మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
దానపద్ధతి
17. కులం శీలం శ్రుతం శౌర్యం సర్వమేతన్నగణ్యతే
దుర్వృత్తేవా సువృత్తేవా జనో దాతరి రజ్యతే
దానము చేయువాడు ఏ కులము వాడు, ఎటువంటి శీలము కలవాడు, ఎంత చదువుకున్నాడు, శౌర్యము కలవాడా, పిరికితనమున్నవాడా, మంచి నడవడి కలవాడా, చెడు నడవడిక కలవాడా ఇటువంటి వాటిని పరిగణించరు. దాత అయితే చాలు అందరూ ఆనందించెదరు.
దాతృత్వము ముందర కుల శీలాదులు చిన్న బోవును. రాజు అయినా, సేవకుడైనా, పండితుడైనా, విద్యార్థి అయిననూ, బ్రహ్మాణుడైననూ ఏ జాతివాడైననూ దాన గుణము మాత్రమే ఆరాధించబడును, ఆశ్రయించబడును, అనుసరించబడును. దుర్యోధనుడు సార్వభౌముడైననూ ఇంద్రునితో సహా అందరూ కర్ణుడినే ఆశ్రయించారు, అర్థించారు. బలి చక్రవర్తిని విష్ణువు అర్థించినాడు. దాతే బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు. బ్రహ్మరుద్రాదులు కూడా దాతను అర్థించటం పురాణాలలో కనబడుతుంది.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి