కాకినాడ, ప్రభన్యూస్:ఆలయ పున:ప్రతిష్టలో కార్యక్రమాల్లో భాగంగా ధ్వజస్తంభ ప్రతిష్ట సమయంలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. తాళ్ళరేవు మండలం నీలపల్లి గ్రామంలో శ్రీ మీనాక్షీ సమేత నీలకంటేశ్వర స్వామి ఆలయ పున ప్రతిష్ట కార్యక్రమాలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర విచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వ#హంచారు. అయితే ఆలయ ప్రతిష్ట సందర్భంగా ధ్వజస్తంభం పైకి ఎత్తుతుండగా దానిని ముట్టుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు పోటీ పడ్డారు . దీంతో తాడు తెగిపోయి స్తంభం ఒక పక్కకి ఒరిగి పోయింది. ఈ నేపథ్యంలో ఒక మ#హళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఆ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన యానాం ఆసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి తీవ్రంగా గాయపడిన ఇరువురు క్షతగాత్రుల్ని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఆలయ పున:ప్రతిష్ట పూజల్లో పాల్గొనేందుకు వేల సంఖ్యలో నీలకంఠేశ్వర్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి బారులు దీరారు. ఓపక్క నీలకంఠేశ్వరుని దర్శనం, మరోపక్క స్వామీజీని చూసేందుకు ,ఆయన అనుగ్ర#హభాషణం వినేందుకు, ఆశీస్సులు తీసుకునేందుకు పోటీలుపడ్డారు. ధ్వజస్తంభాన్ని ప్రతిష్టాపన పూజల్లోనూ పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధ్వజస్థంభాన్ని చేతుల్తో తాకి దర్శనం చేసుకోవాలనే అతృతతో భక్తులు పోటీలుపడ్డారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మేడేపల్లి విజయరాజు, కాకినాడ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ పులి నారాయణమూర్తి, కాకినాడ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్, కార్యనిర్వా#హణాధికారి సలాది శ్రీరామచంద్రమూర్తి హాజరయ్యారు. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. స్వామీజీ చేతులమీదుగానే ప్రతిష్ట చేశారు. ముమ్మిడివరం, యానాం ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్, గొల్లపల్లి అశోక్ పాల్గొన్నారు. స్వామిజీ అనుగ్ర#హ భాషణం చేశారు. ప్రసాద వితరణ తో కార్యక్రమం ముగిసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement