కార్తిక కృష్ణ చతుర్ధి గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
కార్తిక కృష్ణ చతుర్ధిని కరక చతుర్ధి అంటారు. ఈ చతుర్ది నాడు 5 కలశాలతో దగ్గర్లో ఉన్న నది నుండి తీర్థము తీసుకొచ్చి ఆ జలముతో గోవుకు స్నానం చేయించి ఆ జలంలో లక్ష్మీనారాయణులను ఆవాహన చేసి పూజించి యధాశక్తి పక్వాన్నాలను నివేదన చేసి వస్త్రాభరణాలతో అలంకరించి ఆ గోవును, కలశమలును బ్రాహ్మణులకు దానం చేయవలెను. బ్రాహ్మణులకు శక్తిమేరకు వ స్త్రాభరణాలను, దక్షిణ ఇచ్చి వారిని భుజింప చేసి బంధుమిత్రులతో కలిసి భుజించి మరునాడు ఉద్యాపన చేయవలెను. దీనినే కరక వ్రతం అని అందురు.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి