Monday, November 25, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు — ధర్మ పద్ధతి (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

ధర్మ పద్ధతి
6. యస్య ధర్మవిహీనాని దినాన్యాయాన్తి యాంతిచ
సలోహకార భస్త్రేవ శృసన్వేపి న జీవతి

ధర ్మమును వినకుండా, చెప్పకుండా, చూడకుండా, తలచకుండా, ఆచరించకుండగా దినములు గడిపినవాడు గాలి పీ ల్చుకొనుచున్ననూ విడుచుచున్ననూ జీవిం చినవాడు కాదు.

లోహముతో పనిముట్లు చేయుటకు ఇనుమునను కాల్చినపుడు ఆ కొలిమి బాగా మండుటకు ఒక తోలు తిత్తితో ఊదినపుడు ఆ తోలుతిత్తి కూడా గాలిని వదులును మరియు పీల్చును. కానీ
తోలుతిత్తి ప్రాణం లేనిది అలాగే ధర్మ సంబంధము ఏవిధంగా లేని వాడు బ్రతికి ఉన్నా గాలిని పీల్చినా మరణించిన వానితో సమానము.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement