౌతిక సుఖాలను పొందేం
దుకు అవసరమైన సంపద నావద్ద ఉన్నదనే భావన యే” అభ్యుదయం.. పొందేంత ఐశ్వర్యాన్ని గౌరవప్ర దంగా, ధర్మమార్గంలో ఆర్జించాలి.. పెరిగిన సంపద పత నానికి కారణం కానంత వరకూ, సుఖాల్లో అహంకారం పెరగనంత వరకూ, జీవనగమనంలో ఎదురయ్యే మలపు లలో వెనుకబడనంత వరకూ, అభ్యుదయ ప్రస్థానంలో వికాసం కుంటుబడనంత వరకూ.. ధర్మబద్ధమైన, చట్టబద్ధ మైన అర్థ సంపాదన వ్యక్తిని ఉన్నతుడిని చేస్తుంది. భౌతిక జీవితంలోని సుఖదు:ఖ సమన్వయానికి, మానవ స్వభా వంలో ఆయా సందర్భాలలో ప్రదర్శితమయ్యే గుణ దోషాల కు మూలమైన అర్థమే వ్యక్తి పరిణతికి సోపానమౌతుంది. అలా సాధించిన అర్థం అనర్ధాలకు దారితీయదు. అలాంటి సంపద ను అధికంగా ఆర్జించి, లోకకల్యాణానికై వ్యయించి మనందర మూ.. అమర యశస్కులము కావాలని ఆశిస్తున్నాను.