Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు – 18 (ఆడియోతో…)

గరుడ పురాణంలోని ఋషి ప్రబోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

కౌపీన ఆచ్ఛాదన ప్రాయ వాంఛా కల్ప ద్రుమాదపి
జాయతే యదపుణ్యానాం సోపరాధ: స్వదోషజ:

రహస్యమైన అవయవాలను కప్పుకొనుటకు కావాల్సిన వస్త్రములను సంపాదించాలని, కల్పవృక్షాన్ని కూడా కోరాలనే కోరిక – పాపము చేసిన వారికి మాత్రమే కలుగుతుంది. అటువంటి వారికి ఆ అపరాధ ము తాము చేసిన దోషం వలన ఏర్పడుతుంది.

శరీరమును ఇచ్చిన భగవంతుడు పశుపక్ష్యాదులకు తప్ప సుర, నర, యక్ష, రాక్షస, విద్యాధర, గుహ్యకాది సకల జీవులకు శరీరమును వస్త్రముతో కప్పుకొను సాంప్రదాయమును ఏర్పరిచారు. ఒంటిని కప్పడానికి వస్త్రము, ఆ శరీరాన్ని ఎండ, వాన, చలి నుండి కాపాడడానికి ఇల్లు, ఆ శరీరంలో ప్రాణ బలం చేకూరడానికి ఆహారాన్ని ఏర్పరిచారు. ప్రతీ ప్రాణికి వీటిని ఆ భగవంతుడే సమకూరుస్తున్నారు. సహజంగా పరమాత్మ అందించిన దానితో తృప్తి చెందక చీనిచీనాంబరాలను, ఏడంతుస్తుల మేడలను, పంచభక్ష్య పరమాన్నాలను కావాలని కోరికల ఊబిలో కూరుకుపోతున్నారు మనుష్యులు. తాను చక్కగా ఉంటూ ఇతరులు నాశనం కావాలని కోరుతున్నారు. ఎంతటి గొప్ప కోరికనైనా తీర్చగల కల్పవృక్షము ఎదురైనపుడు తనకు ఏమి కావాలో కాక ఎదుటివారికి ఏమి వద్దో కోరుకుంటున్నారు. ఈ అపరాధము అసూయ, ఈర్ష్య, ద్వేషము, అజ్ఞానము, స్వార్థము అనే వాటి వల్ల కలుగుతుంది.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement