Thursday, November 21, 2024

ధర్మం – మర్మం : బుషి ప్రభోధములు -3 (ఆడియోతో)

భాగవతంలోని ఋషి ప్రభోదం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ….

గుణాధికాత్‌ ముదం లిప్సేత్‌ అనుక్రోశం గుణాధమాత్‌
మైత్రీం సమానాత్‌ అన్విచ్ఛెత్‌ నతాపై రభి భూయతే

మానవుడు తన కంటే మంచి గుణములు కలవాడిని చూచి తన కంటే గొప్ప వాడా అని అసూయ చెందుతాడు. అన్నీ దుర్గుణాలు, దురభ్యాసాలు ఉన్నవారిని చూచి అసహ్యించుకుంటాడు. అన్ని విధాలా తనతో సమానంగా ఉండే వాడిని చూచి అసహనానికి గురవుతాడు. ఇలా అసూయ, అసహ్యం, అసహనం ఇవి మనస్సును బాగా తపింపచేస్తాయి అనగా కాల్చేస్తాయి. భాగవతంలో ఈ తాపాలను ఎలా జయించాలో వివరించబడింది. భగావతానుసారం… తనకంటే ఎక్కువ ఉత్తమ గుణాలున్న వారిని చూచి ఎంత మంచివాడో అని సంతోషించాలి. గుణహీ ణున్ని చూసి గుణ హీనుడయ్యాడా అని జాలి పడాలి. ఇక తనతో సమానుడిని చూసినపుడు మేము ఇద్దరం ఒకటే అని అతనితో మైత్రి చేయాలి. ఇలా సంతోషంతో అసహనాన్ని, జాలితో అసహ్యాన్ని, మైత్రితో అసూయను తొలగించుకున్నవాడికి ఏ తాపాలు , సంతాపాలు ఉండవు.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement