Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 26 (ఆడియోతో…)

హరివంశంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

కోటి జన్మ కృతం పాపం కృషిరిత్యుచ్యతే బుధై:
తన్నాశన కరోదేవ: కృష్ణ ఇత్య అభిధీయతే

కోట్ల కోట్ల జన్మలలో చేసి పాపానికి కృషి అని పేరు. ఆ కోటి జన్మల పాపాలని నశింప చేసే వాడిని కృష్ణుడు అంటారు.

ప్రతీ జీవుడు కోటానుకోట్ల జన్మలెత్తి ప్రతీ జ న్మలోను సుఖాన్ని పొందడానికి, దు:ఖాన్ని తొలగించుకోవడానికి కృషి చేస్తూనే ఉంటాడు. అంటే సహజంగా వచ్చే దానిని వద్దని, ఎంత ప్రయత్నించినా రాని దానిని కోరుకుంటాడు. భగవంతుడు ఇచ్చే దానిని వద్దని, ఇవ్వని దాని కోసం చేసే కృషి భగవంతుడి సంకల్పానికి వ్యతిరేకం కావున కృషిని ‘పాపము’ గా పేర్కొంటారు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం..’ అని నానుడి. దుర్భిక్షం అనగా కరువు కాటకాలు. కృషి చేస్తే కరువుకాటకాలు ఉండవనేది లోక వ్యవహారంలో సామాన్య అర్థమైన పాపం చేసే వారికి కూడా కరువు కాటకాలుండవు. పాపపు ఆలోచనల కలగడానికి, పాపం చేసే శక్తి కోసం, పాపులతో సహవాసం చేయడానికి కావాల్సిన శక్తి, ఆహారం, మొదలగువాటిని పాపం చేసేవారికి భగవంతుడే సమకూరుస్తాడు. ఇదంతా సొంత ఘనతే అని అహం పెరిగి ఆ అహంతో మరిన్ని పాపాలు చేస్తారు కావున జీవనం కోసం కృషి చేసేవారందరూ తాము చేసే ప్ర తీ పనిలోను కృష్ణ కృష్ణ అని స్మరించుకోవాలి. చేసిన పాపాల్ని నశింప చేసేవాడు కృష్ణుడు కావున కృష్ణ అను శబ్ధము పలుకుతూ చేసిన పాపం కూడా పుణ్యం అవుతుంది. భగవంతుడు పాపాన్ని పోగొతాడు అంటే పాపపు ఆలోచలను పోగొతాడు. ఆయన ఉండేది హృదయంలోనే కావున సంకల్పాన్ని, బుద్ధిని ఇచ్చేవాడు ఆయనే కావున కోటానుకోట్ల జన్మల పాపాలను పోగొట్టేవాడు కృష్ణుడు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement