Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : సంతృప్తి (ఆడియోతో…)

శ్రీమద్భాగవతంలోని సుభాషితం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

యదృచ్ఛాలాభ తుష్టస్య తేజో విప్రస్య వర్ధతే
తత్‌ ప్రశామ్యతి అసంతోషాత్‌ అంభ సేవ ఆశుశుక్షణి:

భగవంతుడు ఇచ్చిన దానితో సంతృప్తి పొందిన బ్రాహ్మణునకు తేజస్సు పెరుగుతుంది. అదే బ్రాహ్మణుడు అసంతృప్తి కనపరచినచో నీరుతో నిప్పుచల్లారునట్లు అసంతోషంతో తేజస్సు చల్లారును. లభించిన దానితో సంతోషించుటే సకల మానవుల కర్తవ్యమైననూ విశేషించి బ్రాహ్మణునికి ఈ సంతృప్తి చాలా అవసరం. బ్రాహ్మణుడు సంతృప్తి పొందనిచో జప తప హోమాదులతో సంపాదించిన తేజస్సు నీరుతో నిప్పు చల్లారునట్లు చల్లారును కావున బ్రాహ్మణుడికి సంతోషమే సంతృప్తి అదే బ్రాహ్మణత్వమును కాపాడును.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement