Saturday, November 23, 2024

దివ్య జీవిత గమ్యం

అనంతమైన మానవుని ఆలోచనాశక్తిలోనే ఈ అద్భుతమై న విశ్వం రూపం దాగివుంది. మనలాంటి భూగోళాల కోసం అన్వేషణ కొన సాగుతూనే ఉంది.సృష్టికర్త మనకందించిన ప్రకృతిని అనేక మార్పు లకు గురిచేసి, రకరకాల వస్తువులను కనుగొని చిత్రాతి చిత్రమైన జీవనానికి గురవుతున్నాడు మానవుడు. ఇదంతా విజ్ఞాన శాస్త్ర వినియోగ ఫలితం కలియుగ ప్రభావం. అనేక లక్షల రకాల జీవులలో మానవ రూపం ఒక ప్రత్యేకమైన సృష్టి. ఆ సృష్టికర్త కోసం కాలం జనించినది మొదలు మానవుని అంతరంగం తహతహలాడుతూనే ఉంది. చివరకు అది ఆత్మరూపంలో నున్న పరమాత్మయని, అంతటా నిండి వున్నది అదేనని నిర్ధారించాడు. ఈ పరిశోధనకు సహాయపడినది కూడా ఆత్మే! తపస్సు అనే క్రియతో తమ మనో నేత్రాలతో కనుగొన్నారు మన సనాతన ఋషి పుంగవులు. ఇదంతా సనాతన ధర్మజ్ఞాన యజ్ఞ ఫలితం. సృష్టి సమ్మత విశ్వాస మార్గంగా మానవులకు లభించిన జ్ఞానం ఈ ఆత్మ యో గం.
కల్పములు, కల్పాంతములు, సృష్టి మొదలు, అంతము, కాలవిభజన ఇవన్నీ తపస్సు వలన కనుగొనబడినవే! ”అండము నుండి బ్రహ్మాండము వెలువడినది. ప్రతి కల్పములో వటపత్రశాయి అనంత జలములలో తేలు తూ త్రిమూర్తులను సృజిస్తున్నాడని ప్రతీతి. విస్ఫోటనము నుండి ఈ విశ్వం ఆవిర్భవించింది. ఏక కణము నుండి జీవం ఏర్పడింది. దీనికంతటికి కార ణం మనకు తెలియని ఏదో ఒక అద్భుత శక్తి.”
ఏది ఏమైనా తుదకు ఈ అమేయమైన సృష్టికి కర్త ఒకడున్నాడనేది యుగయుగాలుగా వస్తున్న విశ్వాసం. కానీ ఈ సృష్టి రహస్యాన్ని, భగవం తుని శక్తిని, వ్యక్తావ్యక్త రూపాలను, లోకాల స్వరూపాన్ని, త్రిమూర్తుల సృష్టి స్థితి లయ విన్యాసాలను, ఎనుబదినాలుగు లక్షల జీవరకాలను, మానవుడి సృష్టిని, చతుర్వర్ణాలను, త్రిగుణాలను, గుణకర్మలను, ధర్మాన్ని, అవతారా లను గురించి తెలియచేస్తోంది. ఒక్క సనాతన ధర్మ వాఙ్మయం మాత్రమే!
సనాతన ధర్మ వాఙ్మయానికి మూలం అపౌరుషేయాలైన వేదములు. వాటి నుండి ఉపనిషత్తులు లభించాయి. ఇక అల్పజ్ఞానులైన కలియుగ మానవుల కోసం వేదవ్యాసుల వారు విభజించి అందించినవి అష్టాదశ పురాణాలు, మహాభారతం. ఇక అవతారాల విశిష్టతలను మనకందించినవి శ్రీరామాయణం, భాగవతం. నిత్యజీవన, ఆదర్శ జీవన, దివ్యజీవన మార్గా లను నిర్దేశించిన అద్భుత వాఙ్మయం మనకొక సనాతన ధర్మ పథాన్ని చూపించింది. ఇది సమస్త మానవ కళ్యాణానికి సనాతనమైనది.
త్రిగుణాత్మకమైన ప్రకృతి జీవులను నిర్దేశిస్తుందనేది పరమ సత్యం. ఆస్తికుడైనా, నాస్తికుడైనా దీనిలో భాగమే! వ్యక్తావ్యక్త స్వరూపుడైన ఆ భగ వంతుని చూసేది దీనిలోనే! ఇంతకుమించి మానవునికి నేపథ్యం లేదు. అం దుకే సగుణారాధనతో ఆ సృష్టికర్త అనే పరమాత్మ కోసం అన్వేషణ ప్రారంభ మవుతుంది. చివరకు నిర్గుణోపాసనతో ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఈ సగుణోపాసనలో భాగమే నవవిధ భక్తి మార్గములు. ముక్కోటి దేవతల ప్రస్థావన. ప్రకృతినే దైవంగా భావించి చేసే ఆరాధన. బ్రహ్మ అనే బ్రహ్మ పదార్థం నుండి ఈ ఎనుబది నాలుగు లక్షల జీవరాశులు సృజించబడ్డాయి. స్త్రీ, పురుష విభాగం చేయబడింది. మనకు తెలియని సృష్టి రహ స్యాలు ఎన్నో ఉన్నాయి. మహాసముద్రాలలో నివసించే విచిత్రమైన జీవులను పరిశీలించి న మన ఆధునిక ఋషి పుంగవులకు అనేక అద్భుత విషయాలు తెలుస్తు న్నాయి. ఒకరకం చేప తనకు తానే రెండుగా విడిపోయి కొన్ని ఆడ చేపలుగా, కొన్ని మగ చేపలుగా మారడాన్ని గమనించి ఆశ్చర్య పోతారు. ఈ చరాచర విశ్వంలో ఎన్నో మనకు తెలియని వింతలు ఉన్నాయి. అయితే అవి మనకు వింతలు. కానీ అవన్నీ భగవంతుని సృష్టి ప్రహేళికలో భాగం. అయితే ఈ ఆనందకరమైన జగత్తులో అజేయమైన ఆలోచనాశక్తిని కలిగిన జీవి మాన వుడు. అందుకే మానవజన్మను పొందాలని దేవతలు కూడా ఆశపడతారు. ఈ జగన్నాటకంలో మానవుడనే బొమ్మను సృజించి సచ్చిదానందమును పొందమని ఒక వకాశమిచ్చాడు ఆ పరాత్పరుడు. అహింస పరమ ధర్మము అని బోధించి దానికొరకు ధర్మహింస అనే మహాభారత యుద్ధము చేయిం చాడు గీతాచార్యుడు. సనాతన ధర్మము చతురాశ్రమాలను నిర్మించి మాన వునికి మోక్షమా ర్గం చూపింది. బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థము, సన్న్యాసములలో బ్రహ్మచర్యమునుండే నేరుగా సన్న్యాసమును చేరువారు మహా జ్ఞానులైన యోగులు. అందుకే సనాతన ధర్మమార్గము ఒక విశ్వమా నవ విశ్వాసము. దివ్యజీవిత గమ్యం. ఇంతటి మహత్తరమైన మానవ జన్మ ను సార్థకం చేసుకోవడానికి పరమాత్మ శ్రీరాముడుగా, శ్రీకృష్ణునిగా ఈ భువి పై అవతరించి తాము ధర్మాన్ని ఆచరించి మనకు మార్గదర్శనం చేసారు. సృష్టికి, ధర్మానికి, శిష్టు విశ్వాసాలకు భంగం కలిగించినవారికి శిక్ష తప్పదు. ఆ శిక్ష ఏ రూపంలో, ఎలా వేయాలో నిర్ణయించేది ఆ అవతార రూపుడే!

Advertisement

తాజా వార్తలు

Advertisement