Sunday, September 15, 2024

విభిన్నం… విలక్షణం సాయి మార్గదర్శనం!

ఒక సందర్భంలో బొంబాయికి చెందిన ఒక దళారి పత్తి వ్యాపారం చేద్దామన్న ప్రపోజల్‌ ఒకటి దామూ అన్నాకు ఇచ్చాడు. ఇప్పుడు యాభై, అరవై వేల రూపా యల పత్తిని కొని ఆరునెలల పాటు దాచి పెడితే అప్పుడు ధర లు బాగా పెరిగి రెండింతలు లాభం వస్తుంది కనుక ఆ వ్యాపా రంలో భాగస్వామి కావలసిందిగా అతను దామూ అన్నాను కోరాడు. సాయి అనుమతి లేకుండా ఏ పని చేసే అలవాటులేని దాము అన్నా ఈ వ్యాపారం విషయమై సాయికి ఉత్తరం రా యగా, ఆ ఉత్తరం చదవబోతున్న శ్యామాతో సాయి కోపంగా ”దామ్యాకు పిచ్చిగానీ ఎక్కిందా? అతని ఇంట దేనికీ లోటు లేదు కనుక లక్షల వెంట పరుగులు తీయద్దని అతనికి చెప్పు.” అని అన్నారు. శ్యామా నుండి వచ్చిన జవాబును చదివి దా మూ అన్నా లక్షలు పోతున్నందుకు ఒకింత నిరాశ చెందిన గు రువు ఆజ్ఞను శిరసా వ#హంచాడు. అతను తర్వాత శిరిడీ వెళ్ళి న్నప్పుడు సాయి పాదాలను వత్తుతుండగా అతని మదిలో ఒ క ఆలోచన వచ్చింది. ”నేను చేయాలనుకున్న పత్తి వ్యాపారం లో బాబాను భాగస్వామిని చేస్తానంటే ఈ వ్యాపారానికి బాబా ఒప్పుకుంటారేమో” అతని మనసులో ఆలోచల మెదిలినదే తడవుగా సాయి ”దామ్యా, దయచేసి నన్ను ఇ#హకపరమైన వ్యాపార సంబంధాలలో ఇరికించవద్దు” అని అన్నారు. తన ఆలోచన బాబాకు ఎంతో బాధను కలిగించినదని అర్ధం చేసు కున్న దామూ అన్నా అంతటితో ఆ సంగతిని వదిలేసాడు. మ రొక సందర్భంలో ధాన్యపు గింజల ధరలు విపరీతంగా పెరిగి పోతున్నందున ఒక వ్యాపారితో కలిసి ధాన్యపు గింజల వ్యా పారం చేద్దామనుకొని అందుకు బాబా అనుమతి అడిగాడు దామూ అన్నా. ఇప్పుడు ఒక యాభై వేలు మదుపు పెట్టి ధా న్యపు గింజలు కొని నిల్వ వుంచితే భవిష్యత్తులో వాటి ధరలు ఇంకా పెరిగి లక్షలు లాభాలు వస్తాయని దామూ ఆశ. అందు కు కూడా బాబా ఒప్పుకోలేదు. రెండవసారి కూడా లక్షలు సం పాదించే అవకాశాన్ని కోల్పోతున్నందుకు దామూ అన్నా తీ వ్రంగా నిరాశ చెందాడు. అయినా బాబా మాటలకు ఎదురు చెప్పలేక కిమ్మనకుండా వుండిపోయాడు. అయితే అంతలోనే వర్షాలు విపరీతంగా కురిసాయి. పంటలు విస్తారంగా పండి ధాన్యపు గింజల ధరలు విపరీతంగా పడిపోయాయి. జట్టి వ్యాపారం చేసిన ఆ వ్యాపారి పెట్టుబడులు కూడా రాక ఘో రంగా నష్టపోయాడు.
అప్పటికి గానీ బాబా సలహా విలువ దామూ అన్నాకు తెలిసిరాలేదు. ఈ రెండు సందర్భాలలో తనకు లక్షలు నష్టం రాకుండా సాయియే తనను కాపాడారని దామూ అన్నా ఉరఫ్‌ నానాసాహబ్‌ రాసనే నరసిం#హ స్వామీజీకి ఇచ్చిన వాం గ్మూలంలో పేర్కొన్నాడు.
ఒకసారి దామూ అన్నా అప్పీలు విచారణ బొంబాయి హకోర్టులో జరుగుతోంది. లాయర్‌ తక్షణమే బొంబయికి రమ్మని దామూ అన్నాను కోరాడు. శిరిడీలో వున్న దామూ అన్నా వెంటనే బాబా వద్దకు వెళ్ళి బొంబాయి వెళ్ళడానికి అనుమతి వేడగా బాబా ససేమిరా వద్దన్నారు. చేసేదేమీలేక దామూ అన్నా శిరిడీలోనే వుండిపోగా బొంబాయిలో విచార ణ పూర్తయి దామూఅన్నా పక్షాన్నే తీర్పు వెలువడింది.
ఒకసారి దామూ అన్నా ఇంట్లో దొంగతనం జరిగింది. అతని ఇంటిలో 33 సంవత్సరాల పాటు పనిచేసిన వంటవాడే ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. దామూ అన్నా కుటుంబం ఇంట్లో లేనప్పుడు తాళాలతో బీరువాను తెరిచి అతను నగలు, డబ్బుతో పరారైపోయాడు. జరిగిన విషయం తెలుసు కున్న దామూ అన్నా కుటుంబం తీవ్రమైన ఆవేదనకు లోన య్యింది. పోయిన నగలలో వారి పూర్వీకుల నుండి వస్తున్న నాసికాభరణం కూడా వుంది. అది పోవడం అశుభ సూచకం

అని అందరూ భావించారు.
దొంగతనం చేసినది తన వద్ద ఎంతో నమ్మకంతో పనిచేసిన వంట వాడేనని తెలుసుకున్న దామూ అన్నా మరింత ఆందోళన చెందాడు. అతని ఈవిధంగా చేయడం లో గల ఆంతర్యం అతనికి ఎంత ఆలోచించినా బోధపడలే దు. పోలీసుల ఎంక్వయిరీ మొదలయ్యింది. అయితే ఈ సమ స్య సామరస్య పూర్వకంగా పరిష్కరంపబడాలని దామూ అన్నా కుటుంబం మొత్తం సాయి ముందు మోకరిల్లి ప్రా ర్ధించారు. ఆశ్చర్యంగా ఆ మరునాడే ఆ వంటవాడు నాసి కాభరణంతో సహా దొంగలించిన నగలను తీసుకువచ్చి వారికి అప్పజెప్పి తాను పోలీసులకు లొంగిపోయాడు.
సాయి సమాధి వరకు ఆయన అనుమతి లేనిదే ఒక్క చిన్న పనైనా చేసేవాడు కాదు దామూ అన్నా. సాయి సమాధి చెందిన తర్వాత బాబా అనుమతి కోసం బాబా చిత్ర పటం వద్ద అవును, కాదు అని చీట్లు వేసి అప్పుడు వచ్చిన సమాధానం అనుగు ణంగా వ్యవహరించేవాడు. ఏ విషయంలో దా మూ అన్నా తప్పు అడుగు వేయలేదు. నష్టం జరగలేదు. సాయి మార్గదర్శకత్వం విభిన్న మైనది, విలక్షణమైనది, భక్తులను సదా సత్య మార్గంలో తీసుకొనిపోయేది.
దామూ అన్నా తన అనుభవాన్నిలా రాసాడు. ”బాబా గురించి నేను ఎంతో ఆలోచించేవాడిని. ఆయన పటం చూడ క ఒక్క క్షణం కూడా వుండలేకపోయే వాడిని. కొన్ని సందర్భాలలో బాబా నన్ను తిట్టేవారు. అయితే నాకు వెం టనే ఎంతో మేలు జరిగేది. అక్కల్‌ కోట స్వామి కూడా తన భక్తుల కోరికలను తీర్చే ముందు ఇలానే తిట్టడం, కొట్టడం చేసేవారు. అందుకని సాయి, అక్కల్‌కోట స్వామి ఒక్కరేనన్న విషయం తెలుసుకున్నాను. బాబా ఎ న్నిసార్లు తిట్టినా బాధనిపిం చేది కాదు. అట్లే నా భక్తి త గ్గలేదు.”

Advertisement

తాజా వార్తలు

Advertisement