Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : కార్తీక శుద్ధ ద్వాదశి (ఆడియోతో…)

కార్తీక శుద్ధ ద్వాదశి గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

కార్తీక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా వ్యవహరించెదరని స్కాంద, పద్మ పురాణం ద్వారా తెలుస్తోంది. ఆరోజున ధాత్రీ వృక్షము క్రింద లేదా ధాత్రీ వనములో యధోక్త విధిగా తులసీ-ధాత్రీ వివాహము జరిపించి ఆ వనములోనే శక్త్యానుసారము పక్వాన్నములు చేసి లక్ష్మీ నారాయణ స్వరూపులైన తులసీధాత్రులకు నివేదన చేయవలెను. బ్రాహ్మణులకు, బంధువులకు, పేదసాదలకు భోజనాలు పెట్టి శక్తిమేరకు గో,భూ,సువర్ణ దానాదులతో సత్కరించి వారి అనుమతితో కుటుంబంతో కలిసి భుజించి ఆనాటి రాత్రి ఇంటి వద్ద జాగరణ చేయవలెను. మరునాడు ఉదయమే అనగా కార్తీక శుద్ధ త్రయోదశి నాడు స్నానమాచరించి దేవదేవుని ఆరాధించి కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రత సమాప్తి గావించవలెను.

– శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement