Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు 32(2) (ఆడియోతో…)

మహా భారతంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

నజన్యతే నాస్తికతా తస్య మిమాంస కైరపి
విష్ణే దేవేషు వేదేషు గురుషు బ్రాహ్మాణషుచ
భ క్తిర్భవతి కళ్యాణీ భారతా దేవ ధీమతామ్‌
ధర్మార్ధ కామ మోక్షాణాం భారతాత్‌ సిద్ధి రేవహి
అజిహ్మా భారత: పంధా: నిర్వాణ పదగామినామ్‌
మోక్ష ధర్మార్ధ కామానామ్‌ ప్రపంచో భారతే కృత:

మహాభారతమును చదివి దానిలోని విషయములను పరస్పరం చర్చించుకున్నచో నాస్తిక భావములు కలుగవు. శ్రీ మహావిష్ణువు యందు, దేవతల యందు, వేదముల యందు, గురువుల యందు, బ్రాహ్మణుల యందు మహా భారతమును వినినందువల్లనే బుద్ధిమంతులకు భక్తి కలుగును. మహా భారతము వలనే ధర్మార్ధకామమోక్షములు సిద్ధించును. మోక్షమార్గమున వెళ్ళు వారికి భారతమే వంకర లేని మార్గము. మహా భారతమున ధర్మార్థ కామ మోక్షములను విపులంగా వివరించియున్నారు. అందువల్ల బుద్ధిమంతులు, శ్రద్ధామంతులు మహా భారతమును చదివి సకల సిద్ధులను పొందవచ్చును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement