Tuesday, November 26, 2024

బాబా లీలలు వర్ణించ తరమా

మాధవరావు దేశ్‌పాండే బాబా అనుమతితోనే వివి ధ ప్రదేశాలకు వెళ్ళినా అతను వచ్చే వరకూ సాయికి ఎంతో అశాంతిగా వుండేది. ఆ గురుశి ష్యుల సంబంధాన్ని వర్ణించడం ఆ దేవతలకు కూడా సాధ్యంకాదని అందరూ చెబుతారు.
శ్యామా సాయి ఇచ్చిన ఊదీని రెండు చిన్న మట్టి కుండల నిండుగా పోసి తన ఇంట్లో భద్రపరచుకున్నా డు. సాయి భక్తుల పాలిటి కల్పవృక్షమైన ఆ ఊదీని ఆప దలలో వున్నవారికి ఇస్తుండేవాడు. ఒకరోజు శ్యామా పని మీద బొంబాయి వెళ్ళగా అతని ఇంట్లో వారు ఇళ్ళు శుభ్రం చేస్తూ ఆ రెండు కుండలను బయటపడేసారు. ఆ రాత్రి సాయి శ్యామాకు కలలో కనిపించి ”శ్యామా తక్షణమే శిరిడీకి వెళ్ళు. ను వ్వు ప్రాణపదంగా దాచుకున్న ఊదీని బయటపడేసారు.” అని ఆదేశమిచ్చారు. మర్నాడు ఉదయమే శ్యామా శిరిడీకి వెళ్ళి చూ డగా బయట చెత్తకుప్పలో సాయి ఊదీ గల రెండు కుండలు పడే సి వున్నాయి. వెంటనే వాటిని భద్రపరచుకున్నాడు.
సాయి శ్యామా ఇంటికి రెండుసార్లు మాత్రమే వెళ్ళారు. మొదటిసారి శ్యామాకు విషపు తేలు కుట్టి బాధతో గిలగిలలాడు తున్నప్పుడు సాయి వెళ్ళి స్వయంగా చికిత్స చేసారు. రెండవసా రి శ్యామా తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండగా ఆరతి సమ యంలో శ్యామా ఎందుకు రాలేదని సాయి అడిగినప్పుడు అత ను జ్వరంతో బాధపడుతున్న సంగతి భక్తులు చెప్పారు. సాయి వెంటనే ఆసనం నుండి లేచి, ఆరతిని ఆపించి శ్యామా ఇంటికి వెళ్ళి శ్యామాను చొక్కా పట్టుకొని ”జ్వరం లేదు, గిరం లేదు, నా తో రా” అని మశీదుకు లాక్కొచ్చారు. అప్పటికే శ్యామా జ్వరం తగ్గిపోయింది. శిరిడీ వెళ్ళేవారు శ్యామా ఇంటిని తప్పక దర్శిం చి ఆ ఇంటిని బాబా తన పాద స్పర్శతో పావనం చేసారన్న సంగ తిని గుర్తుంచుకోవాలి. బాబా శక్తిని వర్ణించ సాధ్యమా?
శ్యామా సాయి మహా సమాధి అనంతరం దీక్షిత్‌వాడాలో నివసిస్తూ దాని బాధ్యతలను నిర్వ#హంచేవాడు. అందుకుగాను దీక్షిత్‌ నుండి ప్రతీ నెలా కొంత సొమ్ము అతనికి ముట్టేది. అంతే కాక తన స్వంత ఇంటిని అద్దెకు ఇవ్వడం వలన వచ్చే ఆదాయం పై తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలం తర్వాత బూటీ కూడా తన వాడా పర్యవేక్షణ బాధ్యతలను శ్యామాకు అప్పగించి అందుకుగాను ప్రతీనెలా ఏడు రూపాయలను భత్యంగా ఇచ్చేవాడు. బూటీ మరణానంతరం అతని కుమారు డు ఈ పద్ధతిని కొనసాగించాడు. బాబా దయ వలన శ్యామాకు ఎన్నడూ తిండి, గూడు, బట్టలకు ఏ లోటూ రాలేదు.
వృద్ధాప్యం లో శ్యామా జబ్బుతో తీవ్రంగా బాధపడడం వలన తన మకాంను దీక్షిత్‌వాడా నుండి తిరిగి స్వంత ఇంటికి మార్చేసాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా సాయితో తన స#హచర్యం, బాబా లీలలు, మ#హత్యాల గురించి భక్తులకు ఉపన్యాసాలను చెప్పేవాడు. బాబా గురించి ఒక్కొక్కసారి

మాట్లాడేటప్పుడు అతను పెద్దగా ఏడ్చేవాడు. అప్పుడు అతని ని కంట్రోల్‌ చెయ్యడం ఎవరి తరం అయ్యేది కాదు.
చాలా సందర్భాలలో శ్యామా బాబాతో పోట్లాటకు కూడా దిగేవాడు. బాబా మాత్రం ఎంతో శాంతంగా అతనిని బుజ్జ గించేవారు. ఒకసారి శ్యామా కోపంగా మసీదులోకి దూసు కువచ్చి ”బాబా, నిన్ను దేవుడిని చేసింది మేమే, నువ్వు అందరికీ సిరి సంపదలను, భోగభాగ్యాలను ఇచ్చావు కానీ నా పట్ల చాలా ఉదాశీనత ప్రదర్శిస్తున్నావు. ఆపద లలో కూడా నన్ను నువ్వు ఆదుకోవడం లేదు, ఇదేమి న్యాయమ”ని అరిచాడు. అప్పుడు బాబా చిరున వ్వుతో ”శ్యామా, సిరిసంపదలు మామూలు వారి కి ఇస్తాను, నీకు ఇవ్వవలసింది వేరే వుంది, అది నీకు ముందుముందు అర్ధమవుతుంది” అన్నా రు. ఆ మాటలకు శ్యామాకు జ్ఞానోదయం కలిగి కళ్ళు ఆనందంతో వర్షించాయి. బాబా చూపిస్తున్న ప్రేమకు ముదమొంది బాబా కు క్షమార్పణలు చెప్పి వెళ్ళిపోయాడు.
మరొకసారి సఖారాం ఔరంగా బాద్‌కర్‌ భార్య సంతానం కోసం బాబాను శరణు వేడితే ఆయన ఏమీ మాట్లాడలేదు. అప్పుడు శ్యామా బాబాతో పోట్లాటకు దిగి అతి బలవంతంగా బాబా చేత కొబ్బ రి కాయ ఇప్పించి ఆమెకు సం తాన ప్రాప్తిని కలిగించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement