మనలో చాలామంది అనేక రోగాలతో, రకరకాల జ్వరాలతో బాధపడుతుంటారు. ఈ అస్వస్థతకు కారణం మనం తినే ఆహార పదార్థాలు, వాతావరణ ప్రభావం, వంటివి కారణభూతాలు. కాని ఇవన్నీ పరమాత్మ సృష్టే అని మహాభారతంలోని ఉపాఖ్యానాలలో వ్యాస మ#హర్షి అందించారు. వాటి గురించి తెలుసుకొందాం.
అనేక రోగాల సృష్టి
—
బ్రహ్మ దేవుడు జగాలన్నీ సృష్టించిన తరువాత ఈ భూమి అంతా జీవరాశులతో నిండి పోయింది. అప్పుడు ఈ జీవ రాసులను ఎలా సంహరించాలనే దీర్ఘ ఆలోచనలో ఉండగా ఆయన శరీరం మాయ ఆక్రమించింది. శరీరం అంతా వేడెక్కిపోయింది. దహంచుకుపో సాగింది. ఆయన శరీరం నుంచి వచ్చిన అగ్ని మూడు లోకాలు వ్యాపించ సాగింది. అపుడు శివుడు బ్రహ్మ వద్దకు వచ్చి శాంతించమని, జీవులను సంహరించడానికి ఇది మార్గం కాదు. అంటూ ఆయన శరీరం మీద భస్మాన్ని చల్లగా, ఆయన శరీరం నుంచి ఒక ఎర్రని కళ్ళతో, క్రోధంతో స్త్రీ బయటకు వచ్చింది. అపుడు ఆమె ”నా కర్తవ్యం ఏమిటి?” అని అడిగింది.
బ్రహ్మ ”ఓ! మృత్యుదేవతా! నువ్వు భూమిపైన ఉన్న జీవులను బలవంతుడు, బల హనుడు, ధనవంతుడు- పేదవాడు, అనే బేధం లేకుండా సంహరిస్తూండాలి.” అపుడు ఆ మృత్యుదేవత ఏడుస్తూ ”ఓ! బ్రహ్మ దేవా! ఇంతటి క్రూరమైన పని ఎలా చేయను? పవిత్ర మైన నీ శరీరం నుంచి వచ్చాను. నాకు ఏదైనా ధర్మకార్యం అప్పగించు.
సంహరించే కార్యంలో బంధువుల రోదనలు, బాధ నేను భరించలేను.” అని రోదిస్తూంటే, బ్రహ్మ ఆమె కళ్ళనుండి వస్తున్న వేడి కన్నీటిని దోసెడుతో పట్టి, ”ఈ నీ కన్నీటిని లోకాల మీదకు జల్లుతున్నాను. ఒక్కొక్క బిందువు ఒక్కో రోగంగా మారి మనుష్యులను పట్టి పీడిస్తూంటాయి. అనారోగ్యాలతో మరణించేటట్లుగా చేసి, నీవు ఆ జీవి ప్రాణాలను మాత్రమే తీస్తావు. నిన్ను సృష్ణించినది ఇందుకే. ఇదికూడా ధర్మ కార్యమే నువ్వు నిమిత్త మాత్రురా లవు. నీకు ఏ పాపం అంటదు.” అని చెప్పేసరికి, ఈ పని నిర్వర్తించకపోతే బ్రహ్మ ఏ శాపం ఇస్తాడో? అని భయపడి, కర్తవ్యం నిమిత్తం భూలోకం చేరింది.
జ్వరం స్వరూపం గురించి…
మనలో జ్వరం బారిన పడని వారు, వాన తడవని వారు ఎవ్వరూ ఉండరు. అన్ని కాలా ల్లోనూ, ముఖ్యంగా కాల మార్పు సమయాల్లో, శీతోష్ణ స్థితిలో కలిగే మార్పులు వల్ల శీతా కాలంలోను, వర్షాకాలంలోను ఎక్కువగా ”జ్వరం” పట్టి పీడిస్తూంటుంది. జ్వరానికి చిన్న- పెద్ద ,పేద- ధనిక, మతం- కులం, వంటివి ఏమీ అక్కర్లేదు. దానికి అందరూ సమానమే.
ఈ ”జ్వరం ఎలా పుట్టిందీ?” అనే ప్రశ్నకు జవాబుగా ఒక ఇతిహాసం చెప్పుకోవాలి. అదేమిటో పరిశీలిద్దాం. శివుడు వెండి కొండ మీద సతీదేవితో కూడి ఉన్న సమ యంలో దేవతలు, మహర్షులు, యక్షులు, మొదలగు వారు ఆది దంపతులను సేవిస్తూ ఉన్నారు. అలా సేవ చేస్తూన్న వారు ఒకరోజు కైలాసం నుండి బయలుదేరి వెడుతుంటారు. అది చూసిన అంబిక (సతీదేవి) ” స్వామీ! వారందరూ ఎక్కడికి వెళుతున్నారు? ఏం పనిమీద?” అని అడిగింది. అపుడు పరమేశ్వరుడు దక్షుడు చేసే యజ్ఞంలో తమతమ హవిర్భాగాలు స్వీకరించడానికి వెడుతున్నా రు.” అని చెప్పగానే, సతీదేవి ”నాథా! మీరు ఎందుకు వెళ్ళ టం లేదు?” అని ప్రశ్నించింది.
అప్పుడు శివుడు ”దక్షుడు నన్ను ఆహ్వానించలేదు. నాకు అగ్ర భాగాన్ని కల్పించలేదు.” అని చెప్పారు. అప్పు డు సతీదేవి ”నా తండ్రి ఒక యాగాన్ని చేస్తూ, అందర్నీ ఆహ్వానించి, కన్న కూతురైన నన్ను, అల్లుడు, లోక కళ్యా ణం కోరే మహాదేవుడు మిమ్మల్ని పిలవకపోవడం అవ మానించినట్లే. ఎందుకు ఇలా జరిగింది? నేను వెళ్లి మా తండ్రిగారిని అడిగివస్తాను.” అని పుట్టింటి మీద మమకారంతో అడిగింది. పరమేశ్వరుడు ”మనకు ఆహ్వానం లేనప్పుడు, పుట్టింటికైనా వెళ్ళడానికి ఇది సరైన టైము కాదు. వద్దని వారించాడు.
అయినా పట్టుదలతో, శివుడును ఒప్పించి, దక్ష యజ్ఞానికి వెళ్ళింది. అక్కడ జరిగిన పరాభవంతో దేహ త్యాగం చేసింది. ఈ విషయం గ్రహంచిన పరమేశ్వరుడు వీరభద్రు డును సృష్టించి, ప్రథమగణాలతో కలిసి దక్ష యజ్ఞం చోటకు వెడతారు. అక్కడ శివుని ఆజ్ఞ మేరకు వీరభద్రుడు, గణాలు యజ్ఞ వాటికను సర్వనాశనం చేస్తారు. రక్తాన్ని చల్లి అగ్ని హోత్రుడుని చల్లారుస్తారు. అక్కడే ఉన్న దేవతలు, మహర్షులు, అందరూ ఆశ్చర్యపో యారు. ఈశ్వరుడుకు వచ్చిన కోపం కారణంగా నుదుటిన ఏర్పడిన స్వేద బిందువులు (చెమట బిందువులు) భూమి మీద పడ్డాయి. వెంటనే అక్కడ పెద్ద మంట వచ్చి, ఆ మంటలో నుంచి ఎర్రని నేత్రాలు, నల్లని రూపం, శరీరం అంతా రోమాలతో భయంకరమైన పురుషుడు వెలువడ్డాడు. అలా జరగగానే భయంతో అక్కడే ఉన్న దేవతలు, మహర్షులు, అందరూ భయంతో తలో దిక్కుకు పారిపోయారు. అపుడు బ్రహ్మ పరమేశ్వరుడు వద్దకు వచ్చి నమ స్కరించి, ”ఓ! పరమేశ్వరా! దేవతలు నీకు యజ్ఞలో భక్తితో భాగం కల్పిస్తారు. మీ క్రోధాన్ని తగ్గించండి. శాంతించండి.” అని వేడుకున్నాడు.
దాంతో శివుడు శాంతించాడు. వెంటనే దేవతలు, మహర్షులు, యక్షులు అందరూ శివుని వద్దకు వచ్చి ”యజ్ఞమును కొనసాగించుటకు శివుడికే ప్రథమ భాగం కల్పిస్తామని చెప్పగా, శివుడు అంగీకరించాడు.
శివుడు స్వేద బిందువులు నుంచి ఉద్భవించిన వాడు ”స్వామీ! నా కర్తవ్యం ఏమిటి? ఎందుకు నన్ను సృష్టించారు?” అనగానే, బ్రహ్మ ”చంద్రశేఖరా! ఈ పురుషుడు ”జ్వరం” అనే పేరుతో ప్రసిద్ధుడు అవుతాడు. అతడు ఈ లోకంలో సంచరిస్తూ ప్రజలను ఆవహ స్తూంటాడు.” అని బ్రహ్మ చెప్పగా… ఈ జ్వరం ఏకరూపమై ఉంటే భూమి భరించలేదు. ప్రజలకు కష్టాలు ఎక్కువైపోతాయి అందువల్ల ఈ జ్వరాన్ని నానా రూపాలుగా సంచరించే విధంగా చెప్పమని ”కోరతాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు ”ఈ జ్వరం మానవులకు శరీరాన్ని, ఏనుగులకు తలభాగంలో పాములకు కుబుస రూపంలో, గోవులకు, వృషభాలకు గిట్టల మధ్య (పశువులకు గాళ్ళు తగిలాయంటారు), గుర్రాలకు పార్శ్వ భాగంలో, గేదెలకు, దున్నలకు శరీరభాగంలో, నెమ ళ్ళకు ఈకలలో (శరీరంలో జ్వరం వస్తే ఈకలు ఊడిపోతాయి), కోకిలలకు నేత్రాలలో, చిలక లకు ఎక్కిళ్ళు రూపంలో…ఇలా ప్రతీ జీవికి ఆవహంచే రూపాన్ని చెప్పి, మానవులకు జనన మరణ సందర్భాలలోనే కాక, జీవిత కాలంలో ఆవహస్తూనే ఉంటాడు. ఇది జ్వరం స్వరూ పం.” అని వివరించారు.
జ్వరం శివ తేజస్సు. శరీరంలో ప్రవేశించి పీడిస్తూ దు:ఖాన్ని కలిగిస్తూంటుంది. జ్వరంతో బాధపడేవారి కళ్ళు ఎర్రగా, ఉండి, శరీరం అధిక ఉష్ణోగ్రతతో ఉంటుంది. ఇలా జ్వరం యొక్క చరిత్ర చెప్పి, ఇది విన్నా, చదివినా, ఆరోగ్యవంతులు అవుతారు.” అని చెప్పి బ్రహ్మ, శివుడు అందరూ తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు.