Friday, November 22, 2024

యోగస్థుడవై కర్మ చేయి

”కర్మణ్యే వాధికారస్తే, మాఫలేషు కదాచన, మా కర్మఫల హేతర్భూర్మాతే సంగోసత్త్వ కర్మణి” అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో…
అర్జునా! నీకు కర్మ చేయుటయందు మాత్రమే అధికారము గలదు గానీ దాని ఫలముల యందు లే దు. ఫలితాన్ని కోరి కర్మ చేయకూడదు. అంతేగాదు, చేసే కర్మలో కూడా నీకు మమకారము ఉండకూడ దు. అంటే ఫలానా పని అయితేనే చేస్తాను అనకూడ దు. ఇంతకూ ఎవరైనా ఏ పనైనా చేస్తే దానివల్ల ఏదో ప్రయోజనం ఆశించే ఆ పని చేస్తారు. ఏ ఫలితం లేని పనిని అసలెందుకు చేయాలి. అంటే ప్రతి వారికి కర్త వ్య కర్మలనేవి వుంటాయి. ఆ కర్మలను చేసి తీరాల్సిందే. కానీ వాటి ఫలితాన్ని మాత్రం ఆశించకూడదు.
చెట్లు మనిషికి నీడనిస్తాయి. అలాగే మంచి సువాసనలు వెదజల్లే అందమైన పుష్పాలను ఇస్తాయి. మధురమైన ఫలాలను ఇస్తాయి. నదులు ప్రవహిస్తుంటాయి. అందువల్ల భూమి సారవంతం అవుతుంది. మానవులు పంటలు పండించుకొని జీవిస్తున్నారు. మేఘాలు వర్షిస్తున్నాయి. అందువల్ల నే నదులు ప్రవహిస్తున్నాయి. అలాగని ఆ వాన చినుకులు ఏ ఫలితాన్ని ఆశించాయి. సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో ప్రకాశిస్తు న్నారు. ఆ వెలుగులో మనం జీవిస్తున్నాము. సూర్య చంద్రులు అందుకు ప్రతిఫలంగా ఏమి కోరారు. ఇలా ప్రకృతిలో ఏదీ మానవుడి నుండి ఫలితాన్ని ఆశించ డంలేదు. పైగా అవి ఏనాడూ విశ్రాంతి కోరవు. అలసి పోవు. అలా అలసిపోయి అవి విశ్రాంతి కోరినపుడు ఈ భూమి మీద జీవకోటి ఉనికి ప్రమాదంలో పడుతుంది కూడా. కానీ మనిషి మాత్రం ఏ చిన్న పని చేసినా ప్రయోజనాన్ని కాంక్షిస్తుంటాడు. ఏ ఫలిత మూ లేకపోతే అసలు పని ఎందుకు చేయాలిట అని వాదిస్తాడు. కానీ మనిషి ఏ ఫలితాన్న ఆశించకుండా ఎవరి కర్తవ్య కర్మ వారు చేస్తూ పోతే ఉత్తమ గతులను పొందుతాడు అని శ్రీకృష్ణుని బోధ పలితాన్ని కోరితే కోరిన ఫలితం మాత్రమే ఇస్తాడు. ఏ కోరికా లేకుండా కర్మ చేస్తే తనకేది అవసరమో అది ఇస్తాడు. చివరికి తనను తాను ఇచ్చుకుంటాడు. మనకేది అవసరమో మనకన్నా ఆ పరమాత్మునికే బాగా తెలుసు. అందుకే మళ్లి చెబుతున్నాడు.
యోగస్థ: కురకర్మాణి, సంగంత్తక్త్వా ధనుంజయ
సిద్ధ్య సిద్ధ్యో: సమోభూత్వా, సమత్వం యోగ ఉచ్ఛతే|| (2/48)
యోగస్తుడవై కర్మ చేయి. ధనుంజయా! ఏ విషయంలోనూ ఆసక్తిని పెట్టుకోకు. చేస్తున్న పని ఫలించనీ, ఫలించకపోనీ ఆత్మకు సహజ సిద్ధమైన సమత్వంలో ఉంటూ నీ కర్తవ్య కర్మలను చేయాలి. యోగం అంటే సమత్వమే.
ఇక్కడ ‘యోగం’ అనే పదం వచ్చింది. యోగం అంటే కలయిక. ఆ కలయిక ఆత్మతో కలయిక. ఎప్పుడు సర్వకాల సర్వావస్థలయం దు నమతలోనే ఉంటుంది. ఏమాత్రం గందర గోళం అందులో ఉండదు. జయాపజ యాలు, లాభనష్టాలు, కష్టసుఖాలు, ఉద్ధతి- పతనాలు దానికి అంటవు. అందుకే ఆత్మస్థులమై కర్మ చేయాలి. అప్పుడింక కర్మ చేసినపుడు దాని సంస్కారం ఏదీ కర్మ చేసినవాడికి అంటుకోదు. దానివలన అతడు కర్మయోగి అనబడతాడు.
శ్రీ అరవిందులు యోగానికి నిర్వచనం చెబుతూ దైవాన్ని తెలుసుకొనడం, దైవంతో ఏకం కావడం, దైవాన్ని అభివ్యక్తం కానివ్వడం మన యోగ లక్ష్యం అంటారు. అదే మన కర్తవ్య కర్మ. అలా ఎవరి కర్తవ్య కర్మలను వారు నిర్వర్తించిన పుడు దోపిడీకి ఆస్కారం ఉండదు. అవినీతికి తావుండదు. దౌర్జన్యాలకు, హింసకు, ఆడంబరా లకు, అధికార వాంఛకు, ఆకలికి, ఆరాట పోరాటా లకు, ఉద్ధతి పతనాలకు, అశాంతికి తావులేని సమ సమాజానికి బంగారు బాటలు పరుచుకుంటాయి. దానివలన ఏ సమస్యలు లేని సమాజం ఉనికిలోకి వస్తుంది. అందుకే మనందరం యోగస్థులమై కర్మ చేయాలి. అందులోనే మన జీవితానికి అర్థం, పర మార్థం వుంటుంది.

  • కవితా శ్రీధర్‌, 9395511193
Advertisement

తాజా వార్తలు

Advertisement