Thursday, November 21, 2024

ధర్మం – మర్మం : చైత్ర శుద్ధ సప్తమి (ఆడియోతో…)

శ్రీరామనవరాత్రులలో చెత్ర శుద్ధ సప్తమి నాడు పాటించవలసిన విధి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

చైత్రే మాసి సితె పక్షే సప్తమ్యాం మృగశీర్షకే
భాను సౌమ్య తదాంగార వార యోగే విశేషత:
తులసీ అర్చనం కార్యం హేమ పుష్పై: సుధీస్సదా
అనంత సంపత్సంపన్న: మోదతే భువి మానవ:

అని పద్మ పురాణ వచనం. చైత్ర శుద్ధ సప్తమినాడు మృగశిర నక్షత్రము ఆదివారం లేదా బుధవారం లేదా మంగళవారం నాడు వచ్చినచో తులసిని బంగారుపూలతో అర్చించాలి. ఈ విధంగా చేసినచో అనంత సంపదలు కలుగుతాయి.

లక్ష్మీనారాయణ పుజ్యే శయ్యాయాం స్థాప్య మానవ:
చైత్ర మాసే సితే తత్ర సప్తమ్యాం భక్తి సంయుత:
ధూప దీపై: తధా పుష్ప మాలికాభి: సుగంధిభి:
సంపూజ్య శయ్యాం లక్ష్మీనారాయణ యుతాంన ర:
బ్రాహ్మణాయ ప్రదాతవ్యం ఛత్రోపానహకంబలాన్‌
నిత్య సౌభాగ్య సద్విద్యాదా యాత్స ధన ధాన్యవాన్‌
లభతే కామితం సర్వందేవ దేవ ప్రసాదత:

అనునది విష్ణుధర్మోత్తర పురాణ వచనము. చక్కని శయ్యను సిద్ధము చేసి విభవానుసారముగా లక్ష్మీనారాయణుల ప్రతిమలను బంగారం, వెండి, రాగి, ఇత్తడి తో చేయించి ధూప దీప పుష్పమాలాదులతో చక్కగా పూజించి, సద్భ్రాహ్మణునికి శయ్యను ఆ ప్రతిమలతో దానము చేయవలెను. అలాగే ఛత్రము, పాదరక్షలను, శాలువను దానము చేయవలెను. యధా శక్తి దక్షిణను ఈయవలెను. ఈవిధంగా చేసిన నిత్య సౌభాగ్యము, సద్విద్య, చక్కని దాంపత్యము, ధనధాన్యములు, కోరిన అన్ని కోరికలు శ్రీహరి ప్రసాదించును.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement