గరుడ పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….
ఆచినోతిహి శాస్త్రాణి ఆచారే స్థాపయత్యపి
స్వయం ఆచరతే యస్మాత్ ధర్మాంశ్చ ఆచినోతి సఆచార్య:
సహివిద్యాత: తం జనయతి తస్య
తత్ శ్రేష్ఠం జన్మ శరీర మేవ మాతా పితరౌ జనయత:
క్రయశ్చ పరివృత్తిశ్చ విభాగశ్చ విశేషత:
ఆదశాహాత్ నివర్తంతే నని వర్తేత
తత్ జ్ఞానమ్ యత్ గురు: సంప్రయచ్ఛతి
సకల శాస్త్రములను తాను అధ్యయనం చేసి తనలో నిలుపుకొని, తాను తెలుసుకున్న శాస్త్రములు చెప్పిన ఆచారములో శిష్యులను నిలుపుతూ, తాను కూడా ఆ ధర్మాలను ఆచరిస్తూ, శాస్త్రములు బోధించే సకల ధర్మాలను తనలో నిలుపుకొనేవాడు ఆచార్యుడు.
ఉత్తమమైన ఈ జన్మలో తల్లిదండ్రులు కేవలం శరీరాన్ని మాత్రమే ఇస్తారు కానీ ఆచార్యుడు విద్యను, వివేకాన్ని, విజ్ఞానాన్ని కలబోసిన శరీరాన్ని అందిస్తాడు. మరణానంతరం చేసిన వ్యవహారాలు, వ్యాపారాలు, కర్మలు, సంపాదించిన ఆస్తి అన్నీ ముగుస్తాయి కానీ ఆచార్యుడు ప్రసాదించిన జ్ఞానం, విజ్ఞానం, వివేకం, సంస్కారం జన్మజన్మలకు వెన్నంటే ఉంటాయి. అందుకే ఆచార్యుని అవమానించిన వారికి ఏ శాస్త్రమూ ప్రాయశ్చిత్తాన్ని తెలియజేయలేదు.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి