Saturday, November 23, 2024

దివ్య ప్రార్థనకు అనువైన ధనుర్మాసం

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామ హమ్‌
మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర:

వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును” అంటూ సాక్షా త్తు శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియో గంలో చెప్పిన శ్లోకమిది.
మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పర మ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్య ములైన పాశురములను అను గ్రహంచినది. ”మార్గళం గల్‌ మదినిజైన్ద నన్నాళాల్‌ మార్గశిరము వచ్చినది. పూర్ణ చంద్రునితో కూడిన శుక్లపక్షము వైష్ణవ మాసము. మార్గశీర్ష ము అనగా భగవంతుని పొందు దారి- ”నారాయణనే నమ క్కే” అని శరణాగతి.
భాగవతం దశమ స్కంధంలోనే భగవంతుని వెదకెడి ద్రోవలో హమంతంలో ప్రధమ మాసంలో నంద ప్రజ కుమారికలు భగవత్‌ ప్రసాదం ”హవి ష్యం భుంజాన:” కాత్యాయనీ వ్రతం చేయుటకు పూ నుకొన్నారని ప్రమాణం ఉన్నది. భాగవత దశమ స్కందంలో బమ్మెర పోతనామా త్యుడు, గోపభామలు ”మార్గశీర్షవ్రతం” జరిపారని పేర్కొ న్నాడు. జ్ఞానమును పెంపొందించే ధనుర్మాసంలో ఓంకా రాన్ని ధనువుగా, ఆత్మను బాణంగా, బ్రహ్మమును లక్ష్యం గా చేసుకుని, సాధకులు నిర్మల, నిశ్చల మనస్కులై ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేస్తే, త్వరగా లక్ష్యసిద్ధి కలుగుతుందనే విశ్వాస ం.
కాలాన్ని కొలిచేందుకు అనేక కొలమానాల్ని అనుసరి స్తారు. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైన వి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమా నం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోనికి ప్రవేశించడాన్ని రాశి సంక్ర మణం అంటారు. ఈ సంక్రమణం ప్రతి నెలలోను జరు గుతుంది. ధనుస్సు రాశిలో ప్రవేశించిన సమయం ధను స్సంక్రమణం కాగా ధనుస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అంటారు. సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన రోజు నుండి మకరరాశిలోకి ప్రవేశించువరకు గల మధ్య రోజులను… సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు. సూర్యుడు ధనురాశి లో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలై, తిరిగి సూ ర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. దక్షిణాయనానికి చివర, ఉత్తరాయణాయనా నికి ముందుండే ధనుర్మాసం పరమ పవిత్రమైంది. ధనుర్మా సం అం టే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయా ల్లో జరిగే కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారం భమవుతుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లెసీమల్లో సం క్రాంతి నెలపట్టడము అంటారు.
ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురా ణాలు, భాగవతం, నారాయణ సంహతాల్లోనూ కనిపిస్తా యి. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ధనుర్మా సం. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసంలో వ్రతా న్ని చేపట్టి నారాయణుని కొలిచింది. సాక్షాత్తు భూదేవి అవ తారమైన అండాళ్‌ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అనగా పవిత్రం, పావై అనగా వ్రతం అని అర్థం. వేదాలు, ఉపనిష త్తుల సారమే తిరుప్పావై అని పురా ణాల ఆధారం. విష్ణుచిత్తుడి కుమార్తె గోదాదేవి మానవ మాత్రు లని కాక శ్రీరంగనాథుడినే వివాహం చేసుకుంటా నని దీక్ష బూనుతుంది. ఆమె ధనుర్మాసంలో వేకు వనే లేచి నిత్యం విష్ణువుని పూజిస్తూ తన అనుభూ తిని, భావాలన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. 30 పాశురాలను ఆ మాసం లో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. ఆమె భక్తికి మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెపుతాడు. ఆమె ఈ విషయాన్ని తన తండ్రికి చెప్ప డంతో ఆయన గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరుకుం టాడు. రంగనాథస్వామితో వివాహం జరిగినం తనే గోదా దేవి ఆయన పాదాల చెంత మోకరిల్లి స్వామిలో అంతర్లీన మైపోతుంది. ధనుర్మాసం నెలరోజులు బ్రహ్మ ముహూర్తం లో నదీ స్నానాలు, పూజలు, జపాలు చేయడం, వైష్ణవ ఆల యాలను సందర్శించడం శుభప్రదం.
ప్రతిరోజు సూర్యోదయం కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తి చేసుకుని, తల స్నానం చేసి నిత్య పూజలు ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి.
ఈ నెల రోజుల పాటు బాలికలు, మహళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి రూపంగా పూలతో, పసుపు కుంకుమ లతో అమ్మవారిని పూజిస్తారు. నెల రోజులూ హరి దాసుల కీర్తనలతో, జంగమ దేవరలతో, గంగిరెద్దులను ఆడించే వారితో సందడిగా వుంటుంది. ముంగిళ్ళలో కల్లా పి జల్లి, ముగ్గులతో కనుల విందుగా వుంటాయి. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంబరాలతో పల్లెలు ‘సంక్రాంతి’ పండుగకు ఎదురుచూస్తూ ఉండే కాలం ఇది.
(రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం)

Advertisement

తాజా వార్తలు

Advertisement