Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : సుభాషిత సుధానిధి -2(ఎ) (ఆడియోతో…)


సాయణామాత్యులు అందించిన సుభాషిత సుధానిధికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

విప్ర సుమనసోహిత్వా బృంగవత్‌ దాన లిప్సయా
ఆశ్రయన్‌ నృప మాతంగ శీదేత్‌ శ్రుతి నిషేధత:

బ్రాహ్మణుడు పండితులను విడిచిపెట్టి దానము మీద ఆశతో రాజులను ఆశ్రయించరాదు. రాజులను ఆశ్రయించి వారి నుండి దానము తీసుకోరాదని వేదము నిషేధించినది కావున ఆ విధంగా చేసిన వారు కష్టాల పాలగుదురు. బ్రాహ్మణుడు తన జ్ఞానమును పెంచుకోవడానికి మరియు పంచుకోవడానికి తన తోటి పండితులను ఆశ్రయించాలి కానీ రాజులను కాదన్నది ఇందులోని నీతి.

శ్రీనాథుడు రాజులను ఆశ్రయించమని ఎంత చెప్పిననూ దారిద్య్రముతో ఒక పూట తిన్నా గానీ భగవంతుడిని, పండితుడిని మాత్రమే ఆశ్రయించిన పోతన ఈ విధంగా పలికెను.

బాల రసాల సాల నవ పల్లవ కోమల
కావ్య కన్యకన్‌ కూళల కిచ్చి
అప్పడుపుకూడు భుజించుట కంటే
సత్కవుల్‌ హాలికులైన నేమి

- Advertisement -

కవులు, పండితులు తమ కవితను తమ కుమార్తెగా భావిస్తారు. మరి ఆ కవితను రాజులకు అమ్మితే వారిచ్చిన రొక్కం తమ కుమార్తెను అమ్మగా వచ్చినట్టే అవుతుంది. ఆవిధంగా వచ్చిన రొక్కంతో సమకూరిన కూడు పడుపుకూడు కిందే లెక్క. దాని కన్నా నాగలి పట్టి భూమిని దున్ని వచ్చిన పంటతో లభించినంతే తింటామన్నారు పోతన. ఈవిధంగా రాజులను ఆశ్రయించమని బోధించిన శ్రీనాథుడికి చక్కని శ్లోకంతో బుద్ధి చెప్పాడు పోతన.

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement