Friday, November 22, 2024

లక్ష్మీదేవి ఆగమనమే దీపావళి!

”ధనం మూలం మిదం జగత్‌” అంటారు. డబ్బుతోనే ప్రపంచం నడుస్తోందన్నది అందరికీ తెలిసిందే. కాసులు లేనివాడు ఎందుకూ కొరగాడు. మానవుని ప్రతీ అవసరం తీర్చేది డబ్బే కనుక డబ్బు సంపాదనకు మానవులు ఎన్నో మార్గాలు ఎంచుకున్నారు. కనుక ధనం (డబ్బు)కు ప్రతీక అయిన లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమయితే సకల సంపదలు సమకూరుతాయనేది ప్రజల విశ్వాసం. అందుకు లక్ష్మీదేవిని శాస్త్రయుక్తంగా, అత్యంత భక్తి శ్రద్దలతో నియమ, నిష్టలతో కొలువడానికి పూర్వం ఋషులు ధన త్రయోదశిని గొప్ప పర్వదినంగా నిర్ణయించి కొనసాగించారు. చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుణ మాసంలోని శుక్లపక్ష త్రయోదశికి ”ధనత్రయోదశి” అని పేరుపెట్టి లక్ష్మీమాత ప్రీత్యర్థం వైభవోపేత పూజా విధానాన్ని ప్రవేశపెట్టారు.
దేవ, దానవులు అమృతం, ఇంకా మరెన్నో ప్రయోజనాలు పొందడానికి పాల సముద్రాన్ని చిలికారు. ఈ క్రమంలో ఆశ్వయుజ కృష్ణత్రయోదశి రోజున శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆమె ధన కళలతో మహోజ్వల తేజో ప్రకాశితయై జన్మించినందున ఆ త్రయోదశికి ధన్యత్రయోదశి అని ముక్కోటి దేవతలు, ఋషులు నామ కరణం చేశారు. అందుకే లక్ష్మీదేవి ప్రభవించిన ఆ దివ్య ధనత్రయోదశికి అంతలా ప్రాశస్త్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే శ్రీమహావిష్ణువుకు దేవేరీ అయింది. ఇదే కృష్ణ త్రయోదశి నాడు లక్ష్మీదేవితో పాటు దేవ వైద్యుడు ధన్వంతరి, అలాగే కామధేనువు, కల్పవృక్షం, కాలకూట మహావిషం అనంతరం అమృతం ఇంకా తదితరాలు ఎన్నో ఉద్భవించాయి.
దీపావళి పండుగ క్రమంలో… దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశిని ”చోటీ దీపావళి” అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్ధం. దీపావళి పండుగ పురస్కరించుకొని ఐదు రోజుల వర్వదినాలుగా జరుపుకుంటున్న క్రమంలో మొదటిదైన ధనత్రయోదశి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.
దీపావళి రోజున లక్ష్మి ఇంటికి వస్తుంది! దీపావళి రోజున లక్ష్మీదేవి తనపై భక్తితో అందంగా ఆకర్షణీయంగా అలంకరించిన ఇంటికి వస్తుందన్న నమ్మకం వుంది. అందుకే దీపావళి రోజున ప్రధానంగా లక్ష్మీపూజ చేస్తారు. ఇంటిలోని వారందరు అభ్యంగన స్నానాలు చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, పూజ మందిరాన్ని మంగళ కరంగా అలంకరించి, ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను లేదా కొత్తగా కొనుగోలు చేసిన వస్తువులను లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి పూజలు చూస్తారు. ఈ విధంగా భక్తి. శ్రద్ధలతో తనను ఆరాధించిన భక్తకోటి మనోభీష్టాలను లక్ష్మీదేవి నెరవేరుస్తుందని విశ్వాసం.
లక్ష్మీదేవితో పాటు అన్మించిన ఆమె సోదర తుల్యుడు దేవ వైద్యుడు ధన్వంతరీకి, అలాగే ధనానికి అధినాయకుడైన ఉత్తర దిక్పాలకుడు కుబేరునికి కూడా లక్ష్మీదేవితో పాటు చేస్తారు. కుబేరుడి తపోనిష్ఠకు మెచ్చి శ్రీమహాలక్ష్మి అతనికి అపార ధనరాశినిచ్చి సిరిసంపదలకు అతన్ని శాసకుడిగా చేసింది. ఉత్తర భారతదేశంలో ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. గుజరాతీయులు ధనత్రయోదశి రోజున సంవత్సరాది పండుగగా కూడా జరుపుకుంటారు. అలాగే వారు ”అమాదర జ్యోతిక్షేత్ర త్రయోదశిగా చెబుతారు. గుజరాతీయులు
ధనత్రయోదశిని ”ధన్‌తేరస్‌’గా అతి పవిత్రంగా పిలుస్తారు. ధనత్రయోదశి నుంచి దీపావళి వరకు మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ”గోత్రిరాత్రి వ్రతం” జరుపుతారు. గోమాతను లక్ష్మీ స్వరూపంగా భావించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ధనత్రయోదశి నాడు పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదించడానికి
భూమికి దిగి వస్తారని ప్రజల విశ్వాసం. పితృదేవతలకు దారి చూపడానికి దక్షిణం వైపు దీపం పెడతారు. ఇలా దీపారాధన చేసినవారికి అపమృత్యు దోషాలు తొలగి పోతాయని పురాణాలు చెబుతున్నాయి.
మానవున్ని సుఖ, సంతోషాలతో పిల్లాపాపలతో, పాడి, పంటలతో, అ్లపశ్వర్యాలతో ఆనందమయంగా జీవింపజేయడానికి శ్రీలక్ష్మీమాత అష్టలక్ష్ముల అవతారాలను దాల్చింది. 1.ఆదిలక్ష్మి, 2.ధాన్యలక్ష్మి, 3.దైర్యలక్ష్మి, 4.గజలక్ష్మి, 5.సంతానలక్ష్మి, 6.విజయలక్ష్మి, 7.విద్యాలక్ష్మి, 8.ధనలక్ష్మిలను ఎనిమిది రూపాల్లో సర్వసంపదలిచ్చే తల్లిగా ప్రతీ ఒక్కరు ఆరాధిస్తూ లక్ష్మీ కటాక్షాన్ని పొందుతా విశ్వాసం ఉంది. సనాతనంగా సమాజంలో స్త్రీకి సమున్నత గౌరవం, సాధికారత ఎంతో గొప్పగావుంది. ప్రతీ రంగంలో ఆమెను శిఖరాగ్రంపై రారాణిగా అధిష్టింపజేయడానికి పూర్వీకులు ఎన్నో ఏర్పాట్లు చేశారు. స్త్రీకి అలాంటి మ#హూన్నత గౌరవం దక్కడానికి త్రిశక్తిదేవత (లక్ష్మీ, పార్వతి, సరస్వతి)లతో పోల్చారు. ముఖ్యంగా ఆడపిల్లల్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఎంతో సంబరంగా గొప్పగా చెబుతారు. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కావాలని ఆడవాళ్ళకు లక్ష్మి, వరలక్ష్మి, ధనలక్ష్మి ఇలా లక్ష్మిల పేర్లు పెట్టి నిత్యం ధనదేవత లక్ష్మీమాతను తమ మదిలో నిలుపుకుంటారు.
స్త్రీలు ఎక్కడ కంటతడి పెట్టరో, ఎక్కడ సుఖసంతోషాలతో చిరునవ్వులు చిందిస్తూ కళకళ లాడుతారో… అక్కడ తానుంటానంది లక్ష్మీదేవి. దీంతో స్త్రీని ప్రతీ ఒక్కరూ మర్యాదగా, గౌరవంగా చూసుకోవాలన్న జ్ఞానోదయం కలుగుతుంది. ఎక్కడెక్కడ తానుంటాను… ఏ ఇల్లు శుచిగా, శుభ్రంగా ఉంటుందో? ఏ ఇల్లు, వాకిళ్ళు శుభ్రంగా ఊడ్చి, ముగ్గులు వేసి ఉంటాయో అక్కడ తానుంటానని లక్ష్మీదేవి చెప్పింది. అందుకే ప్రతీ గృ#హణి వేకువ జామున్నే లేచి తమ ఇంటి వాకిళ్ళు ఊడ్చి, కళ్లాపుజల్లి, ముగ్గులు వేసి లక్ష్మీదేవి రాకకు నిండు మనసుతో, భక్తి వినమ్రతతో ఎదురు చూస్తుంటుంది. శ్రీమన్నారాయణునికి తాను పరమశక్తినని లక్ష్మీదేవి పేర్కొంది. ఈ శక్తియే నారాయణి అని కూడా తెలిపింది. విష్ణు శక్తిగా చెప్పబడిన అ#హంతా శక్తియే ఆదిలక్ష్మీ. అందులోనివే… ఆపరాశక్తి, విద్యాశక్తి అని స్పష్ట పరిచింది.
వరలక్ష్మి రాజరాజేశ్వరి, భువనేశ్వరి, శ్రీమహాలక్ష్మి బాలత్రిపుర సుందరి, ముగ్గురమ్మల మూల పుటమ్మ, అంబుజాసన, అబ్దిజ, అమల, ఇందిర, ఈశ్వర, దాక్షయణి, నారాయణి, వైష్ణవి, పద్మ, పద్మకర, పద్మాలయ, పద్మిని, మంగళ దేవత, మాధవి, రమ, సంపద, సింధుజ ఇలా ఇంకా ఎన్నో నామాలతో సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీమహాలక్ష్మిని భక్తి, శ్రద్ధలతో పూజిస్తూ సర్వమానవాళి ఆ తల్లి అనుగ్ర#హం పొందుతూ సుఖ, ఐశ్వర, ఆనందమయ జీవితాన్ని పొందుతోంది.
లక్ష్మీ కటాక్షానికి దీపావళినాడు వివిధ వ్యాపారులు ధనలక్ష్మి పూజలు గొప్పగా జరిపి కొత్త ఖాతాలు తెరుస్తారు. సంపదలిచ్చే తల్లిగా, సకల ప్రజలను తన బిడ్డలుగా ఎంచుకొని వారికి నిరంతరాయంగా సర్వసంపదలిస్తున్న తల్లి లక్ష్మీదేవిని కొలువని వారు లేరు. ఆ తల్లిని మరువని వారు లేరు. లక్ష్మీదేవిని మదినిండా నింపుకొని భక్తి, పారవశ్యంతో ఆరాధించి తల్లి అనుగ్ర#హం పొందిన ఎందరెందరో దరిద్ర నారాయణులు పట్టిందల్లా బంగారమై, ముట్టిందల్లా ధనం మూటలై, అష్టశ్వర్య శ్రీమంతులై హాయిగా ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నారు.

  • తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌
Advertisement

తాజా వార్తలు

Advertisement