Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – 5 (ఆడియోతో..)


మహాభారతం విధుర నీతిలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

అజ్ఞో భవతి వైబాల: పితా భవతి మంత్రద:
ఆజ్ఞంహి బాల మిత్యాహు: పితే త్వేవతు మంత్రదాన్‌
పితా మహేతి జయదమ్‌ ఇత్యూ చుస్తే దివౌకస:

జ్ఞానము లేనివారు బాలురు, మంత్రము ఉపదేశించువారు తండ్రి, తలపెట్టిన కార్యములో విజయమును అందించిన వారు పితామహులు(తాత).

నిష్పక్ష పాతముగా వారి వారి కార్యములను విజయమును అందించు వారు భీష్ముడు కావున దృతరాష్ట్రునికి, దుర్యోధనునికి, ధర్మరాజునకు ఆయన పితామహుడు. విరాటపర్వంలో అజ్ఞాత వాసమునకేగే ముందు ధర్మదేవతను ప్రసన్నం చేసుకునే మంత్రమును పాండవులకు ఉపదేశించిన వాడు శ్రీకృష్ణుడు కావున ధర్మరాజు కృష్ణుడిని పితాత్వం మాతాత్వం అని పిలుస్తాడు.

పద్మ పురాణంలో దుర్యోధనుడు దూర్వాసనునికి కపట ప్రార్థన చేయగా ఆయన 12000 మంది శిష్యులను తీసుకొని ధర్మరాజు వద్దకు అన్నార్ధులై వెళ్ళి శృంగభంగం పొందినపుడు దూర్వాసుడు భీముడిని మీ ఆశ్రమానికి కొత్తవారు ఎవరు వచ్చారని అడుగగా భీముడు నవ్వుతూ భక్తితో మా పితామహులు వచ్చారని చెప్పారు. భీష్ముడు వచ్చాడని తలచిన దూర్వాసుడికి భీముడు శ్రీకృష్ణుడిని చూపించెను. అబద్ధమెందుకు ఆడావని దూర్వాసుడు భీముడిని ప్రశ్నించ గా రహస్యమంత్రమును చెప్పినవారు పిత మరియు తలపెట్టిన కార్యాలలో జయమునిచ్చిన వారు పితామహులని శాస్త్రము కావున మాకు రహస్య మంత్రమును చెప్పి ఈ విపత్తులో మా కార్యానికి విజయమునిచ్చిన శ్రీకృష్ణుడే పిత మరియు పితామహుడు కూడా అని వివరించెను.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement