రామాయణ, భారత, భాగవతాలు జాతి మహోన్నత సంపదలు. ఆర్ష సంస్కృతీ సంప్రదాయాలను పరోక్షంగా బోధించే/ప్రవ చించే జీవన విలువల సందేశాత్మకాలు. దిశా నిర్దేశం చేసే మార్గ దర్శకాలు. మనిషి ఏ రకంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా జీవించకూ డదో, ఎలా మసలుకోవాలో, జీవితాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలో అనే విషయాలను విపులంగా సోదాహ రణంగా వివరిస్తాయవి. జాతిని జాగృతం చేస్తాయవి.
ప్రతి ఘటనలోను, సంఘటనలోను, సన్నివేశం లోను, సందర్భంలోను, పాత్రలలోను ఉత్కృష్టమైన విలువల్ని మనకు వెలువరిస్తాయి. మనిషి మనీషి అయ్యేలా, మానవులు మహనీయులయ్యేలా మా మూలు సంఘటనలలోనూ మనకి మహత్తరమైన సం దేశాన్నందిస్తాయి.
మనకు తెలిసిందే నిజం. మనం చూస్తున్నది మనం అనుభవిస్తున్నదే సత్యం అనే అభిప్రాయంతో మనం ఉంటాం. ఆ భ్రాంతిలోనే అందరూ ఉండాలని యితరులతో వాదనకు దిగుతాం. వాదులాడుతాం.
కొత్తగా పెళ్లయిన ఓ జంట విహార యాత్రకని (హనీమూన్) రైల్వే స్టేషన్‌కి వచ్చారు. ప్లాట్ ఫాం వచ్చీపోయే వాళ్ళతో కిటకిటలాడు తోంది. ఎవరి పనుల్లో వారు. ఎవరి ఊసుల్లో వారు ఎంతో బిజీగా ఉంటున్నారు. అంత రద్దీలోనూ, అంత గందరగోళంలోనూ కొత్త జం ట అనువైన ఓ ప్రదేశాన్ని ఎంచుకుని కూచున్నారు. అచ్చట్లు ముచ్చ ట్లతో ఆనందంలో తేలిపోతున్నారు.
వాళ్ళిద్దరికీ పదడుగుల దూరంలో ఓ సిమెంట్ బల్లమీద ఓ పెద్దాయన కూచుని ఉన్నారు. ఏ విషయం పట్టించుకోకుండా ఏదో పుస్తకాన్ని చదువుకుంటున్నారు. పెద్దాయనను జంట లోని కుర్రాడు చాలాసేపు గమనించాడు. ఆ కుర్రాడికి పెద్దాయన మీద చిరాకేసింది. పెద్దాయన దగ్గరకు వెళ్ళి ”ఏవండీ. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ప్రక్కన ఏమవుతోందో అనే ధ్యాస కూడా లేకుండా, పుస్తకం చదవుకోవ డంలోనే మునిగిపోయారు. కాలాన్ని వృథా చేసుకుంటున్నారు. మీకిది భావ్యమేనా?” అని నిలదీసి అడిగాడు.
పుస్తకం చదువుకుంటున్న పెద్దాయన ఓసారి తలెత్తి కుర్రాడ్ని చూసి చిరునవ్వు నవ్వి మళ్ళీ పుస్తకంలోకి జారుకున్నారు. మరో అరగంట గడిచింది. మళ్ళీ కుర్రాడు పెద్దాయన దగ్గరకు వెళ్ళి ”అ య్యా! నేను అరగంట క్రితం ఆ రకంగా చెప్పిన తర్వాత కూడా, మీరేమీ పట్టనట్టు మీ చాదస్తంలోనే మీ పద్దతిలోనే మీరున్నారు. ఆ పుస్తకం చదవడంలోనే మునిగిపోయారు.” వ్యంగ్య ధోరణిలో పెద్దాయనను సూటిగా ఎత్తి పొడిచాడు. పెద్దాయన పుస్తకం మీంచి తన దృష్టిని ఓసా రి మరల్చి, తలెత్తి కుర్రాడ్ని ఓ చూపు చూసి చిరునవ్వు నవ్వి పుస్తకం చదవడం కొనసాగించారు.
కుర్రాడు అలా వ్యంగ్యంగా చాలాసార్లు అడగటం, పెద్దాయన పుస్తకం అదే రకంగా చదువుకుంటూ ఉండటం అలా జరుగుతూనే ఉంది. ఇంతలో రావలసిన రైలు వచ్చింది. ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళ తోపు లాటలు, పెనుగులాటలు, కుదుపులు అరుపులతో ఎక్కగలిగిన వాళ్ళు రైలు ఎక్కారు. కొందరు తోపులాటలో ప్లాట్‌ఫామ్ మీదే ఉండి పోయారు.
ట్రైన్ కదలడం వేగం పుంజుకోవడం క్షణాల్లో జరిగిపోయింది. కంపార్ట్మెంట్ కిటకిట లాడిపోతోంది. అంతలో ”ఏవండీ! నా భార్య రద్దీలో రైలు ఎక్కలేక పోయినట్టుంది. ట్రైన్లో లేదు. అసలే ఆమెకి ఈ ఊరు కొత్తండి.” లబోదిబోమని ఏడుస్తున్నాడు విహారయాత్రకు బయల్దేరిన జంటలోని కుర్రాడు పక్కనున్న ఆసామీతో. ఆ ఆసామీ ఎవ రో కాదు. ప్లాట్ ఫాం మీద రామాయణం పుస్తకం చదువుకుంటూ, ఈ కుర్రాడి చేత హళన చేయబడ్డ పెద్దాయనే.
కుర్రాడి గోలంతా పెద్దాయన విన్నారు. మొదటి సారిగా పెదవి విప్పారు. ”చూడు నాయనా! నువ్వు కూడా నాలా రామాయణం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, నువ్వు ఈ రోజు యిలా ఏడవ వలసిన దుస్థితి నీకు వచ్చి ఉండేది కాదు.” అన్నారు పెద్దాయన.
ఏమీ అర్ధంకాక తెల్లమొహం వేసుకుని వింటున్నాడు కుర్రాడు.
”అవును నాయనా! రామాయణంలో సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరాముడు అయోధ్య వదిలి అరణ్యానికి వెళ్తున్నాడు, మధ్యలో నదిని దాటవలసి వస్తుంది. గుహుడు పడవలో నదిని దాటిస్తాడు. ఆ సన్ని వేశంలో- సీతమ్మ పడవ ఎక్కిన తర్వాత
శ్రీ రాముడు పడవ ఎక్కుతాడయ్యా. రామాయణం నువ్వు క్షుణ్ణం గా చదివి, శుభ్రంగా అర్ధం చేసుకుని ఉంటే ఆ సత్యం, ఆ సన్నివేశంలో పరోక్షంగా దాగి ఉన్న జీవన పాఠం (సందేశం) నీకు అర్ధం అయి ఉం డేది. జీవిత పాఠం, జీవన విధానం నీకు తెలిసొచ్చి జీవితంలో నువ్వు ఈ రకంగా చేయాలని తెలిసేది. ఫలితంగా ఈ రోజు నువ్వు మీ ఆవిడ రైలు ఎక్కిన తర్వాతే రైలు ఎక్కేవాడివి. నీకీ దుస్థితి తప్పేది.” చెప్పటం పూర్తి చేసారు పెద్దాయన.
కుర్రాడికి జీవన పాఠం తెలిసింది. జీవనంలో ఏ సమయంలో ఏరకంగా ప్రవర్తించాలో, ఏవిధంగా నడుచుకోవాలో అనే అన్ని విషయాలు జాతి సంపదలైన గ్రంథాలు పరోక్షంగా జాతికి ప్రబోధం చేస్తాయనే విషయం కుర్రాడికి పూర్తిగా తెలిసొచ్చింది. రామాయణ, భారత, భాగవతాల విశిష్టత అను భ వానికొచ్చింది. అర్ధమైంది.
దిశానిర్దేశాలుమన ఇతిహాసాలు!
Advertisement
తాజా వార్తలు
Advertisement