Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : కార్తిక మాసములో సత్యనారాయణ వ్రత ఫలితం (ఆడి యోతో…)

కార్తిక మాసములో సత్యనారాయణ వ్రత ఫలితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ

బుద్ధిని, మనస్సును, జ్ఞానాన్ని, భక్తిని ప్రసాదించమనే ఎవరైనా ఎప్పుడైనా భగవంతుడిని కోరుకుంటారు. ఇవి కావాలంటే మానవులు పైన చెప్పిన వాటితో పాటు శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోవడానికి నియమములు అవసరం. నియమానికి వికృతి నోము. దానికి పర్యాయపదం వ్రతం. ఈ సమయంలో విష్ణు భక్తులు సత్యనారాయణ వ్రతం, శివభక్తులు కేదారేశ్వర వ్రతం జరుపుకుంటారు. అలాగే అమలకి, తులసీ కళ్యాణం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరుపుకుంటారు. గంగను శివుడు శిరమున దాల్చాడు. ఆ గంగ విష్ణు పాదోద్భవి. విష్ణువు సముద్రంలో, శంకరుడు హిమాలయంలో ఉంటారు. శంకరునిలో జ్ఞానం రాశీభవిస్తుంది, విష్ణువులో వరదలా పారుతుంది.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement