శ్రీరామనవరాత్రులలో చైత్రశుద్ధ చవితి రోజున పాటించవలసిన విధి గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
చవితి రోజున తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం ఆచరించి నూతన వస్త్రములు ధరించి ఇష్ట దైవాన్ని ఆరాధించి తమ తమ విభవానుగుణంగా దానధర్మములను ఆచరించాలి.
చైత్రంతు సకలం మాసం శుచి: ప్రయత మానస:
లౌహిత్యతోయే య: స్నాయాత్ సకైవల్య మవాప్నుయాత్
చైత్ర మాసము మొత్తము పావనమైనదే. లౌహిత్యమనగా బ్రహ్మపుత్ర: అనగా ఈ మాసమున బ్రహ్మపుత్ర నదీ జలమున స్నానము చేసిన వారు కైవల్యమును పొందెదరు.
బ్రహ్మపుత్ర మహాభాగ శంతనో: కులసంభవ
అమోఘ గర్భ సంభూత పాపం లౌహిత్య మేవచ
- Advertisement -
ఈ మంత్రము పఠిస్తూ స్నానము ఆచరించవలెను. ఈ విధంగా చైత్రమాసమంతా ఆచరించిన పుణ్యప్రదం.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి