గరుడ పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…
సదాచార్యుడు…
ఆచార్యస్య త ధాలోకే సంబంధ: సత్ వివర్థక:
ఇతరేషాంతు సంబంధ: సత్తా బాధక ఉచ్యతే
జ్ఞానవాన్ మధురాభాషీ సారా సార వివేకవాన్
దర్శనీయ స్వరూపశ్చ పరిశుద్ధ స్వభావక:
కృపా గాంభీర్య సంయుక్త: చిరోపాసిత సజ్జన:
సద్వృద్ధసేవక: నిత్యమ్ శి ష్యేభ్య: జ్ఞాన ధాయక:
ఏవం భూత: సదాచార్య: శిష్య ముజ్జీవయన్ బుధ:
ప్రతీ జీవుడు ఉత్తమాచార్య సంబంధముతోనే తన ఉనికిని నిలుపుకోగలడు. గురు సంబంధము కంటే ఇతర సంబంధము ఉనికిని చెడగొడుతుంది. జ్ఞానము కలవాడు మధురముగా మాట్లాడువాడు, సార అసార వివేకము కలవాడు, చూడముచ్చటైన శరీర సౌష్టవము కలవాడు, పరిశుద్ధమైన స్వభావం కలవాడు, దయా, గాంభీర్యము కలవాడు, చాలా కాలము నుండి సజ్జనులను ఉపాసించువాడు, సజ్జనులైన వృద్ధులను సేవించువాడు, నిరంతరము శిష్యులకు జ్ఞానమును అందించాలనే తపన ఉన్న సదాచార్యుడు శిష్యుని సంసారం నుండి ఉజ్జీవింపచేయును.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి