Saturday, November 23, 2024

ధర్మం – మర్మం – హోళీ ప్రాశస్త్యం మరియు అంతరార్థం…(ఆడియోతో)

పురాణాల్లో హోళీ ప్రాశస్త్యం మరియు అంతరార్థం గూర్చి శ్రీమాన్‌ డా.కందాడై రామానుజాచార్యల వారి వివరణ

సతీవియోగం తర్వాత భార్యావిముఖుడైన శంకరుడు విరక్తి కలిగి ఘోర తపస్సు చేయనారంభించెను. స తీదేవి పార్వతిగా మరో జన్మ ఎత్తగా ఆమెతోనే శివునికి మరల వివాహం చేయదలచిన దేవతలు, ఋషులు, నారదుడు పార్వతిని శంకరునికి వద్దకు పంపెను. పార్వతి శంకరునికి సపర్యలు చేసినా ఆయన చలించలేదు. శంకరుడి దృష్టి పార్వతిపై మరల్చడానికి ఇంద్రుడు మన్మథుడిని పంపెను. మన్మథుడి పూలబాణంతో తపోభంగమైన శివుడు ఆగ్రహించి తన మూడో నేత్రమును తెరచి మన్మథుడిని భస్మం చేసెను.
మన్మథదహనం (కామదహనం) జరిగిన తర్వాత రతీదేవి భర్తకై విలపించి శంకరునిని ప్రార్థించినపుడు శంకరుడు అనుగ్రహించి శరీరం
లేకుండా మన్మథుడిని మరల బ్రతికించాడు. ఈ విషయం మన్మథుని ప్రాణమిత్రుడైన వసంతునికి తెలిసి ఆనందంతో ప్రకృతి అంతా నిండాడు. అనగా చెట్లు చిగురించి పువ్వులు పూసి కాయలు కాసాయి. మన్మథుడు బ్రతికాడని ప్రకృతే రంగులు చల్లుకున్నది. ఈ రంగులను చూసిన వారి మనస్సు ఉప్పొంగి వారు కూడా రంగులను చల్లుకున్నారు. ప్రియుడు (మన్మథుడు) మరలా బతికాడని తెలుసుకున్న హోళిక అను రాక్షసి(రతి) కూడా ఆనందంతో శరీరాన్ని రంగులమయం చేసుకుంది. ఆమె పేరు మీదే రంగుల పండుగ హోళీ అయింది. ప్రకృతి ఆనందిస్తే చెట్లు, చేమలు రంగులు పులుముకుంటాయి. మానవుడు ఆనందిస్తే అనురాగం, ఆప్యాయత, ఆహ్లాదం రంగులై పారతాయి. మన్మథుడు శరీరం లేకుండా బ్రతకడం అంటే నిజమైన ఆనందం శరీరంతో పొందేదికాదు ఆనందం అంతా ఆత్మదే అని అర్థం. ఆత్మకు శరీరం వస్త్రం మాత్రమే. ఈ పరమార్థాన్ని, అంతరార్థాన్ని లోకానికి అందించేది హోళీ. రంగులు చల్లుకోవడంలో మానవతను, దైవభావనము, సకల జనసౌభాగ్యాన్ని అందజేసిననాడు సమాజమంతా రంగులు వెల్లివిరుస్తాయి. శరీరాత్మ విజ్ఞాన్నాన్ని పెం చే పండుగే హోళీ.

– వాయిస్‌ ఓవర్‌ : గూడురు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement