Thursday, November 21, 2024

ధర్మం – మర్మం :

గంగా జలం మర్త్యలోకం చేరు విధానంలో భాగంగా గౌతముని ఆశ్రమంలోని వృత్తాంతం గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

గౌతమ మహర్షి ఆశ్రమంలో కొన్ని రోజులు నివసించన వినాయకుడు ఇతర బ్రాహ్మణులతో గౌతమ మహర్షి పోషణలో ఉండడం కంటే పవిత్రమైన తమ తమ ఆశ్రమములకు తిరిగి వెళ్ళిపోయెదమని ప్రతిపాదించెను. ఇదే విషయమును గౌతమ మహర్షి వద్ద ప్రస్తావించగా మునిశ్రేష్ఠులైన వారందరకీ పాదసేవ చేయుచూ పుత్రుని వలె సేవిస్తున్న తనకు ఆ భాగ్యము లేకుండా చేయొద్దని గౌతముడు ప్రార్థించెను. ఈ ఆశ్రమము పరమపావన మైనదని మరొక చోటుకు వెళ్ళవలసిన అవసరం లేదని కూడా పలికెను. గౌతమునికి విఘ్నము కలిగించాలన్న తలంపుతో విఘ్నేశ్వరుడు గౌతముడు మనల్ని ఆశ్రమం నుండి వెళ్ళకుండా ఎందుకు నివారిస్తున్నాడని ఇతర మునులు, ఋషులకు సందేహం కలిగించెను. గౌతమ మహర్షి మహానుభావుడు, ఉపకారి కావున సామోపాయంతో అంగీకరింపచేయలేమని కాని దండించజాలమని బుద్ధిబలంతోనే అతనికి విఘ్నం కలిగించడానికి అందరూ ఆమోదించి సహకరించాలని ఋషులను గణపతి ప్రార్థించె ను.

-శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement