Saturday, November 23, 2024

ధర్మం – మర్మం : బుషి ప్రభోధం – ధ్యానం (ఆడియోతో)

ధ్యానం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శుభములకు, మంగళములకు ఆశ్రయమైన భగవంతుని యందు మనస్సుని ఉంచుట ధారణ అన్నాం. అలా ఉంచిన మనస్సును పరమాత్మ యందు ప్రవర్తింపజేయుట, అంటే ఒకసారి మనస్సు భగవంతుని పై నిలిచిన త రువాత మొత్తం భగవంతుని రూపాన్ని ఒకేసారి నిలుపుకోలేము కావున ఒక్కొక్క అవయవాన్ని ధృఢంగా నిలుపుకోవాలి. మొదలు పరమాత్మ పాదాల యందు మనసు నిలిపి పాదాలు తప్ప మరి వేటిపైనా ప్రవర్తించకుండా నిలుపగలుగుట ఆ తరువాత పిక్కలు, మోకాళ్ళు, ఊరువులు ఇలా ఒక్కొక్క అవయవం యందు మనస్సు నిలిపి దాని యందే ప్రసరించునట్లు చేయడాన్ని అనగా మనస్సు యొక్క ప్రవృత్తి కెరటాలను పరమాత్మ యందు ప్రసరింపచేయుటే ధ్యానము. ఇలా ధ్యానం చేయుటలో మనస్సుకు ప్రవర్తిం పజేస్తే భగవంతునివి కాని ఇతర గుణముల యందు మనస్సు వెళ్ళదు. అందుకే ధ్యానముతోటే భగవంతునికి సంబంధిం చని గుణములను తొలగించుకోవాలి.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement