శ్రీరామనవరాత్రులలో చైత్ర శుద్ధషష్ఠి నాడు పాటించవలసిన విధి గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
చైత్ర శుద్ధ షష్టి కుమార స్వామిని పూజించాలి. ఆనాడు కుమార షష్టి అని స్కాందమున వివరించబడినది. మదన షష్టి అని బ్రహ్మవైవర్తం ద్వారా తెలుస్తోంది. కావేరీ, తుంగభద్రా, కృష్ణవేణీ నదులు చైత్రశుద్ధ షష్టినాడే ఆవిర్భవించాయని పద్మ పురాణంలో తెలుపబడినది. చైత్ర శుద్ధ షష్టి నాడు ఈ నదులు అన్నిటిలో కానీ ఒక దానిలో కానీ స్నానం చేసి శక్తి కొలదీ బంగారము, ఇత్తడి, నూతన వస్త్రాలు, పాదరక్షలు, గొడుగు, కంబలి దానము చేసిన అనంత ఫలము లభిస్తుంది. రతీమన్మధులను షోడశోపచారములతో, మల్లెపూలతో పూజించి సత్ బ్రాహ్మణునకు శయ్యాదానము చేసిన స్త్రీ కి సర్వదా సౌభాగ్యం, నిత్యము భర్తృ సుఖము, సంతాన సౌభాగ్యము కలుగుతుందని వారాహోక్తి.
శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి