Friday, November 22, 2024

విశేష శక్తినిచ్చే దైవకార్యాలు

శ్రావణ మాసం ప్రారంభం అయింది. ఈ మాసం లో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెలరోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవన్నామ స్మరణ తో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాం టి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నా రు పండితులు. అంత గొప్ప పవిత్రమాసం శ్రావ ణం. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజు లు, విశిష్ట పండుగలు రానున్నాయి.
సనాతన ధర్మంలో (హందూ) చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటింది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి.

ఇష్టకార్యార్థం ఏడుకొండల స్వామి పూజ

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామికి భక్తులు శనివారం ప్రత్యేక పూజలు చేసి తమ భక్తిని చాటుకుంటారు. తమ కోర్కెలు తీర్చమని ఆ ఏడుకొండలవాడిని వేడుకుంటారు. అయితే శ్రావణమాసంలో వచ్చే శనివారాలు అత్యంత ప్రత్యేకమైనవి. ఈ శనివారాలు కనుక ఏడుకొండల స్వామికి దీపారాధన చేస్తే ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటారు. ఈ ప్రత్యేక దీపారాధన చేస్తే శ్రీనివాసుడు కల్పవృక్షమై మనము కోరుకున్న కోర్కెలు నెరవేరుస్తా డు. శ్రావణమాసంలో వచ్చే శనివారాలలో వేంకటేశ్వర స్వామి ప్రతిమ లేదా ఫొటో తీసుకు ని ప్రత్యేకంగా అలంకరించాలి. ఆవుపాలు, బెల్లము, బియ్యప్పిండిలను కలిపి చేసిన చలివిడితో ప్రమిదను చేసి అందులో ఆవు నెయ్యని నింపి దీపారాధన చేయాలి. అ నంతరం శ్రీవేంకటేశ్వరుని అష్టోత్తర శతనా మావళితో పూజచేయాలి.
వేంకటేశ్వరస్వామికి వడపప్పు, పానకము నైవేద్యంగా సమర్పించాలి. వెలుగుతున్న జ్యోతిని వేంకటేశ్వరుని ప్రతీకగా తలచి మన కోర్కెలను తీర్చమని ప్రార్థించాలి. ఈవిధంగా శ్రావణమాసంలో వచ్చే శనివారాలలో చేసినట్లయితే ఏడుకొండల స్వామి అనుగ్రహం తప్పక పొంది మీ కోర్కెలు నెరవేరుతాయి.

శివారాధనకు ఎంతో విశిష్టత

ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళ లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచ నం. సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఈ వ్రతాన్ని (ఉపవాసదీక్షను) చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగినవారు పూర్తిగా ఉండాలి. అలా సాధ్యంకాని పక్షంలో రాత్రి పూజ ము గిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలి తాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల పదిహను రోజులు ఎంతో విశె షమైన రోజులనీ ఒక్కోరోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేద శాస్త్రలు చెబుతున్నాయి.
మనం ఏ పూజ చేసినా పూర్తి విశ్వాసంతో భక్తిశ్రద్ధలతో చేయాలి. దేవునికి పూజ ఎంత గొప్పగా చేశాం అన్నది కాదు ఎంత నమ్మ కంతో భక్తిశ్రద్ధలతో చేశాం అన్నది ముఖ్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement