Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు (ఆడియోతో…)


మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
4
యే నాస్తికా నిష్క్రియాశ్చ గురు శాస్త్రాతి లంఘిన:
అధర్మజ్ఞా గతాచారా: తే భవన్తి గతాయుష:

వేదముల యందు శాస్త్రముల యందు భగవంతుని యందు విశ్వాసము లేని వారు వేద శాస్త్ర విహిత కర్మల ను ఆచరించనివారు గురువు గారి ఆజ్ఞను శాస్త్రమును అతిక్రమించిన వారు ఆయువు క్షీణించిన వారయ్యెదరు.

ఆచారము అనేది గురువులను, పెద్దలను ఆశ్రయించుట మరియు ఆదరించుట. వీటిని పాటించుట వలన మనసు పరిశుద్ధమై ఉండును. శాస్త్రము భుజించరాదు అని చెప్పిన దానిని భుజించినందువలన శరీరము అనారోగ్యము పాలయ్యి ఆయుష్యము క్షీణిస్తుంది. శాస్త్రము మీద పెద్దల మీద గౌరవము లేదని చాటడానికే కొందరు కావాలని శాస్త్రము వద్దన్న పనులను చేసి సజ్జనులను, సాధువులను బాధపెడ్తారు. వారిని బాధపెట్టినందు వలన ఆయుష్యమును హరిస్తుంది. కావున అనాచారము వలన ఆయుష్యము హరించును. లోక ద్వేషము, శాస్త్ర ద్వేషము గురు ద్వేషము, దైవ ద్వేషము, గో ద్వేషము, బ్రాహ్మణద్వేషము, ఇంద్రుని అంతటి వానిని కూడా పతనము చేయును. గురువును అవమానించినందుకనే ఇంద్రుడు రాజ్యభ్రష్టుడైనాడని వృత్తాసుర గాధ ద్వారా తెలుస్తోంది.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement