Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు- – ధర్మ పద్ధతి (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

5. ధర్మ పద్ధతి
ధర్మ: శ్రుతో వా దృష్టోవా స్మృతోవా కధితోపివా
సంమోదితో వా రాజేన్ద్ర పునాతి పురుషం సదా

ధర్మము వినిననూ, చూచిననూ, తలచిననూ, చెప్పిన నూ, ఆమోదించిననూ ఆ పురుషుడిని పవిత్రుడిని చేయును.

ధర్మమును ఇతరులు చెప్పగా విన్నవారు, ఆచరించుచుండగా చూచిన వారు పవిత్రులయ్యెదరు. ధర్మసందేహము కలిగినపుడు, ఆ ధర్మము జ్ఞప్తికి వచ్చి ఇతరులకు ధర్మము చెప్పిన వారు కూడా పవిత్రులగుదురు. పూవును చూచినవానికి, తాకిన వానికి, ఇచ్చినవానికి, తీసుకొనిన వానికే కాక ఆ పూవు సుగంధమును తలచిన వానికి కూడా పూల వాసనా భావన ఆనందింప చేయును. ధర్మము పూవు వంటిదే, ఆ ధర్మము ఎట్లు సంభవించిననూ మనము పవిత్రులమయ్యెదము.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement