Friday, January 24, 2025

…కార్యసాధకుడు!

ఒక ఋషి దగ్గరకు ఇంట్లో నుండి గెంటివేయబడ్డ ఒక పిల్లాడు ఏడుస్తూ వచ్చాడు. ఋషి అతనిని ఆదరించి విద్యలు నేర్పించడం మొదలు పెట్టాడు. అయినా కుర్రాడిలో నిరుత్సా#హం ఎక్కువగా ఉంది. కానీ గెలవాలి అనే తపన ఉంది. అలాగే ఒకరోజు గురువు దగ్గరకి వెళ్ళి గురువుగారూ… ఎంత సాధన చేసినా నాకు విద్య, విజయం దొరకవేమో, ఇక నేను ఆత్మ#హత్య చేసుకుంటా అన్నాడు. దానికి గురువు ఆ కుర్రాడిని ఒక కోనేరు నీటిలో తల ముంచేశారు. కుర్రాడు ఉక్కిరి బిక్కిరై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతుంటే, ఒకసారి వదిలేశారు. కుర్రాడు పైకి లేచి దీర్ఘంగా ఊపిరి తెసుకుని మాట రాక సైగలతో గురువుని నిందించడం మొదలుపెట్టాడు. దానికి గురువు గారు ఇప్పుడు పైకి రాకపోతే ఏమయ్యేవాడివి అంటే చనిపోయేవాడినని చెప్పాడు. నీకు పైకి రాకపోతే చనిపోతావ్‌, చనిపోకుండా ఉండటానికి ఎంత విశ్వ ప్రయత్నం చేశావో, ఒడిపోకుండా గెలవడానికి కూడా అంతే విశ్వ ప్రయత్నం చేయాలి. చావుకి ఓటమికి తేడాలేదు. ఒడిపోయినవాడు చనిపోవల్సిన పని కూడా లేదు అని ఉపదేశం చేశారు.
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారుఁ బూసెజ్జపై,
నొకచో శాకము లారగించు, నొకచో నుత్కృష్టశాల్యోదనం,
బొకచోఁ బొంత ధరించు, నొక్కొక్కతరిన్‌ యోగ్యాంబర శ్రేణి, లె
క్కకు రానీయఁడు కార్య సాధకుఁడు దుఖ:ంబున్‌ సుఖంబున్‌ మదిన్‌!!
భావం :
కార్యసాధకుడు ఏమీ లేకపోతే నేలమీదనే పడుకుంటాడు. దొరికితే మంచి పూల పాన్పుపైన పడుకుంటాడు. ఒక్కో చోట ఏమీ దొరకకపోతే కాయగూరలతో సరిపెట్టుకుంటాడు. ఒక్కోచోట మంచి వరి అన్నము తింటాడు. ఒకచోట ముతక బట్టలైనా వేసుకొని కాలక్షేపం చేస్తాడు. ఇంకోచోట అదృష్టం కలసి వస్తే మంచి వస్త్రాలు ధరిస్తాడు. ఇలా కార్యసాధకుడు ఈరోజు ఎలా ఉంటే అలా సర్దుకుపోతూ కష్టమును సుఖమును సమానంగా తీసుకుంటూ ఒక యోగి వలె తన పని తాను చేసుకొని పోతూ ఉంటాడు.
రాముడు 14 ఏళ్ల అరణ్యవాసం, పాండవుల అరణ్యవాసం కూడా వాళ్ళకు లేని విలువిద్య నేర్చుకోడానికి అవకాశం దక్కింది. ఎంతో అస్త్ర విద్య సంపాదించాలి. రానున్న యుద్దంలో గెలవాలి అంటే దానికి తగ్గ విద్య కూడా ఉండాలి. ఎడిసన్‌ 180 సార్లు విఫలం అయ్యాక బల్బ్‌ కనిపెట్టాడు. 200 ఏళ్లు యుద్దం చేస్తే స్వాతంత్య్రం వచ్చింది. కనుక విజేత అనేవాడు అన్నీ దాటి వచ్చినవాడే తప్ప సులభంగా అయినవాడు కాదు.
రాముని వనవాసకాలంలో మాయామృగాన్ని ఎరగా వేసి రాములక్ష్మణులు లేని సమయంలో రావణుడు సీతాప#హరణం చేయటం తెలుసు కదా! తదుపరి సీతాన్వేషణ కోసం అంగదాదుల నాయకత్వాన #హనుమంతుడు దక్షిణ దిక్కుకు వెళ్ళి, లంకంతా గాలించాడు. ఎంత వెదికినా ఫలితంలేక దిగులు చెందాడు. తానిప్పుడు వెనుకకు వెళ్ళినట్లైతే జరిగే నష్టం ఏమిటో ఆలోచించి, ఎలా ముందుకు వెళ్ళాలో నిశ్చయించుకున్నాడు. ఆ క్షణంలో తనకు తానే ”అన్ని వేదనలకు కారణం నిరుత్సా#హం. దిగులు పడకుండా ఉత్సా#హంతో ఉండుటవలన కార్యసిద్ధి, దానిచే పరమ సుఖము కల్గును. కాబట్టి ఇంతవరకూ చేసిన పనినే మరింత శ్రద్ధగా చేసి కార్యసిద్ధిని పొందుతాను” అని ఉత్సా#హపరచుకుని ఉత్తమ కార్యసాధకుడు అనిపించుకున్నాడు.
జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎట్టి వారికైనా నిరాశ, నిస్పృ#హ ఆవరిస్తాయి. అటువంటి పరిస్థితుల్లో నిరాశకు తలవొగ్గి జీవితాన్ని కూలదోసుకోకూడదు. ఆప్తులు, సన్ని#హతులు వెంట ఉండి ఆ స్థితిలో నుంచి బయటకు తీసుకువస్తే అదృష్టమే! కాని ఎవరో రావాలి నాకు ధైర్యం చెప్పి నడిపించాలి అని ఎదురు చూస్తూ కాలయాపన చేయడం మంచిది కాదు. తమకు తామే ప్రేరణ ఇచ్చుకొని, వీలైనంత త్వరగా కార్యసాధన దిశగా అడుగులు వేయాలి. ఈ విషయం రామాయణంలోని సుందరకాండలో #హనుమ చేసి చూపించాడు.

– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి.

Advertisement

తాజా వార్తలు

Advertisement